E-Paper
Advertisement

బతికున్నప్పుడు 5000 కోట్ల అప్పు.. చనిపోయాక 18000 కోట్ల ఆస్తి! ‘కింగ్ ఆఫ్ పాప్’ ఫైనాన్షియల్ గ్రాఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బతికున్నప్పుడు  5000 కోట్ల అప్పు.. చనిపోయాక 18000 కోట్ల ఆస్తి! ‘కింగ్ ఆఫ్ పాప్’ ఫైనాన్షియల్ గ్రాఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Michael Jackson : మైఖేల్ జాక్సన్… వరల్డ్ పాప్ ఇండస్ట్రీని ఒంటి చేత్తో ఏలి, మూన్ వాక్‌తో కోట్ల మందిని ఉర్రూతలూగించిన ఈ పాప్ కింగ్ ని పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన సాంగ్స్ అండ్ స్టెప్స్ తో కోట్లాది అభిమానులని సంపాదించుకున్న మైఖేల్ జాక్సన్ లైఫ్ నిజంగా ఒక అద్భుతం. అయితే, ఆయన దగ్గరున్న డబ్బెంత, ఆయన చేసిన అప్పెంత అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నిజంగా బతికున్నప్పుడు అప్పుల ఊబిలో మునిగి, చనిపోయాక వేల కోట్ల ఆస్తికి అధిపతిగా మారడం జాక్సన్ కే సాధ్యమైంది.

దాదాపు 50 కోట్ల డాలర్ల అప్పు

Advertisement

2009 జూన్ 25న ఆయన మరణించే సమయానికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా.. ఆయనపై దాదాపు 50 కోట్ల డాలర్ల అప్పు ఉందంటే మీరు నమ్ముతారా.. యస్.. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే సుమారు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయల అప్పు ఆయన పేరు మీద ఉంది. ఒకవైపు స్టేజ్‌పై వేల కోట్లు సంపాదించినా, లగ్జరీ లైఫ్, నెవర్‌ల్యాండ్ రాంచ్ లాంటి భారీ ఎస్టేట్ల నిర్వహణ, ఖరీదైన కళాఖండాల కలెక్షన్స్, దానధర్మాలు అంటే సంపాదనకి మించి ఖర్చు చేసుకుంటూ పోయాడు మైకేల్. అది ఎంతలా అంటే చనిపోయే ఆఖరి రోజుల్లో ఆ అప్పులపై వచ్చే వడ్డీ కట్టడమే ఆయనకు ఒక పెద్ద నరకంలా మారిపోయెంత.

also read:టాలీవుడ్‌లో ‘రెంటల్’ సెగ… మే 1 నుంచి థియేటర్లు క్లోజ్? సమ్మర్ రేసులో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి!

Advertisement

సీన్ మొత్తం రివర్స్

అయితే మైఖేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందండోయ్.. ఆయన మరణానంతరం ఎస్టేట్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఇంటిలిజెంట్ డిసీషన్స్ తో జాక్సన్ బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. అవును.. అలా నేడు ఆయన ఎస్టేట్ విలువ సుమారు 200 కోట్ల డాలర్లు, అంటే అక్షరాల రూ. 18 వేల కోట్లకు పైమాటే మరి. అలా చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలుస్తున్నారంటే ఆయన మ్యూజిక్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రాయల్టీ రూపంలో కోట్లాది రూపాయలు

సోనీ మ్యూజిక్ గ్రూప్‌తో జరిగిన భారీ డీల్స్, ‘MJ: ది మ్యూజికల్’ వంటి బ్రాడ్‌వే షోలు మరియు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రెగ్యలర్ గా రాయల్టీ రూపంలో కోట్లాది రూపాయలు వచ్చి చేరుతున్నాయి. ఒకప్పుడు అప్పుల కారణంగా వేలం వేయాల్సిన పరిస్థితి వచ్చిన నెవర్‌ల్యాండ్ రాంచ్, ఆయన ఆర్థిక పతనానికి గుర్తుగా నిలిస్తే, నేడు ఆయన సృష్టించిన మ్యూజిక్ మాత్రం కాసుల వర్షం కురిపిస్తోందన్న మాట.

కొంత భాగాన్ని చారిటీ సంస్థలకు కూడా

ఇక ఈ వేల కోట్ల ఆస్తిని ప్రస్తుతం ఆయన ముగ్గురు పిల్లలు ప్రిన్స్, పారిస్ మరియు బిగి (బ్లాంకెట్) అనుభవిస్తున్నారు. జాక్సన్ తన వీలునామాలో ఆస్తుల పంపకంపై చాలా స్పష్టమైన ప్లాన్ రూపొందించాడు. తన ఆస్తిలో ఎక్కువ భాగం తన పిల్లలకు చెందేలా, అలాగే తన తల్లి కేథరిన్ జాక్సన్ జీవితాంతం గౌరవంగా బతికేలా ఏర్పాట్లు చేయడం విశేషం. వీటితో పాటు కొంత భాగాన్ని చారిటీ సంస్థలకు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది.

ఇక ఏప్రిల్ 14, 2026 నాటి ఈ గణాంకాలను బట్టి చూస్తే, మైఖేల్ జాక్సన్ కేవలం బతికున్నప్పుడే కాదు, మరణించిన తర్వాత కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీగా తన సామ్రాజ్యాన్ని ఏలుతున్నారని చెప్పక తప్పదు.

also read:భర్త ఉండగానే మరో యువకుడితో ఎఫైర్.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×