E-Paper
Advertisement

‘నాన్న చిరంజీవి నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం అదే’.. రామ్ చరణ్ ఎమోషనల్..

‘నాన్న చిరంజీవి నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం అదే’.. రామ్ చరణ్ ఎమోషనల్..
Advertisement

Ram Charan Interview: సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన స్టార్ల వారసులుగా ఎంట్రీ ఇవ్వడం అంటే అంత సులభమైన విషయం కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఎంత ప్లస్ అవుతుందో, అంచనాల రూపంలో అంతకు మించిన ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇది చాలా భిన్నంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా, పవన్ కళ్యాణ్ గారి అల్లుడిగా, అల్లు అర్జున్ కజిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తనపై ఎలాంటి స్టార్‌డమ్ ఒత్తిడి లేకుండా పెరగడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను చరణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Read also-Iswarya Menon : మిర్రర్ ముందు క్యూట్ సెల్ఫీలతో ఐశ్వర్య మీనన్.. ఫోటోలు వైరల్..

Advertisement

ఇంట్లో స్టార్‌డమ్ కనిపించేది కాదు

చిన్నప్పటి నుంచి తాను ఇంత పెద్ద సినిమా కుటుంబ నేపథ్యం నుండి వచ్చాననే విషయాన్ని ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్‌గానో లేదా డిస్‌అడ్వాంటేజ్‌గానో చూడలేదని రామ్ చరణ్ తెలిపారు. దానికి ప్రధాన కారణం వారి ఇంట్లో ఉండే సాధారణ వాతావరణమే. “నాన్నగారు బయట ఎంత పెద్ద మెగాస్టార్ అయినప్పటికీ, ఆ స్టార్‌డమ్‌ని ఎప్పుడూ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఇంట్లో మేమంతా చాలా సాధారణంగా పెరిగాం. టీవీల్లో చూసినప్పుడో లేదా బయటకు వెళ్ళినప్పుడు జనం ఆయనను చుట్టుముట్టినప్పుడో మాత్రమే నాన్న ఎంత పెద్ద స్టార్ అనేది మాకు తెలిసేది” అని చరణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

18 గంటల పని తర్వాత కూడా..

షూటింగ్స్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు చిరంజీవి గారు ప్రవర్తించే తీరు తనపై ఎంతో ప్రభావం చూపిందని చరణ్ గుర్తుచేసుకున్నారు. “నాన్నగారు బయట 18 గంటల పాటు కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చినా చాలా సాధారణంగా ఉండేవారు. అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే కాళ్ళు నొక్కడం, అమ్మ తెల్లవారుజామునే ఫ్లైట్ ఎక్కాల్సి వస్తే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి టైం ఉంటుందో లేదో అని ఆయనే స్వయంగా ఫుడ్ ప్యాక్ చేయడం లాంటివి నేను కళ్లారా చూశాను. అంత పెద్ద పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఇంట్లో ఇంత సింపుల్‌గా ఉండటం వల్లే మాకు క్రమశిక్షణ అలవడింది” అని రామ్ చరణ్ వివరించారు.

Read also-మాస్ మహారాజ్ రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?..

పెద్దలను గౌరవించడమే

చిరంజీవి పిల్లలను ఎప్పుడూ గద్దించి క్రమశిక్షణ నేర్పలేదని, కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవారని చరణ్ చెప్పారు. అదే ‘పెద్దలను గౌరవించడం’. చిన్నప్పటి నుండి ఇంట్లో పెద్దల పట్ల ఎలాంటి మర్యాదతో మసలుకోవాలనేది నాన్నగారు నేర్పించారని, అది తమ రక్తంలోనే కలిసిపోయిందని చరణ్ అన్నారు. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా జీవితంలో నిలకడగా, క్రమశిక్షణతో ముందుకు సాగాలనేదే తన తండ్రి తనకు ఇచ్చిన అత్యంత విలువైన సందేశమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ తరహాలోనే ఈ సినిమా కూడా తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×