E-Paper
Advertisement

ఆమెకు బోర్ కొడితే చావాల్సిందే.. చరిత్రలో అత్యంత క్రూరమైన మహిళా కిల్లర్!

ఆమెకు బోర్ కొడితే చావాల్సిందే.. చరిత్రలో అత్యంత క్రూరమైన మహిళా కిల్లర్!
Advertisement

Vera Renczi :మాములుగా ఒక మనిషిని చంపితే ఏం చేస్తారు. కనిపించకుండా మాయం చేస్తారు. కాని ఒకరినిని, ఇద్దరినీ కాదు ఏకంగా 35 మందిని చంపిన ఒక మహిళ ఆ డెడ్ బాడీస్ ని ఇంట్లో జాగ్రత్తగా దాచుకుంది. ఏంటీ వినడానికే షాకింగ్ గా ఉందా ..అసలు ఆమె వారిని ఎందుకు, ఎలా మట్టుబెట్టిందో తెలుసుకోవాలని ఉందా ..అయితే చూసేద్దాం రండి.

క్రైమ్ స్టోరీ కాదు. అంతకి మించిన హర్రర్ స్టోరీ

Advertisement

వెరా రెన్స్ జి… ఈమె జీవితం ఒక మామూలు క్రైమ్ స్టోరీ కాదు. అంతకి మించిన హర్రర్ స్టోరీ. డబ్బు, అందం, స్టేటస్ అన్నీ ఉన్నా ఆమె లోని విపరీతమైన కామ వంచ, విపరీతమైన అబ్సెషన్ ఏకంగా 35 మందిని బలి తీసుకుంది. వెరా రెన్స్ జి 1903లో రొమేనియాలోని బుకారెస్ట్ నగరంలో కులీన వంశంలో పుట్టింది. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్. పైగా మంచి తెలివైన అందగత్తె కూడా. అలాంటి వెరా రెన్స్ తన మాటలతో ఎవరినైనా ఇట్టాగే బురిడీ కొట్టేసేది. అయితే చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోవడంతో  ఆమె పెరిగే తీరుపై ప్రభావం పడింది.

మిడ్ నైట్ పూట బాయ్స్ హాస్టల్ లో

Advertisement

ఇక పదేళ్ళ వయసులో ఉన్న కూతురు వెరా రెన్స్ ని వెంట బెట్టుకుని తండ్రి సెర్బియాకు మకాం మార్చాడు. ఇక అక్కడికి వెళ్ళిన వెరా రెన్స్ రెక్కలొచ్చిన పక్షిలా తెగ రెచ్చిపోయింది. ఆమె కోసం గవర్నెస్స్ లను, ట్యూటర్లను పెట్టినా ఏ మాత్రం వారిని కేర్ చెయ్యకుండా ఈ రూల్స్ గీల్స్ జాన్తా నై అంటూ అందమైన కుర్రాళ్ళ వెంట తిరిగేది. అయితే ఇంత చేస్తున్నా తన కూతురు అలాంటిది కాదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టేసుకున్నాడు తండ్రి. కాని ఎప్పుడైతే 15 ఏళ్ల వయసులోనే ఒక మిడ్ నైట్ పూట బాయ్స్ హాస్టల్ లో అడ్డంగా దొరికిందో ఆ క్షణాన తన కూతురు అసలు రూపం ఏంటో తండ్రికి క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చేసింది.

ఒక కుర్రాడితో సంబంధం పెట్టుకొని

ఇక తండ్రికి తన నిజ రూపం తెలీడంతో ఇక నన్ను ఆపేది ఎవరంటూ మరింత హద్దులు దాటేసింది. అలా రోజు ఎవరో ఒక కుర్రాడితో సంబంధం పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, ఆ తర్వాత అతను బోర్ కొట్టాడంటూ ఇంటికి తిరిగి రావడం ఆమె హ్యాబిట్ అయిపోయింది. వెరాలో ఉన్న ప్రధాన సమస్య ఏంటో తెలుసా .. ‘అటెన్షన్ సీకింగ్’. అవును ..ఆమెపైనే చుట్టూ ఉండేవాళ్ళ అటెన్షన్ ఉండాలి. ఈ విషయంలో తండ్రి విసిగిపోయి  ఎంత తిట్టినా వెరాలో మార్పు రాలేదు.

also read :డ్రాగన్ లో ప్రభాస్ ఎంట్రీ? నీల్ సినిమాలో ‘దేవ’ కామియో.. లీక్ నెట్టింట వైరల్ !

ఆమె చేసిన మొదటి మర్డర్

కానీ ఒకరోజు వెరా లైఫ్‌లో ఒక ట్విస్ట్ వచ్చింది. పేరు, ప్రతిష్టలు ఉన్న ఒక బిజినెస్ టైకూన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరినీ షాక్ ఇచ్చింది. పెళ్లయ్యాక వెరా ఒక పర్ఫెక్ట్ హై సొసైటీ లేడీలా మారిపోయింది. పెద్ద ప్యాలెస్, నౌకర్లు, పార్టీలు.. ఇలా ఆమె లైఫ్ ఒక కలలా సాగిపోయింది. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే 14 నెలల తర్వాత ఆమె భర్త మిస్ అయ్యాడు. వెరా అప్పట్లో ఒక గ్రేట్ యాక్ట్రెస్ లాగా ఏడుస్తూ, అతను తనను వదిలేసి వెళ్ళిపోయాడని అందరినీ నమ్మించింది. వాస్తవానికి అక్కడే ఆమె చేసిన మొదటి మర్డర్ అదే.

జోసెఫ్ రెన్స్ జి అనే ఒక ప్లేబాయ్

కొన్నాళ్ల తర్వాత వెరా తన పాత రూట్లోకి వచ్చేసింది. నైట్ క్లబ్‌లు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు జోసెఫ్ రెన్స్ జి అనే ఒక ప్లేబాయ్ తగిలాడు. అతను అందగాడు కానీ చిల్లరగా ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడు. అయినప్పటికీ అందగాడు అవడంతో వెరా అతనితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ జోసెఫ్ బుద్ధి మారలేదు. పెళ్లయిన రెండు నెలలకే అతను వేరే అమ్మాయిలతో తిరగడం మొదలుపెట్టాడు. వెరాలో ఉన్న పొసెసివ్‌నెస్ దాన్ని తట్టుకోలేకపోయింది. ఒకరోజు జోసెఫ్ కూడా మాయమయ్యాడు. “అతను నాకు విడాకులు ఇచ్చేసి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళిపోయాడు” అని వెరా కూల్‌గా చెప్పేసింది.

అత్యంత ప్రేమగా వైన్‌లో విషం

ఇక్కడి నుంచే వెరా ఒక సీరియల్ కిల్లర్‌గా మారింది. ఆమె పద్ధతి ఎలా ఉండేది అంటే. ఆమె ఎప్పుడూ ఒకేసారి ఇద్దరితో రిలేషన్‌లో ఉండదు. ఎవరిని ఎంచుకుంటుందో అతనిపై ప్రేమను, గిఫ్ట్ లను కురిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆమెకు బోర్ కొట్టినా లేదా అతను తనను వదిలి వెళ్తాడనే చిన్న క్లూ ఇచ్చినా, వెరా వాళ్ళని మట్టుపెట్టేది. దేనితో తెలుసా .. ఆర్సెనిక్ తో. అవును ..ఆమె తన ప్యాలెస్‌లో ఎవరికీ తెలియకుండా ఆర్సెనిక్ నిల్వ చేసేది.ఎవరైతే తనకి దూరంగా వెళ్తున్నారని అనుకుంటుందో వాళ్ళతో రొమాంటిక్ డిన్నర్ ఏర్పాటు చేసి, అత్యంత ప్రేమగా వైన్‌లో విషం కలిపి ఇచ్చేది. అతను తన కళ్ళ ముందే గిలగిలలాడుతూ చనిపోతుంటే, వాళ్ళని ఒక సైకోలా నవ్వుతూ చూసేది.

తన కొడుకును కూడా విషంతోనే

అలా ఒకరో ఇద్దరో కాదండోయ్ ..ఏకంగా 32 మంది ప్రియులను ఆమె అదే విధంగా మట్టుపెట్టి జింక్ శవపేటికల్లో పెట్టి, తన ప్యాలెస్ కింద ఉన్న సీక్రెట్ సెల్లార్‌లో భద్రపరిచేది. అయితే ఈ కథలో అత్యంత డార్క్ చాప్టర్ ఏంటో తెలుసా ..ఆమె తన కన్నకొడుకు లోరెంజోను కూడా చంపేసింది. అవును ..ఒకరోజు లోరెంజో అనుకోకుండా ఆ సెల్లార్‌లోకి వెళ్లి ఆ శవపేటికలను చూశాడు. తన గుట్టు బయటపడుతుందనే భయంతో, వెరా తన కొడుకును కూడా విషమిచ్చి చంపేసి, “వాడు విదేశాల్లో చదువుకుంటున్నాడు” అని కలరింగ్ ఇచ్చింది.

also read :జాన్వీ కపూర్ గ్లామర్ డోస్.. హద్దులు దాటుతున్న శ్రీదేవి తనయ! ఆ డ్రెస్ ఏంటి బాబోయ్?

మిలోరాడ్ అనే ఒక బ్యాంక్ ఆఫీసర్

అయితే ఎంత తెలివైన వారైనా ఎక్కడో ఒకచోట దొరికిపోతారు అన్నట్టుగా వెరా దొరికిపోవడానికి మిలోరాడ్ అనే ఒక బ్యాంక్ ఆఫీసర్ కారణమయ్యాడు. అతడికి పెళ్లి అయింది. అయినప్పటికీ వెరా మాయలో పడిపోయాడు. కానీ ఒకరోజు తన భార్య గర్భవతి అని తెలిసి, వెరాను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. “నన్ను వదిలేసి వెళ్తావా?” అనే అహంకారం వెరాలో బయల్దేరింది. ఇంకేం అతగాడికి కూడా రొమాంటిక్ డిన్నర్ పేరుతో స్కెచ్ గీసింది. ఆర్సెనిక్ ఇచ్చి లేపేసింది.

మాములుగా అయితే ఇదీ ఆ వరుస హత్యల జాబితాలో చేరేదే. కాని మిలోరాడ్ కనిపించకపోవడంతో అతని భార్య ఒక డిటెక్టివ్ రూపమెత్తింది. ఆ నోటా ఈ నోటా వెరా ఇంటికి వెళ్ళాడన్న నిజం తెలుసుకుంది. వెరా పాత రికార్డులను తీసింది. కట్ చేస్తే ఆ ఇంటిలో అడుగు పెట్టిన ఒక్కడు కూడా బయటికి రాలేదన్న నిజం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ 35 శవాలను చూస్తూ

ఇంకేం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే వెరా ధనికురాలు అవడంతో కాస్త వెనుకడుగు వేసినా మొత్తానికి ఇంటిపై రైడ్ చేశారు. అప్పుడే ఆ ఇంటి సెల్లార్ లో బయటపడ్డ ఆ 35 శవపేటికలు చూసి నోరెళ్ళ బెట్టారు.ఇక ఆ సెల్లార్‌లోని ఒక పడక్కుర్చీలో కూర్చుని, తన చుట్టూ ఉన్న ఆ 35 శవాలను చూస్తూ కాలం గడిపేది అని తెలిసినప్పుడు ప్రపంచం బిత్తర పోయింది.

ఇదంతా ఎందుకు చేశావ్ అని వెరాని అడిగితే ఏమందో తెలుసా … “నేను వారిని ప్రేమించాను.. వారు వేరే ఎవరికీ దక్కకూడదనే నా దగ్గరే శాశ్వతంగా ఉంచుకున్నాను” అని చెప్పిందంటే ఆమె మానసిక స్థితి ఎంతలా దిగజారిపోయిందో అర్థం అవుతుంది.

1960లో 57 ఏళ్ల వయసులో

అయితే ఇంతా చేసినా ఆమెకు మరణ శిక్ష పడకుండా లైఫ్ తో సరిపెట్టడానికి కారణం ఆ కాలంలో స్త్రీలకు మరణశిక్ష లేకపోవడమే.

అలా కటకటాల మధ్యకి వెళ్ళిన వెరా జైలులోనే పిచ్చిదానిలా మారి, తన చుట్టూ తన ప్రియులే ఉన్నట్లు ఊహించుకుంటూ 1960లో 57 ఏళ్ల వయసులో వెరా కనుమూసింది. ఇదీ వెరా రెన్స్ జి అనే కామపిశాచి యొక్క కథ. మరి మీరూ ఇలాంటి వాళ్ళ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉంటారు కదూ !

also read :టాలీవుడ్ బిగ్గెస్ట్ మిస్టరీ.. బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్లో ఆగిన ‘మెగా’ ప్రాజెక్ట్ వెనుక అసలు కథ ఇదే!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×