E-Paper
Advertisement

Thalaivar 173: రజనీ మూవీ.. యంగ్‌ సెన్సేషన్‌ సాయి అభ్యంకర్‌ సంగీతం

Thalaivar 173: రజనీ మూవీ.. యంగ్‌ సెన్సేషన్‌ సాయి అభ్యంకర్‌ సంగీతం
Advertisement

Sai Abhyankar Works Thalaivar 173: ఈ రోజుల్లో టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తే చాలు. అప్పుడు కంప్లీట్ టాలెంట్ బయట పడితే అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఒక సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో అదే స్థాయిలో మ్యూజిక్ కూడా కొన్ని సినిమాలకు కీలకపాత్ర వహిస్తుంది. కొన్ని సినిమాలను అసలు మ్యూజిక్ లేకుండా ఊహించలేము. మామూలు సీన్స్ కూడా విపరీతమైన ఎక్సైజ్మెంట్ కలిగేలా అనిపిస్తున్నాయి అంటే దానికి కారణం వెనక వచ్చే బ్యాగ్రౌండ్ స్కోరే. హీరోకి ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చేది బ్యాగ్రౌండ్ సంగీతమే. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో డైరెక్టర్-నిర్మాత ఆచీతూచి ఎంచుకుంటున్నారు. 

పాన్ఇండియా చిత్రమైన మ్యూజికే బలం..

Advertisement

ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పగానే సినిమా ఫలితంగా తేలిపోతుందనడం  సందేహం లేదు. అలానే ఒక్క ప్రేక్షకుడిని సినిమా వరకు నడిపించాలి అంటే సంగీతం కీలక పాత్ర వహిస్తుంది. చాలామంది దర్శక నిర్మాతలు అందుకనే వాళ్ల సినిమాలలో మంచి హిట్ సాంగ్ ఉండాలి అని ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈరోజుల్లో మంచి సక్సెస్ సాధించిన అన్ని సినిమాలు కూడా ముందు పాటలు విజయం సాధించినవే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా డ్యూడ్. ఆ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్

ఇప్పటికీ కూడా ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డ్యూడ్ సినిమాకి సంబంధించిన పాటలు దానికి సంబంధించిన రిల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకి సంగీతం అందించాడు సాయి అభియాన్కర్. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో సాయి అభియాన్కర్ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు. భారీ ప్రాజెక్టు సినిమాలకు కూడా సాయికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తమిళ దర్శకులు. రజినీకాంత్ 173 వ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సుందర్ దర్శకత్వం వహిస్తాడు అనుకున్న ఈ సినిమా ఇప్పుడు అతని దర్శకత్వంలో జరగడం లేదు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది క్లారిటీ లేకపోయినా సంగీత దర్శకుడుగా మాత్రం సాయి ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. 

Advertisement

Also Read: MSG-Venkatesh: MSGపై వెంకిమామ అప్డేట్‌.. షూటింగ్పూర్తి!

తెలుగులో కూడా ప్లానింగ్

దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అలానే తెలుగు సినిమా దర్శక నిర్మాతల గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భాషలో అద్భుతమైన సంగీతం ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు అంటే అతనిని తెలుగు సినిమాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హేషం అబ్దుల్ హృదయం సినిమాతో మంచి పేరు సాధించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు దర్శకులు అంతా కూడా అతనిని పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇక సాయి విషయానికొస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాను అతనే చేస్తున్నాడు. ఇప్పుడు రజనీకాంత్ సినిమా కూడా చేసిన తర్వాత, తెలుగు హీరోలు కూడా అతనిని సంగీత దర్శకుడిగా పెట్టుకోవడం కోసం ఎదురు చూస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×