E-Paper
Advertisement

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..
Advertisement

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్ ఎపిసోడ్‌.. రేవంత్ నాయ‌క‌త్వాన్ని మ‌రింత బ‌ల‌వంతుడిని చేసింది. రేవంత్‌ను ఎవ‌రు ప‌డితే వాళ్లు ఇక బెదిరింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డే చాన్స్ లేకుండా అధిష్టానం స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్న‌దనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చిన్నారెడ్డి వ్యాఖ్య‌ల‌ను కూడా లైట్‌గా తీసుకోలేదు అధిష్టానం. స్వేచ్చ ఉంది క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడ‌టం.. సీఎంను బెదిరించే రీతిలో మాట్లాడితే చెల్లుబాట‌వుతుంది.. అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌నే భావ‌న ప్ర‌స్తుత కాంగ్రెస్‌లో ఇక‌పై ఉండ‌ద‌నే సంకేతాలిచ్చింది అధిష్టానం.

Advertisement

ఇప్ప‌టికే స‌ర్కార్ కు స‌గం ట‌ర్ము పూర్త‌య్యింది. ప్ర‌జా వ్య‌తిరేకత పెరుగుతున్న‌ది. హామీల‌న్నీ అమ‌లు కాలేద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. దీన్ని బ‌లంగా ప్ర‌జ‌ల‌కు చేరేవేసేలా బీఆరెస్ నిరంత‌రం పోరాడుతున్న‌ది. వెంటాడుతున్న‌ది. ఈ క్ర‌మంలో పాల‌న‌పై ప‌ట్టు బిగించాల్సిన స‌మ‌యంలో.. ఇలా అస‌మ్మ‌తి సెగ‌ల‌తో సీఎం ర‌గ‌లిపోతుంటే.. ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రింత ఊత‌మిచ్చినట్టే అవుతుంద‌నే భావ‌న కూడా అధిష్టానంలో ఉంది.

అందుకే బీసీ కార్డు ప్ర‌యోగించినా.. సీనియ‌ర్ మ‌హిళా నేత‌న‌ని ప్రొజెక్టు చేసుకున్నా మ‌రోసారి కొండా విష‌యంలో ద‌యార్ధ్ర హృదయాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఏమాత్రం ఆలోచించ‌లేదు. సీఎం రేవంత్ ఇచ్చిన రిపోర్టు.. చేసిన సూచ‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేసి చూపింది. దీంతో అధిష్టానం వ‌ద్ద రేవంత్ బ‌లం ఏపాటితో రాష్ట్ర రాజ‌కీయాల‌కు సంకేతం ఇచ్చిన‌ట్టే కాకుండా.. త‌మ‌లోని అంతర్గ‌త అస‌మ్మ‌తివాదుల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌ను జారీ చేసిన‌ట్టుగా భావించాలి.

Advertisement

ఉన్న‌ది రెండేళ్ల కాలం. ఇంకా చేయాల్సిన‌వి చాలా ఉన్నాయి. చేసిన విష‌యాల‌ను జ‌నంలోకి పెద్ద‌గా తీసుకెళ్ల‌లేక‌పోయింది పార్టీ. తీవ్ర అసంతృప్తిలో జ‌నాలున్నార‌నే ప్ర‌చారం రోజు రోజుకూ పెరుగుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే రేవంత్ మ‌రోసారి కాంగ్రెస్ స‌ర్కారే అధికారంలోకి రాబోతున్న‌ద‌ని, నేనే మ‌రోసారి సీఎంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించుకుంటున్న వేళ‌.. అధిష్టానం కూడా ఆయ‌న‌కు కొండంత అండ‌గా ఉన్న‌ద‌నే విష‌యం కొండా సురేఖ ఉదంతంతో బ‌య‌ట‌ప‌డింది.

ప‌రిపాల‌న‌పై ఇక మ‌రింత ప‌ట్టు సాధించే దిశ‌గా రేవంత్‌కు అన్ని రూట్లు క్లియ‌ర్ చేసి పెట్టింది అధిష్టానం. మ‌రోసారి అధికారంలోకి రావాలంటే రేవంత్ నాయ‌క‌త్వాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఇక‌పై అస‌మ్మ‌తి వాదులు ఎడాపెడా వాగితే తాడోపేడో తేల్చేస్తామ‌ని మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేసింది. బీ కేర్ ఫుల్ అని అల‌ర్ట్ చేస్తోంది. అయినా అలాగే ఉంటామంటే వేటుకు సిద్దంగా ఉండాల‌ని కూడా మెసేజ్ ఇస్తోంది.

Tags

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

Big Stories

Advertisement
×