E-Paper
Advertisement

OTT Movie : చావడానికెళ్తే ఈ అక్కాయ్ ఇలా తగులుకుందేంటి భయ్యా… ఖతర్నాక్ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : చావడానికెళ్తే ఈ అక్కాయ్ ఇలా తగులుకుందేంటి భయ్యా… ఖతర్నాక్ కొరియన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కొరియన్ సిరీస్ లు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును పొందాయి. వీటిలో కొన్ని సిరీస్ లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కోరియన్స్ నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా థ్రిల్లర్ అభిమానులకి ఒక కే డ్రామా సిరీస్ చిల్ల్లింగ్ థ్రిల్ ని ఇచ్చింది. ఈ కథ లైఫ్ లో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే ఒక యూవకుడి చుట్టూ తిరుగుతుంది. చనిపోయాక మృత్యు దేవత ఇచ్చే ఒక డీల్ తో మళ్ళీ రీబర్త్ అవుతాడు. ఈ కొరియన్ ఫ్యాంటసీ అంథాలజీ థ్రిల్లర్ సిరీస్ ను కే డ్రామా ఫ్యాన్స్ తప్పకుండా చూడాల్సినది. దీని పేరు ఏమిటి ?
ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘డెత్స్ గేమ్’ 2023 లో వచ్చిన కొరియన్ ఫ్యాంటసీ అంథాలజీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. హా బ్యుంగ్-హూన్ దర్శకత్వంలో, సెఓ ఇన్-గుక్ (యీ-జే), పార్క్ సో-డామ్ (డెత్) లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ కి ఐయండిబిలో 8.1/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చోయీ అనే 30 ఏళ్ల అబ్బాయి 7 సంవత్సరాలు జాబ్ ప్రయత్నాలు చేసి, ప్రేయసి వదిలేసి, డబ్బులు లేక జీవితం దుర్భరంగా భావిస్తాడు. ఒక రోజు ఒక ఎత్తైన భవనం పైనుంచి దూకి సుసైడ్ చేసుకుంటాడు. చనిపోయిన తర్వాత అతని ముందు మృత్యు దేవత కనిపిస్తుంది. సుసైడ్ చేసుకున్నవాళ్లు నరకానికి వెళ్తారు. కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తాను అని చెప్తుంది.12 డిఫరెంట్ బాడీల్లో రీబర్త్ అవ్వు , ప్రతి లైఫ్‌లో ఖచ్చితంగా ఒకసారి చనిపోతావు. వీటిలో కనీసం 3 లైఫ్‌లలో సర్వైవ్ అయితే నీ ఒరిజినల్ లైఫ్ తిరిగి ఇస్తాను అని ఒక గేమ్ పెడుతుంది. ఇక అతని మరణాల యాత్ర మొదలవుతుంది. ప్రతి రీబర్త్ లో అతనికి ఎదో ఒక విధంగా చావు వస్తుంది.

Read Also : పప్పీని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇన్ని పాట్లా? 4 స్టోరీలు ఒకే మూవీలో ఉన్న మలయాళ థ్రిల్లర్

Advertisement

అయితే గేమ్ లో ఒక బిగ్ ట్విస్ట్ వస్తుంది. చివరగా పార్క్ అనే అనే సీరియల్ కిల్లర్ లోకి వెళ్తాడు. అతను 12 సంవత్సరాలుగా దేశంలో ఎంతో మందిని చంపుతూ తప్పించుకుంటున్నాడు. యీ-జే ఈ బాడీలోకి వచ్చాక గత జ్ఞాపకాలు వస్తాయి. తను ఇంతకు ముందు రీబర్త్ అయిన లైఫ్‌లన్నీ ఈ కిల్లర్ చంపినవే అని తెలుస్తుంది. ఇక చోయీ మృత్యు దేవతతో ఒక డీల్ చేస్తాడు. నన్ను ఈ కిల్లర్ బాడీలో ఎక్కువ రోజులు ఉంచు, నేను వాడిని చంపి నా గత లైఫ్‌లకు న్యాయం చేస్తాను అని చేప్తాడు. చివరగా ఈ ఒప్పందం ఎలా సాగుతుంది ? అతని జీవితం మళ్ళీ తిరిగి వస్తుందా ? మృత్యు దేవత ఇచ్చిన అవకాశం చేజార్చు కుంటాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×