E-Paper
Advertisement

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?
Advertisement

Ram Charan Sukumar Next Movie:రంగస్థలం..సుక్కు, చరణ్ కాంబోలో 2018 మార్చి 30న వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు.బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200కోట్లు కొల్లగొట్టి చరణ్ కెరీర్ లోనే RRR తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సత్తా చాటింది.

అప్పటి వరకు యాక్షన్ ,స్టైలిష్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ ఈ సినిమాతో ఒక పక్కా పల్లెటూరి చెవిటి యువకుడిగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు.పైగా 66వ నేషనల్ అవార్డ్స్ లో ఈ సినిమాకి బెస్ట్ ఆడియోగ్రఫీ దక్కగా, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, సైమా, జీ తెలుగు అవార్డ్స్ వంటివి ఎన్నో సొంతం చేసుకోవడం విశేషం.

దసరాకి పూజా కార్యక్రమాలతో ఘనంగా

Advertisement

ఇలా ఒక్క సినిమాతోనే సినీ ఇండస్ట్రీ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సుక్కు, చరణ్ ల కాంబోలో మరొక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ .ఇక గతంలోనే సినిమా ఉంటుందని అనౌన్స్ చేసినప్పటికీ తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక క్రేజీ అప్ డేట్ ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.అదేంటో తెలుసా.ఈ సినిమా ముహూర్తం గురించి.అవును ఈ సినిమా వచ్చే దసరాకి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కాబోతుందన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

క్యాస్టింగ్ గురించి కూడా పలు రూమర్స్

మరో వైపు ఈ సినిమాలో నటించే క్యాస్టింగ్ గురించి కూడా పలు రూమర్స్ ఇపుడు మెగా ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి.ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తుందని మొదటగా వినిపించినప్పటికీ ,ఆ తర్వాత దురంధర్ బ్యూటీ సారా అర్జున్ తళుక్కుమంటుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే వీటన్నింటిని కాదని ప్రస్తుతం మరోసారి రంగస్థలం సినిమాకి బాగా అచ్చొచ్చిన సమంతనే మళ్ళీ చరణ్ కి జోడీగా ఒకే చేయబోతున్నారన్న వార్తలు ఇపుడు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Advertisement

మరో వైపు చిరుతో మన శంకర వరప్రసాద్ సినిమాలో సందడి చేసిన నయనతార కూడా ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తుందన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.మరి వీరిలో ఎవరు ఆన్ బోర్డ్ అవుతారో, ఎవరు సైలెంట్ గా సైడ్ అవుతారో మేకర్స్ అఫీషియల్ గా అప్ డేట్స్ వదిలితే కాని తెలిసేలా లేదు.

ALSO READ:టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

ఎలాంటి సినిమాతో ఈ జోడీ అలరిస్తుందో !

ఇక సుక్కు విషయానికి వస్తే బన్నీ తో తీసిన చివరి సినిమా పుష్ప2 బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్లని కొల్లగొట్టి సుక్కు క్రేజ్ అమాంతం పెంచేసింది.దీంతో ఈ డైరెక్టర్ ఇపుడు చరణ్ తో ఎలాంటి సినిమా తీస్తాడా అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి ఎలాంటి సినిమాతో ఈ జోడీ మళ్ళీ ఆడియన్స్ ని అలరిస్తుందో !

Tags

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×