E-Paper
Advertisement

CM విజయ్ ‘మాస్’ డెసిషన్.. 717 వైన్ షాపులు ఖాళీ..హీరో విశాల్ రియాక్షన్ వైరల్!

CM విజయ్ ‘మాస్’ డెసిషన్.. 717 వైన్ షాపులు ఖాళీ..హీరో విశాల్ రియాక్షన్ వైరల్!
Advertisement

Vishal Support Vijay: సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టి కోట్లాది గుండెల్లో దళపతిగా నిలిచిపోయిన విజయ్ ఇపుడు తమిళనాడు సీయం గా తనదైన మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నాడు. గతంలో ఎన్నో సినిమాలలో ప్రజల కోసం పోరాడే పాత్రల్లో అలరించిన విజయ్ ఇపుడు రియల్ లైఫ్ లోనూ అదే సామాజిక స్పృహను ప్రదర్శిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా విజయ్ తీసుకున్న ఒక డేరింగ్ డిసీషన్ ఇపుడు నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అయ్యింది.

 717 వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు

Advertisement

ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును, మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకుని సీఎం విజయ్ రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 717 వైన్ షాపులను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారట.ఇక విజయ్ ఇలా ఆర్డర్ పాస్ చేసాడో లేదో తమిళనాడు అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంతటి డేరింగ్ డిసీషన్ తీసుకోవడం అంత ఆశామాషీ కాదనే చెప్పాలి. దీనివల్ల గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కంటే, ప్రజల క్షేమమే ముఖ్యమని నిరూపించాడు విజయ్.

విశాల్ రియాక్ట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్

Advertisement

ఇక ఈ హిస్టారికల్ డిసీషన్ పై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రియాక్ట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో విశాల్ రియాక్ట్ అవుతూ .. “మీకు నా హ్యాట్సాఫ్ సీఎం విజయ్ గారు. పాఠశాలల సమీపంలో ఉన్న 717 వైన్ షాపులను మూసివేస్తూ మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా అద్భుతం. దీనివల్ల ఎంతోమంది ఆడపిల్లలకు వేధింపుల నుండి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఆర్కే నగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లే చిన్న పిల్లలు మద్యం దుకాణాల వల్ల పడుతున్న ఇబ్బందులను నేను స్వయంగా చూశాను. ఒక సామాన్యుడిగా, ఒక నటుడిగా మీ నిర్ణయానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ మార్పు తమిళనాడు భవిష్యత్తును మారుస్తుంది” అంటూ పోస్ట్ లోనే ఎమోషనల్ అయిపోయాడు విజయ్.

also read :ఫోన్ లో చూసే సినిమాకు 500 టికెట్ ఎందుకు.. టాలీవుడ్ మేకర్స్ పై రాహుల్ రామకృష్ణ సెటైర్స్

ఇప్పుడు సీఎంగా తన మార్క్

ఇక విజయ్ తన కెరీర్‌లో ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్’ వంటి ఎన్నో సినిమాల్లో సొసైటీలోని లోపాలను ప్రశ్నించిన సంగతి తెల్సిందే. ముఖ్యంగా ‘కత్తి’ సినిమాలో రైతుల సమస్యలను, ‘సర్కార్’లో ఓటు హక్కుఇంపార్టెన్స్ ని చాటిచెప్పిన విజయ్, ఇప్పుడు సీఎంగా తన మార్క్ చూపిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే పాఠశాలలు మరియు ఆలయాల సమీపంలో కనీసం 500 మీటర్ల దూరంలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదనే కండీషన్ ని అమలు చేయాలంటూ ఆర్డర్స్ పాస్ చేసాడు విజయ్.

ప్రజల ఆరోగ్యం – రాష్ట్ర ప్రగతి

మాములుగా చూస్తే ఆల్కహాల్ ద్వారా వచ్చే ఇన్ కమ్ పైనే స్టేట్ గవర్నమెంట్స్ డిపెండ్ అవుతాయన్న సంగతి తెల్సిందే.అలాంటిది ప్రజల ఆరోగ్యం – రాష్ట్ర ప్రగతి’ అనే స్లోగన్ తో విజయ్ ముందుకు సాగడం ఇక్కడ గమనార్హం.ఇక ఈ 717 షాపుల మూసివేతపై విశాల్ వంటి స్టార్స్ ఓపెన్ గా సపోర్ట్ చేయడం, ఇతర రంగాల సెలెబ్రెటీస్ కూడా దీన్ని వెల్కం చేయడంతో విజయ్ ‘క్రేజ్’సిల్వర్ స్క్రీన్ పైనే కాదు పొలిటికల్ గ్రౌండ్లో కూడా పీక్స్‌కు చేరింది. మరి ఈ ఊపు ఇలాగే కంటిన్యూ అవుతుందా లేక అందరిలాగే మారిపోతాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి !

also read :అప్పుడు ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ‘కల్కి 2’.. అదే తప్పు మళ్ళీ జరుగుతుందా?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×