E-Paper
Advertisement

‘పెద్ది’ ప్రాంతాలవారీగా డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్.. ఎక్కడ ఎవరి చేతుల్లోకంటే?

‘పెద్ది’ ప్రాంతాలవారీగా డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్.. ఎక్కడ ఎవరి చేతుల్లోకంటే?
Advertisement

Peddi Movie:రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టేటస్ ను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ఆ తర్వాత అదే జోరులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ (S.Shankar)దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేసి బొక్క బోర్ల పడ్డారు. భారీ అంచనాల మధ్య ఊహించని బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో పూర్తిగా డిసప్పాయింట్ అయిన రామ్ చరణ్ ఈసారి ఎలాగైనా సరే మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని యంగ్ డైరెక్టర్ కి అవకాశం కల్పించారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar ) శిష్యుడిగా ‘ఉప్పెన’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు..

సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలయికలో భారీ బడ్జెట్లో వస్తున్న ఈ సినిమా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక జూన్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ముందుగానే అంటే జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ థియేటర్లలో సందడి చేయబోతున్నారు.

పెద్ది డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్..

Advertisement

విడుదలకు కేవలం 24 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అందులో భాగంగానే ఈ సినిమాను ప్రాంతాలవారీగా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ వైరల్గా మారింది. మరి ఏ ప్రాంతంలో ఎవరు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

నైజాం – మైత్రి మూవీ మేకర్స్

Advertisement

నెల్లూరు – భాస్కర్ రెడ్డి

గుంటూరు : యు వి క్రియేషన్స్

వెస్ట్ గోదావరి : LVR

కృష్ణ, ఈస్ట్ గోదావరి ప్రాంతాలలో ఈ సినిమా హక్కులు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే వైజాగ్ లో కూడా ఈ సినిమా హక్కుల పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా భరత్ భూషణ్ , బళ్ళారి సాయి, పూర్వీ రాజు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి లైన్లో ఉన్నట్లు సమాచారం. ఇక సీడెడ్ విషయానికొస్తే అభిషేక్ రెడ్డి చిత్తూరు అలాగే బళ్లారి సాయి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక మొత్తానికి అయితే మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ సినిమా హక్కులు అమ్ముడుపోతే మొత్తం లెక్కలు బయటకు వస్తాయని చెప్పవచ్చు.

ALSO READ:విజయ్ దళపతిపై పోసాని సంచలన వ్యాఖ్యలు!

పెద్ది సినిమా ట్రైలర్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్..

మరొకవైపు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. మే 17 లేదా 18వ తేదీలలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ ట్రైలర్తో సినిమాపై అంచనాలు పెంచాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×