E-Paper
Advertisement

Google Theft Protection: మీ ఫోన్‌ను దొంగిలించారా? ఇక ఆ దొంగకే రిస్క్.. గూగుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే!

Google Theft Protection: మీ ఫోన్‌ను దొంగిలించారా? ఇక ఆ దొంగకే రిస్క్.. గూగుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే!
Advertisement

Google Theft Protection: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాదు.. మన పర్సనల్ బ్యాంక్, ఫొటో గ్యాలరీ, ఆఫీస్ ఫైల్స్‌కు ఒక లాకర్‌లా మారిపోయింది. అందుకే ఫోన్ పొరపాటున ఎక్కడైనా మర్చిపోయినా లేదా ఎవరైనా దొంగిలించినా.. ఫోన్ ధర కంటే అందులో ఉన్న పర్సనల్ డేటా ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే మనల్ని ఎక్కువగా వేధిస్తుంది.

ఈ భయానికి చెక్ పెడుతూ తాజాగా గూగుల్ ఓ అద్భుతమైన అప్‌డేట్ తీసుకొచ్చింది. ఒకవేళ మీ ఫోన్ ఎవరైనా లాక్కెళ్లినా లేదా దొంగిలించడానికి ప్రయత్నించినా.. మీ డేటా దొంగ చేతికి చిక్కకుండా గూగుల్ కొత్త ఫీచర్లు రక్షణ కల్పిస్తాయి. అసలు గూగుల్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏమిటి? దొంగల నుంచి మీ ఫోన్‌ను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫోన్‌‌‌‌ను దొంగ ఎత్తుకెళ్తే?

Advertisement

సాధారణంగా ఫోన్‌ను కొట్టేసిన దొంగ దానిని రీసెట్ చేయడమో లేదా వెంటనే స్విచ్ఛాప్ చేయడమో చేస్తాడు. కానీ ఇకపై అలా కుదరదు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ నేరుగా దొంగలకే సవాల్ విసురుతోంది. మీ ఫోన్‌ను ఎవరో లాక్కున్నారని తెలియగానే, అది తనను తాను లాక్ చేసుకుంటుంది. అంటే.. దొంగ చేతిలో ఫోన్ ఉన్నా అది ఆన్ అవ్వదన్నమాట.

Also Read: శాంసంగ్ కొత్త ‘సీక్రెట్ ఫీచర్’.. మీ పర్సనల్ చాట్స్ ఇక సేఫ్, ఎవరికీ కనిపించవు!

డేటా లీకయ్యే ఛాన్స్ లేదు:

Advertisement

కొంతమంది ఫోన్ పోతే కొత్తది కొనుక్కోవచ్చులే అనుకుంటారు. మరికొంతమంది ఫోన్‌లో ఉన్న పర్సనల్ డేటా దొంగల చేతికి చిక్కితే ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. తాజాగా గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఇలాంటి వాటికి చెక్ పెడతాయి. ఫోన్ మీ చేతిలో నుండి వేరొకరి చేతికి వెళ్లినప్పుడు జరిగే కదలికలను పసిగట్టి, ఆటోమేటిక్‌గా స్క్రీన్ లాక్ చేసేస్తుంది. దీనివల్ల దొంగ మీ ఫోన్‌లోని ఫొటోలు గానీ, యాప్స్ గానీ ఓపెన్ చేసే అవకాశం అస్సలు ఉండదు.

మీ భద్రత మీ చేతుల్లోనే..

టెక్నాలజీ పెరిగుతున్న ఈ రోజుల్లో రిస్కులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ తెచ్చిన ఈ ఫీచర్ సామాన్యులకు ఎంతో భరోసానిస్తాయి. అందుకే ఈ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను మీ ఫోన్‌లో ఎనేబుల్ చేసుకోవడం ద్వారా.. మీ స్మార్ట్‌ఫోన్‌ను దొంగల ఎత్తుకెళ్లినా మీ డేటా మాత్రం మీ కంట్రోల్లోనే ఉంటుంది.

సెట్టింగ్ యాక్టివేట్ చేయడమెలా?

మీ ఫోన్‌‌లో Settings ఓపెన్ చేసి, Google ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ All Services ట్యాబ్‌పై క్లిక్ చేసి, Personal & Device Safety విభాగంలోకి వెళ్లాలి. అక్కడ Theft Protection అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి Theft Detection Lock, Offline Device Lock అనే రెండు బటన్లను Enable చేయండి. అంతే, ఇకపై మీ ఫోన్ దొంగతనం జరిగినా ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది.

Also Read: బ్లింకిట్ సరికొత్త కార్డు.. ఇది ఉంటే టికెట్లతో పనిలేదు, జస్ట్ రూ.50తో హాయిగా తిరిగేయొచ్చు!

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×