E-Paper
Advertisement

MSG-Venkatesh: MSGపై వెంకిమామ అప్‌డేట్‌.. షూటింగ్‌ పూర్తి!

MSG-Venkatesh: MSGపై వెంకిమామ అప్‌డేట్‌.. షూటింగ్‌ పూర్తి!
Advertisement

MSG-Venkatesh Shooting Completed: ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది కానీ స్వచ్ఛమైన తెలుగు సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఒక చక్కని కుటుంబ కథ చిత్రం తీస్తే ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ దానిని ఆదరిస్తారు. ఇది ప్రూవ్ చేసిన అతి కొద్ది మంది దర్శకులు లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. మంచి సినిమాలు చేయడం మాత్రమే కాకుండా దానిని ప్రేక్షకులలోనికి ఎలా తీసుకెళ్లాలో బాగా అనిల్ రావిపూడి కి తెలుసు. ఒక అద్భుతమైన పాయింట్ రాసుకుని దానిని కామెడీగా చెప్పడమే అనిల్ రావిపూడి స్ట్రెంత్. 

వెంకిమామ షూటింగ్ పూర్తి

Advertisement

సినిమాస్ లో అవుతుంది అనుకునే టైంలో అదిరిపోయే మాస్ మూమెంట్ ఒకటి తన సినిమాల్లో క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వెంకటేష్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్లు ట్విట్టర్ వేదికగా వెంకి మామ తెలిపారు. చాలామంది ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలంటే విపరీతంగా ఇష్టపడుతుంటారు. అయితే ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో అనే ఊహే అద్భుతంగా ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి దాని నిజం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విక్టరీ వెంకటేష్ ను ఒక కీలక పాత్రలో తీసుకున్నారు.

Also Read: Nov 2025 Hits And Flops: నవంబర్హిట్స్‌-ప్లాప్స్‌.. మేకర్స్ని నిండా ముంచిన చిత్రాలివే!

Advertisement

మెగాస్టార్ తో చేయడం నా డ్రీమ్

ఇద్దరూ కలిసి ఒక పాటకి స్టెప్స్ వేస్తున్నట్లు కూడా బయటకు వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి విక్టరీ వెంకటేష్ స్పందించారు. మనశంకరవరప్రసాద్ గారు కోసం ఈరోజు నా పాత్రను ముగించాను, మరియు అది ఎంత అద్భుతమైన అనుభవం! నాకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మరియు ఈ చిత్రం నాకు చాలా అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ‘మెగాస్టార్ చిరంజీవి’ తో స్క్రీన్ పంచుకోవాలని చాలా కాలంగా ఉంది. అనిల్ రావిపూడి చివరకు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం మమ్మల్ని ఒకచోట చేర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ లవ్ సింబల్ పెట్టారు. 2026 సంక్రాంతి సీజన్ వరకు ఉండలేకపోతున్నాను అంటూ తన ఉత్సాహాన్ని వెల్లడించారు వెంకిమామ.

పల్స్ తెలిసిన దర్శకుడు

అనిల్ రావిపూడి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ సీన్స్ పెడితే వర్క్ అవుట్ అవుతాయో అనే పల్స్ చాలా క్లారిటీగా అనిల్ కు తెలుసు. అయితే అనిల్ రావిపూడి సినిమాలు అంతమందికి ఎక్కవు కానీ కొంతమందికి విపరీతంగా ఎక్కుతాయి. ఆ సినిమాలను థియేటర్స్ లో పడి పడి నవ్వుతూ మరీ చూస్తారు అదే అనిల్ స్ట్రెంత్. ఇక వెంకటేష్ చిరంజీవి ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడటం అనేది మంచి ఫీలింగ్ అని చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం మూవీపై విపరీతమైన బజ్నెలకొంది. ఇంతవరకు ప్లాప్లేని అనిల్రావిపూడితో మెగాస్టార్మూవీ అనగానే అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు వెంకీమామ గెస్ట్అప్పియరెన్స్మూవీ మరింత బజ్పెంచింది.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×