E-Paper
Advertisement

Medak Crime: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

Medak Crime: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
Advertisement

మెదక్ జిల్లాలోని అక్కన్నపేట సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఎంతమంది ఉన్నారు..? వారు ఎక్కడికి వెళ్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో అక్కన్నపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ALSO READ: Romania Road Accident: ఘోర ప్రమాదం.. ఏడుగురు ఫుట్‌బాల్ అభిమానులు దుర్మరణం! 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×