E-Paper
Advertisement

ఒక్క రోజుకు రెండు లక్షలా? చరణ్ కొత్త బాడీగార్డ్ సాలరీ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

ఒక్క రోజుకు రెండు లక్షలా? చరణ్ కొత్త బాడీగార్డ్ సాలరీ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
Advertisement

Charan Bodyguard:  హీరోలు కనిపిస్తే చాలు సెల్ఫీలని ,ఆటో గ్రాఫ్ లని చుట్టూ ముట్టడం కామన్ అయిపొయింది.అయితే వీటి మాటున ప్రాణాపాయం కూడా దాగుండే అవకాశాలు లేకపోలేదు.అందుకే ముందు జాగ్రత్తగా స్టార్ హీరోలు తమ పర్సనల్ సెక్యూరిటీ కోసం బాడీ గార్డ్స్ ని నియమించుకుంటారన్న సంగతి తెల్సిందే.

దాదాపు 15 లక్షల రూపాయల వరకు జీతం

Advertisement

ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన పర్సనల్ బాడీగార్డ్ షేరాకు నెలకు దాదాపు 15 లక్షల రూపాయల వరకు జీతం ఇస్తున్నాడని బీ టౌన్ లో వినిపించే టాక్. అలాగే కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా తన బాడీ గార్డ్ కి నెలకు 10 లక్షల రూపాయల వరకు కేటాయిస్తున్నాడని సమాచారం. అయితే వీరంతా లోకల్‌గా ఉండే సెక్యూరిటీ ఏజెన్సీలను నమ్ముకుంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం రూట్ మార్చి ఏకంగా ఒక అంతర్జాతీయ ఫైటర్‌ను రంగంలోకి దించడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక నెట్టింట మంటలు పుట్టిస్తుంది.

ఆఫ్రికన్ బాడీగార్డ్ గురించిన ఆసక్తికర విషయాలు

Advertisement

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రమోషన్ల డోస్ పెంచిన మెగా హీరో.. రీసెంట్‌గా ముంబై వేదికగా మే నెలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ వేడుక ముగిసినప్పటి నుంచి చరణ్ వెంటే నీడలా ఒక సాలిడ్ పర్సనాలిటీ ఎప్పుడూ కూడా తిరుగుతూ అందరిని ఆకర్షిస్తున్నాడు. చరణ్ పాల్గొనే ప్రతి ప్రెస్ మీట్‌లోనూ, పబ్లిక్ అప్పియరెన్స్‌లోనూ హైట్ అండ్ వెయిట్‌తో అందరినీ భయపెడుతున్న ఆ ఆఫ్రికన్ బాడీగార్డ్ గురించిన ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

also read :పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్….టాలీవుడ్ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్!

వెయిట్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్నో రికార్డులు 

ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన అతని పేరు కెవిన్ కుంట. ఇతను సాధారణ బాడీగార్డ్ కాదు, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ (MMA – మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న కెవిన్, రింగ్ లోపల ఎంత పవర్‌ఫుల్లో రింగ్ బయట అంతర్జాతీయ విఐపిలు మరియు సెలబ్రిటీలకు వివిఐపి ప్రొటెక్షన్ అందించడంలో అంతే నిపుణుడు. గ్లోబల్ ప్రొఫైల్ ఉన్న బాడీగార్డ్స్ కోసం వెతుకుతున్న క్రమంలో చరణ్ టీమ్ ఈ ఇంటర్నేషనల్ ఫైటర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

also read :ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్.. చిరంజీవి నివాసంలో గంటన్నర సుదీర్ఘ చర్చలు.. ఏం జరిగిందంటే?

వచ్చే జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్ల షెడ్యూల్ ముగిసే వరకు రామ్ చరణ్ ఈ ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్‌కు చరణ్ ఎంత పారితోషికం ఇస్తున్నారనే లెక్కలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, కెవిన్ కుంటకు రోజుకు ఏకంగా 2 లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ లెక్కన నెలకు చూసుకుంటే అది అక్షరాలా 60 లక్షల రూపాయల వరకు అవుతుంది.

భారతీయ సినిమా చరిత్రలోనే ఒక బాడీగార్డ్‌కు అత్యధిక పారితోషికం

బాలీవుడ్ టాప్ హీరోల పర్సనల్ సెక్యూరిటీ ఖర్చుల కంటే ఇది చాలా ఎక్కువ. ఒకవేళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈన్యూస్  గనుక నిజమైతే మాత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే ఒక బాడీగార్డ్‌కు అత్యధిక పారితోషికం ఇస్తున్న రికార్డు రామ్ చరణ్ పేరిట రీ రైట్ అవడం పక్కా.ఇక ‘పెద్ది’ చిత్రం నార్త్ ఇండియా మార్కెట్‌తో పాటు గ్లోబల్ వైడ్‌గా భారీ అంచనాలతో వస్తుండటంతో, ప్రమోషన్ల సమయంలో ఎక్కడా భద్రతా లోపాలు రాకూడదనే ఉద్దేశంతోనే మెగా హీరో ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్ . మొత్తానికి పెద్ది సినిమాతో పాటు కొత్త బాడీగార్డ్ వ్యవహారం చరణ్ క్రేజ్ ని మరో లెవల్ లో పెట్టేస్తున్నాయన్న మాట !

also read :ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ రంభ ఇంట తీవ్ర విషాదం.. నా ప్రపంచం శూన్యమైందంటూ ఎమోషనల్ పోస్ట్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×