Operation Sindoor: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలో ఉన్నాయి. కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య నిత్యం యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదో ఒక రూపంలో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి… విధ్వంసం సృష్టిస్తున్నారు. ఏడాదిలో ఒక్కసారైనా ఇండియాలో బ్లాస్టింగ్ చేసి.. శునకానందం పొందుతున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే ఇండియన్ ఆర్మీ కూడా కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ కు సంబంధించిన లాహోర్ స్టేడియాన్ని ( Lahore stadium) ఇండియన్ ఆర్మీ ( Indian Army ) పేల్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor) జరిగి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో ఈ పోస్టు వైరల్ అయినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది పూర్తయింది. శత్రు దేశమైన పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టేలా ఈ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది మోడీ ప్రభుత్వం. పహాల్గమ్ సంఘటన నేపథ్యంలో ఈ ఆపరేషన్ సిందూర్ దాదాపు 15 రోజులు నిర్వహించి.. దాదాపు 100 మంది ఉగ్రవాదులను ఒకేసారి మట్టి కరిపించింది. అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేస్ లను కూడా పేల్చింది ఇండియన్ ఆర్మీ. మే 6, 7 తేదీల్లో మాత్రం పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. భారత సైన్యం సామర్థ్యం ఏంటో ఆ ఒక్క రోజుతో ప్రపంచానికి తెలిసిపోయింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో పాకిస్తాన్ లోని గడాఫీ స్టేడియాన్ని ఇండియన్ ఆర్మీ పేల్చేసినట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు.
కాశ్మీర్ ప్రాంతంలోని పహాల్గమ్ లో పర్యాటకులు విపరీతంగా వస్తారన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22, 2025 సందర్భంగా కూడా పహాల్గమ్ కు చాలా మంది పర్యటకులు రావడం జరిగింది. ఈ సందర్భంగా 26 మంది అమాయకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చారు. ముస్లిం, మహిళలలను వదిలేసి కేవలం హిందుమత పురుషులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. దాదాపు 30 నిమిషాలు ఈ దాడి జరగగా… ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకోలేకపోయింది. అంతలోపే 26 మంది దారుణంగా మరణించారు. అయితే ఆ 26 మందిని చంపిన నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ సంఘటనలో భర్తలను కోల్పోయిన భార్యలకు న్యాయం చేసేందుకు గాను ఆపరేషన్ సిందూర్ నామకరణం చేసి, పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు. ఈ సంఘటన జరిగి ఏడాది అయిన తరుణంలో గడాఫీ స్టేడియాన్ని కూడా ఇండియన్ ఆర్మీ పేల్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
When the Indian Army visited a Pakistani stadium last year. 😉 Jai Hind #OperationSindoor pic.twitter.com/MTWhXPXhiP
— Indian Cricket (@IPL2025Auction) May 7, 2026