E-Paper
Advertisement

గూగుల్ నుంచి బిగ్ లీక్.. Pixel 11లో ఈ ‘పిక్సెల్ గ్లో’ ఫీచర్ చూస్తే ఫ్యూజులు అవుట్!

గూగుల్ నుంచి బిగ్ లీక్.. Pixel 11లో ఈ ‘పిక్సెల్ గ్లో’ ఫీచర్ చూస్తే ఫ్యూజులు అవుట్!
Advertisement

Google Pixel 11: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడానికి గూగుల్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా జరిగిన Google I/O 2026 ఈవెంట్‌లో కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఒక ఆసక్తికరమైన ఫీచర్ మాత్రం నెట్టింట లీకై తెగ హల్‌చల్ చేస్తోంది. భవిష్యత్తులో రాబోయే పిక్సెల్ ఫోన్ల కోసం గూగుల్ Pixel Glow అనే సరికొత్త నోటిఫికేషన్ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో రాబోయే Google Pixel 11 సిరీస్‌తో ఈ ఫీచర్ పరిచయం కానుందని సమాచారం.

ఐ/ఓ ఈవెంట్‌లో కనిపించిన మెరుపులు:

గూగుల్ ఐ/ఓ కీనోట్ ప్రెజెంటేషన్‌లో Gemini Omni సామర్థ్యాలను ప్రదర్శిస్తున్న సమయంలో ఈ లీక్ బయటపడింది. డెమో వీడియోలో ఒక మోడల్ పట్టుకున్న ఫోన్, చూడటానికి రాబోయే Pixel 11 లాగా అనిపించింది. వీడియో ముగిసే సమయంలో ఆ ఫోన్ వెనుక భాగంలోని కెమెరా బార్ చుట్టూ కాంతి మెరిసింది. ఈ నియాన్ లైట్ స్ట్రిప్ ఒక నోటిఫికేషన్ LED లాగా పనిచేస్తున్నట్లు కనిపించింది. దీంతో గూగుల్ తమ కొత్త ఫీచర్‌ను ఇలా హింట్ ఇచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు.

Advertisement

Also Read: Realme 16T భారత్‌లో లాంచ్.. 144Hz డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు!

నథింగ్ ఫోన్ స్టైల్లో గూగుల్ అడుగులు:

ఆండ్రాయిడ్ 17 బీటా 4కు సంబంధించిన కోడింగ్‌ను పరిశీలించినప్పుడు ఈ ఫీచర్ వివరాలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. దీనికి గూగుల్ Orbit అనే కోడ్‌నేమ్ పెట్టినట్లు సమాచారం. మనం ఫోన్‌ను బోర్లా పెట్టినప్పుడు (ఫేస్ డౌన్) ఏవైనా మెసేజ్‌లు లేదా అప్‌డేట్స్ వస్తే, కెమెరా చుట్టూ ఉండే లైట్లు రంగులు మారుతూ యూజర్లను అలర్ట్ చేస్తాయి. గతంలో నథింగ్ ఫోన్లలో ఇలాంటి గ్లిఫ్ లైటింగ్ ఫీచర్‌ను మనం చూశాం. ఇప్పుడు గూగుల్ కూడా అదే బాటలో నడుస్తూ, దీనిని Gemini AI సాంకేతికతతో మరింత స్మార్ట్‌గా మార్చబోతోంది.

కొత్త టెన్సార్ జీ6 ప్రాసెసర్‌తో:

Advertisement

ఈ సరికొత్త Pixel 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు గూగుల్ సొంత Tensor G6 చిప్‌సెట్‌తో రానున్నాయి. దీనిని ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ TSMC సరికొత్త 2 నానోమీటర్ ప్రాసెస్‌పై తయారు చేయనుందని టాక్. దీనివల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ కుదిరితే వచ్చే ఆగస్టు నెలలో జరగబోయే Made By Google ఈవెంట్‌లో ఈ ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది.

Also Read: చిన్నగా, స్టైలిష్‌గా, అంతకు మించి హాట్‌గా.. వచ్చే వారమే Oura Ring 5 గ్రాండ్ ఎంట్రీ?!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×