E-Paper
Advertisement

Allu Arjun: కడింపల్లి దుర్గకు ఆర్థిక భరోసా..మాట నిలబెట్టుకున్న అల్లు అర్జున్..

Allu Arjun: కడింపల్లి దుర్గకు ఆర్థిక భరోసా..మాట నిలబెట్టుకున్న అల్లు అర్జున్..
Advertisement

Allu Arjun: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో భాగంగా దాదాపు 23 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తండ్రిన కోల్పోయిన దివ్యాంగురాలు కడింపల్లి దుర్గకు (Kadimoalli Durga)జీవితాంతం ఆర్థిక భరోసా కల్పిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రతినెల ఆ మహిళకు 7500 రూపాయలు సహాయం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళ నిత్యావసర, మందుల నిమిత్తం అల్లు అర్జున్ ఈ మహిళకు అండగా నిలిచారు. ఇలా అల్లు అర్జున్ ఈ మహిళకు జీవితాంతం ప్రతినెల 7500 సహాయం చేస్తానని చెప్పడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపించారు.

కడింపల్లి దుర్గకు అల్లు అర్జున్ సాయం..

ఇలా అల్లు అర్జున్ మాట ఇవ్వడమే కాకుండా మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. అల్లు అర్జున్ ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల కడింపల్లి దుర్గకు 7500 నేరుగా తన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా అల్లు అర్జున్ ఇచ్చిన మాట ప్రకారం తన మాటను నిలబెట్టుకోవడంతో మరోసారి బన్నీ గొప్ప మనసు పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ కేవలం దుర్గకు మాత్రమే కాకుండా ఇటీవల సినీనటి పావలా శ్యామలకు కూడా ఆర్థిక భరోసా కల్పించిన సంగతి తెలిసిందే.

అట్లీ డైరెక్షన్ లో బిజీగా బన్నీ..

Advertisement

ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఇలా సహాయ సహకారాలను అందిస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ హై యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం.

Advertisement

ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ పవర్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరి నుంచి లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ బిజీ కానున్నారు.

Also Read: Singer Mangli: బూతు పాట వివాదం పై స్పందించిన మంగ్లీ.. క్షమించండంటూ!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×