E-Paper
Advertisement

ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్.. చిరంజీవి నివాసంలో గంటన్నర సుదీర్ఘ చర్చలు.. ఏం జరిగిందంటే?

ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్.. చిరంజీవి నివాసంలో గంటన్నర సుదీర్ఘ చర్చలు.. ఏం జరిగిందంటే?
Advertisement

Chiranjeevi Meeting : ఎడ తెగకుండా ఎన్నాళ్లగానో సాగుతున్న రెంటల్ VS పర్సంటేజ్ పంచాయితీ ఇపుడు మెగాస్టార్ వద్దకి చేరింది.యస్..సింగిల్ స్క్రీన్స్ బతకాలనే ఉద్దేశంతో స్వయంగా చిరునే చొరవ తీసుకోవడం ఇక్కడ విశేషం.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్లతో ఒక కీలక సమావేశం నిర్వహించారు థియేటర్ ఓనర్స్.ఈ కీలక భేటీలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, KL నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.ఒకరకంగా ఈ బేటీ సినీ సర్కిల్స్ లో మాంచి ఉత్కంఠను రేకెత్తించింది అనే చెప్పాలి.

గంటకు పైగా సమావేశం

Advertisement

ఇక ఈ బేటీ విషయానికి వస్తే చిరు ఇంట్లో ఈరోజు (25మే)న జరిగిన ఈ సమావేశం దాదాపు గంటకు పైగా సుదీర్ఘంగా సాగినట్టు తెలుస్తుంది. పరిశ్రమలో ఉన్న సమస్యలను, ఎగ్జిబిటర్ల ఇబ్బందులకి పరిష్కారం చూపేందుకు చిరు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఇండస్ట్రీ సమస్యలపై గతంలో వేసిన ప్రత్యేక కమిటీ నివేదికను, అన్ని వివరాలను చిరంజీవి ముందే తెప్పించుకుని ఈ బేటీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

also read :అనంత శ్రీరామ్ ఫ్యామిలీ టార్గెట్? అర్థరాత్రి బెదిరింపులు..భూవివాదంలో అసలు ఏం జరుగుతోంది?

Advertisement

ఇక బేటీ తర్వాత ఎగ్జిబిటర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు ఇన్ని ఉన్నాయా అని మెగాస్టార్ ఆశ్చర్య పోయారని,ప్రతి విషయాన్ని చాలా ఓపికగా విన్నారని చెప్పుకొచ్చారు.వచ్చే రెండు మూడు రోజుల్లో ఉన్న సమస్యలు అన్ని తీరిపోతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.

శాశ్వత పరిష్కారం చూపే దిశగా మెగాస్టార్

ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఏర్పడ్డ ఈ సంక్షోభంపై చిరంజీవికి అన్నివివరాలు అందించామని తెలిపారు. ఇక అందరూ అనుకుంటున్నట్టుగా ఇది జూన్ 4న వచ్చే పెద్ది కోసమే కాదని, మొత్తం సినీ ఇండస్ట్రీ ఫ్యూచర్ కి సంబంధించిన పెద్ద సమస్య అని కుండ బద్దలు కొట్టారు.దీనిపై మరి రెండు మూడు రోజుల్లోనే చర్చలు ముగించి, అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెల్చి చెప్పారు.

also read :ఎగ్జిబిటర్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది.. టాలీవుడ్ సంక్షోభంపై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

అయితే ఎగ్జిబిటర్లతో సమావేశం ముగిసిన వెంటనే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా మెగాస్టార్ చిరంజీవి మరో కీలక అడుగు వేసినట్టు తెలుస్తుంది. థియేటర్ ఓనర్స్ వాదన విన్న చిరు, నిర్మాతల వాదన కూడా వినాలని డిసైడ్ అయ్యాడని,ఆ క్రమంలోనే వెంటనే గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు స్వయంగా ఫోన్ చేయడంతో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు మరికాసేపట్లో ఆయన నివాసానికి చేరుకోబోతున్నారని సమాచారం.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మీటింగ్ 

ఇప్పటిదాకా థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్ల గోడుని విన్న చిరంజీవి, ఇప్పుడు గిల్డ్ నిర్మాతల వైపు ఉన్న అభ్యంతరాలను, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోనున్నారట . ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఇండస్ట్రీ మంచి కోసం ఒక కంబైండ్ డిసీషన్ కి రానున్నారని తెలుస్తుంది .

also read :డబ్బు లేదనే చెప్పుతో కొట్టాడు.. ఆ కసితోనే కోట్లు సంపాదించా.. బండ్ల గణేష్ ఓపెన్ టాక్

మరోవైపు ఈ ఇండస్ట్రీ సమస్యలకు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కూడా ఒక లైన్ క్లియర్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు సమాంతరంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధి బృందం భేటీ కానుంది. జూన్ మొదటి వారంలో పెద్ది బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న ఈ సమయంలో , ఏపీలో చిత్ర పరిశ్రమ వాతావరణం అనుకూలంగా మార్చడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా థియేటర్ల వ్యవస్థ బలోపేతం, సింగిల్ స్క్రీన్ల పన్నుల విధానం, టికెట్ రేట్ల అంశాలపై పవన్ కళ్యాణ్‌కు నిర్మాతలు ఒక వినతిపత్రం ఇవ్వనున్నారు..మొత్తానికి ఇటు చిరు, అటు పవన్ కళ్యాణ్ ..చూడాలి మరి అన్నాతమ్ముళ్ళ సమక్షంలో అయినా ఈ పంచాయితీకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×