E-Paper
Advertisement

Madras Style Sambar Recipe: మునక్కాయ సాంబార్ రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. తిన్నవారంతా ఫిదా అవ్వాల్సిందే!

Madras Style Sambar Recipe: మునక్కాయ సాంబార్ రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. తిన్నవారంతా ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Madras Style Sambar Recipe: సౌత ఇండియాలో సాంబార్ రకాలు ఎన్ని ఉన్నా, మద్రాస్ స్టైల్ మునక్కాయ సాంబార్‌కు ఉండే క్రేజ్ వేరు. మునక్కాయల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన, చిక్కటి కందిపప్పు, ఘాటైన సాంబార్ పొడి కలగలిసి ఈ వంటకానికి ప్రాణం పోస్తాయి. ముఖ్యంగా తమిళనాడులో చేసే సాంబార్‌లో కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటిస్తారు. అందుకే ఆ రుచి అంత అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ సాంబార్ తింటే.. అమృతంలా అనిపిస్తుంది. ఆ రుచిని మీ వంటగదిలోకి ఎలా తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మద్రాస్ స్టైల్ మునక్కాయ సాంబార్ తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు:

Advertisement

మునక్కాయలు: 5 లేదా 6

కందిపప్పు: 1 కప్పు

Advertisement

చింతపండు: పెద్ద నిమ్మకాయ సైజు

చిన్న ఉల్లిపాయలు – 10

టమాటో – 2

పచ్చిమిర్చి – 2

మసాలాలు: సాంబార్ పొడి – 2 చెంచాలు, పసుపు – 1/2 చెంచా, ఇంగువ – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా.

పోపు కోసం: నూనె లేదా నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతి గింజలు.

తయారీ :

1. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, కొంచెం పసుపు, చుక్క నూనె వేసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.

2. ఒక లోతైన గిన్నెలో కొద్దిగా నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి, కొంచెం ఉప్పు వేసి మునక్కాయలను 70% వరకు ఉడికించాలి.

3. మునక్కాయలు సగం ఉడికాక, అందులో తీసి పెట్టుకున్న చింతపండు రసం పోయాలి. ఇందులోనే సాంబార్ పొడి, పసుపు, మరికొంత ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా మరగనివ్వాలి. మద్రాస్ స్టైల్ సాంబార్‌లో చింతపండు పులుపు, సాంబార్ పొడి ఘాటు సమంగా ఉండాలి.

Also Read: నోరూరించే పంజాబీ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే సింపుల్‌గా రెడీ చేయండిలా!

4. పులుసు బాగా మరిగి మునక్కాయలు పూర్తిగా ఉడికిన తర్వాత, ముందుగా మెదిపి పెట్టుకున్న కందిపప్పును ఇందులో కలపాలి. సాంబార్ మరీ చిక్కగా ఉంటే కొన్ని వేడి నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై మరిగించాలి. ఈ సమయంలోనే చిటికెడు బెల్లం ముక్క వేస్తే రుచి మరింత పెరుగుతుంది.

5. మరో చిన్న బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ముఖ్యంగా నాలుగైదు మెంతి గింజలు, చిటికెడు ఇంగువ వేసి వేయించి, ఆ పోపును మరుగుతున్న సాంబార్‌లో కలపాలి. పోపు వేసిన వెంటనే మూత పెడితే ఆ వాసన బయటకు పోకుండా సాంబార్‌కు బాగా పడుతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మద్రాస్ స్టైల్ మునక్కాయ సాంబార్ రెడీ.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×