E-Paper
Advertisement

ఫుల్ క్రీమ్ మిల్క్ vs టోన్డ్ మిల్క్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

ఫుల్ క్రీమ్ మిల్క్ vs టోన్డ్ మిల్క్.. ఆరోగ్యానికి ఏది మంచిది?
Advertisement

ప్రతి ఇంట్లో రోజూ పాలు ముఖ్యమైన ఆహారం. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలకు బలాన్నిస్తాయి. అయితే మార్కెట్‌లో లభించే ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్ మధ్య ఎంపిక చేసుకోవడంలో చాలా మంది గందరగోళానికి గురవుతారు. ఈ రెండు రకాల పాలల్లోనూ పోషకాలు ఉన్నా.. కొవ్వు మాత్రం భిన్నంగా ఉంటుంది. మీ జీవనశైలి, ఆరోగ్య అవసరాల ఆధారంగా మీకు ఏది మంచిదో నిర్ణయించాలి.

ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే ఏమిటి?

ఫుల్ క్రీమ్ మిల్క్‌లో సహజంగా ఉండే కొవ్వు తగ్గించకుండా ఉంటుంది. అందుకే ఈ పాలు చిక్కగా, క్రీమీగా, రుచికరంగా ఉంటుంది. సాధారణంగా ఫుల్ క్రీమ్ మిల్క్‌లో సుమారు 6 శాతం కొవ్వు ఉంటుంది. టీ, స్వీట్లు, పెరుగు, భోజనం తరువాత తినే తీపి వంటకాలకు చేయడానికి ఇది సరైన ఆప్షన్. ఇందులో క్యాలరీలు, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు, క్రీడాకారులు.. శారీరకంగా చురుకైన వ్యక్తులకు ఇది మంచిది. కానీ కూర్చుని పని చేసే వారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ పాలు మితంగా తీసుకోవాలి.

టోన్డ్ మిల్క్ అంటే ఏమిటి?

Advertisement

టోన్డ్ మిల్క్‌లో కొవ్వు తగ్గించి ఉంటుంది. స్కిమ్ చేసిన మిల్క్‌ సాధారణ పాలతో కలిపి తయారు చేస్తారు. ఇందులో సుమారు 3 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇది తేలికగా ఉంటుంది, ప్రతిరోజూ తాగడానికి చాలా అనువైనది. బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్‌నెస్ లక్ష్యాలు ఉన్నవారు టోన్డ్ మిల్క్‌ను ఎంచుకుంటారు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది.

రెండింటి మధ్య పోషకాల తేడా

రెండు రకాల పాల్లోనూ కాల్షియం, ప్రోటీన్ దాదాపు సమానంగా ఉంటాయి. ప్రధాన తేడా కొవ్వు, క్యాలరీల్లో ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్‌లో కొవ్వు, క్యాలరీలు ఎక్కువ. టోన్డ్ మిల్క్‌లో తక్కువ. అలాగే టోన్డ్ మిల్క్‌లో కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కొద్దిగా తగ్గవచ్చు. అయినప్పటికీ రెండూ పోషకాలు అందిస్తాయి.

బరువు తగ్గాలనుకుంటే ఏ పాలు బెటర్?

Advertisement

బరువు తగ్గాలని, ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేసేవారికి టోన్డ్ మిల్క్ ఎంచుకోవడం మంచిది. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల మీ డైలీ క్యాలరీ టార్గెట్ బ్యాలెన్స్ చేయడం సులభం అవుతుంది.

ఫుల్ క్రీమ్ మిల్క్ ఎవరికి మంచిది?

ఎదిగే పిల్లలు, శారీరక శ్రమ చేసే వారు, ఎక్కువ ఎనర్జీ అవసరం ఉన్నవారు ఫుల్ క్రీమ్ మిల్క్ తాగడం మంచిది. ఈ పాలు రోజూ తాగితే మంచి ఎనర్జీ లభిస్తుంది. ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది.

Also Read: మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావిస్తారు.. ఆత్మాభిమానం గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే

మీరు ఏ పాలు ఎంచుకోవాలి?

మీ ఆరోగ్య లక్ష్యాలు, జీవనశైలి, శరీర అవసరాలను బట్టి ఎంపిక చేసుకోండి. మితంగా తీసుకుంటే రెండూ ఆరోగ్యకరమే. సమతుల ఆహారం, వ్యాయామంతో పాటు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.

రుచి, ఎనర్జీ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ మంచిది. టోన్డ్ మిల్క్ బరువు తగ్గాలనుకునే, ఫిట్‌నెస్ ప్రియులకు బెటర్. మీ అవసరాలకు తగినట్లు ఎంచుకొని సరైన మోతాదులో తీసుకోండి.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×