E-Paper
Advertisement

Thalaivar 173లో టైలర్‌గా కనిపించబోతున్న రజనీకాంత్.. కథ మొత్తం లీక్..!

Thalaivar 173లో టైలర్‌గా కనిపించబోతున్న రజనీకాంత్.. కథ మొత్తం లీక్..!
Advertisement

Thalaivar 173: సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆయన నటించబోయే కొత్త సినిమా పేరు తలైవర్ 173గా ప్రస్తుతం పరిగణిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రజనీకాంత్ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారంట.

ప్రస్తుతం వస్తున్న బలమైన సమాచారం ప్రకారం..ఈ సినిమాలో ఆయన టైలర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆయన కెరీర్‌లో చాలా భిన్నమైన పాత్ర కావడంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి పెరిగింది.

Advertisement

ఇప్పటివరకు యాక్షన్..మాస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్.. ఈసారి మాత్రం కథకు ప్రాధాన్యం ఉన్న సాధారణ వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారు. టైలర్‌గా ఆయన నటన ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాత్రలో ఆయన నటన చాలా సహజంగా.. నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

తలైవర్ 173 సినిమా 2022లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ది ఔట్‌ఫిట్ నుంచి ప్రేరణ పొందిందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథ మొత్తం ఆ సినిమా నుంచి ప్రేరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో ఒక చిన్న టైలర్ షాప్ చుట్టూ తిరిగే కథ, డ్రామా, సస్పెన్స్ ప్రధానంగా ఉంటాయి. ఇదే తరహాలో ఈ సినిమాకూడా బలమైన కథతో.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఈ కథ గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

మొదట ఈ సినిమాకు దర్శకుడిగా సుందర్ సీ వ్యవహరించాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను సిబి చక్రవర్తి తీసుకున్నారు. ఈ మార్పు అభిమానులను ఆశ్చర్యపరిచినా, సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రానికి సంగీతం అందించేది యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ తరహా కథలకు బాగా సరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో కీలక పాత్రల కోసం పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించే అవకాశం ఉందని టాక్. అయితే వీరిద్దరికీ రజనీకాంత్‌తో ప్రేమ కథ ఉండదని సమాచారం. ముఖ్యంగా ప్రియాంక మోహన్ పాత్ర కథను ముందుకు నడిపించే ముఖ్యమైన పాత్రగా ఉంటుందని చెబుతున్నారు. పూజా హెగ్డే పాత్ర కూడా కథకు బలంగా ఉండే అవకాశం ఉందట.

ఇంకా ఒక అనుభవజ్ఞురాలైన సీనియర్ నటి కూడా ఈ సినిమాలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా మూడు బలమైన మహిళా పాత్రలతో రూపొందే అవకాశముంది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ఏప్రిల్ నెలలో తలైవర్ 173 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను పొంగల్ 2027 సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: The Raja Saab OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ది రాజా సాబ్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×