E-Paper
Advertisement

OTT Movie : 2 గంటల 55 నిమిషాల సౌత్ క్రైమ్ థ్రిల్లర్… మెంటలెక్కించే సస్పెన్స్ మావా

OTT Movie : 2 గంటల 55 నిమిషాల సౌత్ క్రైమ్ థ్రిల్లర్… మెంటలెక్కించే సస్పెన్స్ మావా
Advertisement

OTT Movie : ఓటీటీలలోకి సిరీస్ లు, సినిమాలు ఒక వస్తూనే ఉన్నాయి. వాటిని ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. అయితే వీటిలో థ్రిల్లర్ స్టోరీలనే చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంటెంట్ నచ్చితే భాషతో కూడా పని లేకుండా చూస్తున్నారు. ఆడియన్స్ కి ఒక కిక్ ఇచ్చే అలాంటి థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ తన సర్వీస్ రివ్వాల్వర్ పోగొట్టుకోవడంతో మొదలవుతుంది. ఉహించని ట్విస్టులు, అదిరిపోయే క్లైమాక్స్ తో ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది. అనే వివరాల్లోకి వెళ్తే

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘8 థోట్టక్కల్’ 2017లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. శ్రీ గణేష్ మొదటి సారి డైరెక్టర్‌గా రూపొందించిన ఈ మూవీలో వెట్రి, అపర్ణ బాలమురళి, నాస్సర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెట్రివెల్ సరవణ సినిమాస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 2017 ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ ఐంది. 2 గంటల 55 నిమిషాల నిడివితో ఐఎండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సత్య ఒక హానెస్ట్ పోలీసు ఇన్‌స్పెక్టర్. ఒక రోజు డ్యూటీలో ఉండగా అతని సర్వీస్ రివాల్వర్ (8 బుల్లెట్లు లోడ్ అయిన గన్) పబ్లిక్ బస్సులో పిక్‌పాకెట్‌కి దొంగిలించబడుతుంది. గన్ పోతే సస్పెండ్ అవుతాడని భయపడి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వెతకడం మొదలుపెడతాడు. అదే గన్ రామస్వామి అనే 60 ఏళ్ల అనే వ్యక్తి చేతికి చిక్కుతుంది. రామస్వామి జీవితం ట్రాజెడీలతో నిండి ఉంది. భార్య చనిపోయింది, కొడుకు జైలులో ఉన్నాడు. హాస్టల్‌లో ఫీజు కట్టలేక పోతే, ఒక రోజు మనవడిని హాస్టల్ వార్డెన్ కొడతాడు.

Read Also : ప్రియుడి కోసం భర్తనే బలిచ్చే భార్య… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్టు… చిన్నపిల్లలు చూడకూడని మూవీ

Advertisement

రామస్వామి ఆగ్రహంలో వార్డెన్‌ని ఆ 8 బుల్లెట్ గన్‌తో కాల్చి చంపేస్తాడు. ఇక అతనిలో ఒక భయంకర మార్పు వస్తుంది. ఇలా మొత్తం 6–7 మందిని చంపేస్తాడు. సత్యకి ఈ మర్డర్స్ కేసు అప్పజెప్పగానే షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ కేసులో ఉపయోగించిన గన్ తనదే అని తెలుస్తుంది. ఇక సత్య రెండు వైపులా ఇరుక్కుంటాడు. ఆ కిల్లర్ కోసం వేట మొదలు పెడతాడు. చివరికి కిల్లర్ ని సత్య పట్టుకుంటాడా ? ఈ హత్యలను ఆపుతాడా ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×