Peddi Trailer : పెద్ది ..పెద్ది..పెద్ది ఎక్కడ చూసినా ఈ పేరే ఇపుడు రీ సౌండ్ చేస్తుంది.కారణం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ వైటెడ్ మూవీ మరో ఇరవై రోజుల్లో థియేటర్ లోకి రాబోతుంది మరి. ఇక గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత చరణ్ ఏరి కోరి బుచ్చి బాబుతో జత కట్టడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఇక ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్, ‘పహిల్వాన్’ లుక్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వ్యూస్ ల వర్షం కురిపించాయి కూడా. ఇక సినిమా అతి త్వరలో రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచే పనిలో పడ్డారు మేకర్స్ .ఈ క్రమంలో ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న వదలనున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.
ఒక పక్కా ప్రమోషనల్ ప్లాన్
ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబై గడ్డ మీద జరిపేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది మూవీ టీమ్.అయితే దీని వెనుక ఒక పక్కా ప్రమోషనల్ ప్లాన్ ఉందండోయ్.అదే ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘జియో స్టూడియోస్’ దక్కించుకోవడం.ఇక హిందీతో పాటు తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా సొంతం చేసుకున్న జియో స్టూడియోసే దక్కించుకోవడం విశేషం. ఇక ఇదే కాకుండా ముంబైలో జరిగే ట్రైలర్ లాంచ్ తర్వాత, భోపాల్‌లో ఏకంగా ఒక గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.అంటే మొత్తానికి పుష్ప 2 తరహాలో సినిమాని నేషనల్ వైడ్ గా ఈ సినిమాను ఒక రేంజ్‌లో ప్రమోట్ చేయాలని నిర్ణయించుకుందన్నమాట.
also read :ఒక్క వీడియోతో సీన్ రివర్స్.. ఆర్జే బాలాజీ ‘బిగ్ ప్లాన్’ అట్టర్ ఫ్లాప్!
మెగాఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్
సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటం,దీనికి తోడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చరణ్ తో జోడీ కట్టడం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సాలిడ్ ట్యూన్స్ అందిస్తుండటం ..అన్నీ కలగలిపి సినిమాకి పెద్ద ఎస్సెట్ లా మారిపోయాయి.దీనికి తోడు సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, హిందీ నటులు దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి క్రేజీ క్యాస్టింగ్ ఉండటం సినిమాని మరో మెట్టు ఎక్కించేదే. ముఖ్యంగా శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయడం మెగాఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి.
రెండు వేర్వేరు షేడ్స్‌లో కనిపించబోతున్న చరణ్
నిజానికి ఈ సినిమా 2024 మార్చిలో గ్రాండ్‌గా లాంచ్ అయినప్పటి నుంచి ఎన్నో ఆశలు పెంచేసింది. గతంలో బుచ్చిబాబు తన డెబ్యూ మూవీ ‘ఉప్పెన’తో వంద కోట్లు కొట్టేసి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను 1980ల నాటి కోస్తా ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు . ఇందులో చరణ్ క్రికెటర్ మరియు రెజ్లర్ (పహిల్వాన్)గా రెండు వేర్వేరు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వదిలిన అప్ డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. వృద్ది సినిమాస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, జూన్ 4వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే. చూడాలి మరి మే 18న ముంబైలో రిలీజ్ అయ్యే ట్రైలర్ తో నేషనల్ వైడ్ గా ‘పెద్ది’ ఎలాంటి మ్యానియాని స్ప్రుష్టిస్తుందో !
also read :CM విజయ్ ‘మాస్’ డెసిషన్.. 717 వైన్ షాపులు ఖాళీ..హీరో విశాల్ రియాక్షన్ వైరల్!