E-Paper
Advertisement

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?
Advertisement

Toxic Box Office:గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ తెరకెక్కిన టాక్సిక్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నపటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.విడుదలైన తొలి రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది .అయితే వచ్చిన టాక్ చూసి ఇక ఏ రెండొందల దగ్గర చాప చుట్టెయ్యడం ఖాయం అనుకున్నారు అంతా.కానీ ఊహించని విధంగా సినిమా నెగెటివ్ టాక్ ని దాటుకుని మరీ 315 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో నోరెళ్ళ బెడుతున్నారు ట్రేడ్ పండితులు.

అయితే సినిమా కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపిస్తున్నప్పటికీ చాలా మంది నుండి వినిపిస్తున్న ప్రశ్న ..ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అని.నిజానికి కనా కష్టంగా సినిమా 300 కోట్ల మార్కును టచ్ చేసినప్పటికీ రూ. 500 కోట్ల మైలురాయిని అందుకోవాలంటే ఇంకా దాదాపు రూ. 185 కోట్ల గ్రాస్ కావాలి.ఒకరకంగా చూస్తే ఈ ఫిగర్ చాలా పెద్దగానే కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా రీచ్ కాలేని నెంబర్ మాత్రం కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు .

కలెక్షన్స్ వీక్ గా ఉండటం చాలా కామన్

Advertisement

వాస్తవానికి వీకెండ్స్ తో పోలిస్తే వీక్ డేస్ లో కలెక్షన్స్ వీక్ గా ఉండటం చాలా కామన్ .ముఖ్యంగా మిక్స్‌డ్ టాక్ ఉన్న సినిమాలకు సోమవారం నుంచి ఆక్యుపెన్సీ ఎక్కువ ఊహించలేం కూడా.కానీ, ఇక్కడే రెండో వీకెండ్ కీ రోల్ పోషిస్తుంది.శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు సగటున రూ. 15–20 కోట్ల వసూళ్లు సాధించగలిగితే, ఒక్క వీకెండ్‌లోనే రూ. 45–60 కోట్లు ఖాతాలో పడతాయి. రెండో వారం మొత్తం మీద రూ. 70–90 కోట్లు రాబట్టగలిగితే, ‘టాక్సిక్’ ఈజీగా రూ. 400 కోట్ల క్లబ్‌ లో వెళ్లి కూర్చుంటుంది.

నేషనల్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా నెట్

అక్కడి నుంచి మూడో వారం థియేట్రికల్ రన్, ఓవర్సీస్ షేర్ కలిపి రూ. 80–100 కోట్లు తెస్తే రూ. 500 కోట్ల మార్క్ పెద్ద కష్టమేమీ కాదు.‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ సంపాదించుకున్న పాన్ ఇండియా మేనియా ఈ సినిమాకు బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.మొదటి రోజునే నేషనల్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయంటే యష్ స్టామినా ఏంటో అర్థం అవుతుంది.

Advertisement

కేవలం కర్ణాటక మార్కెట్‌పైనే ఆధారపడకుండా, హిందీ బెల్ట్, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కావడం మరో ప్లస్ పాయింట్.
ఒక ప్రాంతంలో కలెక్షన్లు కాస్త తగ్గినా, మిగిలిన మార్కెట్లు ఆ లోటును కవర్ చేయడంతో మూడొందల కోట్లకి రీచ్ అయ్యింది.

థియేటర్లకు రప్పించడంలో సక్సెస్

మాములుగా ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా మరుసటి రోజు సినిమా కలెక్షన్స్ టోటల్ గా డ్రాప్ అయిపోతాయి.కానీ ‘టాక్సిక్’ విషయంలో రివ్యూలతో సంబంధం లేకుండా వీకెండ్ లలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవుతుంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను పరిశీలిస్తే ‘టాక్సిక్’ రూ. 400 కోట్ల మార్కును చేరుకోవడం చాలా ఈజీనే.కానీ, రూ. 500 కోట్ల ప్రతిష్టాత్మక మైలురాయిని తాకాలంటే మాత్రం సినిమా రాబోయే రోజుల్లో ప్రతి వీకెండ్‌లోనూ తన సత్తా చాటాల్సిందే.

also read:శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

500 కోట్లు టచ్ చేస్తుందా

అయితే ఇది ఒక అంచనా మాత్రమే ..వచ్చే రోజుల్లో థియేటర్లలో ఫుట్ ఫాల్స్ తగ్గితే మాత్రం ముచ్చటగా 350 కోట్ల దగ్గరే ఆగినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి 500 కోట్లు టచ్ చేస్తుందా లేక దరిదాపుల్లోకి వచ్చి తోక ముడుస్తుందా !

Tags

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×