E-Paper
Advertisement

Thalapathy Vijay Son: విజయ్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన కొడుకు.. ఇక ఆయన్ని ఫాలో అవ్వనంటూ..!

Thalapathy Vijay Son: విజయ్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన కొడుకు.. ఇక ఆయన్ని ఫాలో అవ్వనంటూ..!
Advertisement

Thalapathy Vijay Son: తమిళ సినీ స్టార్‌, రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం బయటకు వచ్చిన తర్వాత.. ఇప్పుడు వారి కుమారుడు జేసన్ సంజయ్ తీసుకున్న ఓ సోషల్ మీడియా నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.

తండ్రిని అన్ ఫాలో చేసిన కొడుకు..!

దర్శకుడుగా సినిమా తీస్తోందా జేసన్ సంజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో.. తండ్రి విజయ్‌ను అన్‌ఫాలో చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. దీంతో కుటుంబంలో ఏదో పెద్ద సమస్య నడుస్తోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది తల్లి సంగీతకు మద్దతుగా జేసన్ తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.

ఇది నిజమేనా..!.

Advertisement

అయితే ఇంకొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. జేసన్ మొదటి నుంచి తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయలేదని..ఇప్పుడు అన్‌ఫాలో చేసినట్టు చెప్పడం కేవలం ఊహాగానమేనని వారు అంటున్నారు. మరోవైపు, విజయ్ మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎవరినీ ఫాలో చేయడం లేదని తెలుస్తోంది.

ఈ వ్యవహారం మొత్తం..సంగీత సోర్నలింగం విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మరింత చర్చకు వచ్చింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, విజయ్‌కు ఒక నటితో అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించారు. ఈ విషయం తనకు 2021 ఏప్రిల్‌లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

ఆ విషయం తెలిసిన తర్వాత తనకు తీవ్ర మానసిక బాధ, మానసిక వేదన కలిగిందని సంగీత పిటిషన్‌లో వివరించారు. మొదట విజయ్ ఆ సంబంధాన్ని ముగిస్తానని చెప్పినా, అది కొనసాగిందని ఆమె ఆరోపణ. దీని వల్ల తాను మానసిక హింస, భావోద్వేగ నిర్లక్ష్యం, సమాజంలో అవమానం ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు విజయ్‌కు నోటీసులు జారీ చేసి, ఏప్రిల్ 20న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

ఇప్పటి వరకు ఈ విడాకుల అంశంపై విజయ్ గానీ, సంగీత గానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. 1999 ఆగస్టులో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు – జేసన్ సంజయ్, దివ్య శాషా. జేసన్ ఇప్పటికే కొన్ని సినిమాలపై పని చేయగా, దివ్య ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.

ఈ కుటుంబ వివాదం నిజంగా ఏ దిశగా వెళ్లబోతోందో చూడాల్సి ఉంది. కోర్టు విచారణ పూర్తయ్యాకే పూర్తి నిజాలు బయటపడే అవకాశముంది.

ALSO READ: Sarath Kumar: రాధికన నిలబడి కూర్చోమన్న శరత్ కుమార్ మొదటి భార్య.. వరలక్ష్మీ చూస్తుండగానే ఏం జరిగిందంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×