E-Paper
Advertisement

Peddi Update: పెద్ది సినిమాపై కీలక అప్డేట్.. ఏమిటది అంటూ దర్శకుడితో రామ్ చరణ్ వీడియో వైరల్..!

Peddi Update: పెద్ది సినిమాపై కీలక అప్డేట్.. ఏమిటది అంటూ దర్శకుడితో రామ్ చరణ్ వీడియో వైరల్..!
Advertisement

Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది కోసం డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు రామ్ చరణ్ కూల్ నేచర్‌ను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోలో డబ్బింగ్ థియేటర్‌లో దర్శకుడు బుచ్చిబాబు.. పక్కన రామ్ చరణ్ కూర్చుని ఒక కీలకమైన సీన్‌ను చూస్తూ కనిపించారు. ఆ సీన్ స్క్రీన్‌పై నడుస్తున్న సమయంలో బుచ్చిబాబు ఆ సీన్ లో చాలా హై పిచ్ లో..రెడీ..అని గట్టిగా చెప్పారు.

Advertisement

ఆ సీన్ చూసిన వెంటనే రామ్ చరణ్ నవ్వుతూ బుచ్చిబాబును సరదాగా ఆటపట్టించారు. “ఏమిటది..బుచ్చి… నువ్వు ఎందుకు ఇంతగా ఫీల్ అవుతున్నావు? నా డబ్బింగ్ కోసం ఇంత టెన్షన్ పడొద్దు. నేను చూసుకుంటాను” అని నవ్వుతూ అన్నారు.

 https://twitter.com/i/status/2028075594584572086

Advertisement

చికిరి సాంగ్ కి కూడా ఆ సింగర్ కన్న బుజ్జి నే ఫీలయ్యారు అంటూ మరో జోక్ వేశారు.
దీనికి బుచ్చిబాబు కూడా సరదాగా స్పందించారు. తాను ఎందుకు అలా ఫీల్ అయ్యానో చెబుతూ, ‘చికిరి’ పాట లిరిక్స్ పాడారు. అంతేకాదు, సరదాగా ఆ పాటను హమ్ చేస్తూ ఉండగా..దీనిపై రామ్ చరణ్ మరింత హాస్యంగా స్పందించారు. “ఆ పాట పాడిన సింగర్ కన్నా నువ్వే ఎక్కువ ఫీల్ అయ్యావు” అని నవ్వుతూ చెప్పారు. ఈ సరదా సంభాషణతో ఆ వీడియో మొత్తం నవ్వులతో నిండిపోయింది.

ఈ సరదా మాటల తర్వాత పెద్ది డబ్బింగ్ పనులు అధికారికంగా మొదలయ్యాయి. డబ్బింగ్ ప్రారంభమైందని రామ్ చరణ్ స్వయంగా అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన అభిమానులు రామ్ చరణ్ పాజిటివ్ ఎనర్జీ, సింపుల్ నేచర్‌ను చూసి మరింత అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ALSO READ: Thalapathy Vijay Son: విజయ్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన కొడుకు.. ఇక ఆయన్ని ఫాలో అవ్వనంటూ..!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×