E-Paper
Advertisement

Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది

Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
Advertisement

Garuda Purana:  కాకి పిండం తింటే పితృదేవతలకు చేరుతుందా..? అసలు కాకి పిండం తినడం ఏంటి..? కాకికే ఎందుకు పిండం పెట్టాలి. కాకి తింటేనే పితృదేవతలకు చేరుతుందని ఎందుకు నమ్ముతారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ సనాతన ధర్మంలో పిండ ప్రధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ మనిషైనా చనిపోయిన తర్వాత జరిగే దశదినకర్మ రోజు ఆ మనిషి ఆత్మకు శాంతి చేకూర్చేందుకు పిండ ప్రధానం చేస్తుంటారు. అయితే ఇలా పిండ ప్రధానం చేయడం అనేది ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని చోట్ల ప్రతి సంవత్సరం ఆ వ్యక్తి చనిపోయిన రోజు కూడా పిండ ప్రధానం చేస్తుంటారు. కొందరైతే బాద్రపద అమావాస్యకు పితృదేవలను స్మరించుకుంటారు. ఇలా ప్రాంతాలను బట్టి ఒక్కో విధంగా ఉంటుంది.

Advertisement

శాస్త్రీయ విశ్వాసాల ప్రకారం, తద్దినం లేదా పిండప్రదానం సమయంలో కాకులు పిండం తింటే, ఆ ఆహారం పితృదేవతలకు (తమ పూర్వీకులకు) చేరుతుందని నమ్ముతారు. కాకిని పితృదేవతల ప్రతినిధిగా భావిస్తారు. యముని వరం వల్ల కాకులు ఆ ఆహారాన్ని స్వీకరించి, పితృలోకాలకు చేరవేస్తాయని, దీనితో పూర్వీకుల క్షుద్బాదలు తీరి తృప్తి చెందుతారని పండితులు చెప్తున్నారు.

కాకి ఎందుకు ముఖ్యంగా భావిస్తారు?: హిందూ సంప్రదాయంలో కాకిని పితృదేవతల దూతగా భావిస్తారు. పిండ ప్రదానం లేదా శ్రాద్ధ సమయంలో పెట్టిన పిండాన్ని కాకి తింటే పితృదేవతలు ఆ పిండాన్ని స్వీకరించారు అనే సంకేతంగా భావిస్తారు.

Advertisement

గరుడ పురాణం ఏం చెప్తుంది: గరుడ పురానం (Garuda Purana) ప్రకారం శ్రాద్ధ సమయంలో పెట్టిన అన్నం, పిండం, నీరు మొదట పితృదేవతలకు సమర్పణగా ఉంటుంది. కాకి వచ్చి తింటే అది పితృదేవతలు  తృప్తి పడినట్టుగా బావించాలని గరుడ పురాణం చెప్తుంది. ఇంకా కాకి ఒక్కటే కాదు కుక్క, ఆవు వంటి జంతువులు తినడం ద్వారా పితృదేవతలు సంతోషించినట్టే బావించాలట.

కాకి తినకపోతే ఏమవుతుంది?: హిందూ శాస్త్రాల ప్రకారం పిండం పెట్టినప్పుడు కాకి తినకపోతే అది తప్పనిసరి చెడు సంకేతం కాదట. కొన్ని సార్లు కాలం, ప్రదేశం, ఆహారం వాసన వంటి కారణాల వల్ల కాకి రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా అది తినకపోవచ్చు అని సూచిస్తున్నారు. అలా కాకి తినకపోతే..కూడా శాస్త్రంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్తున్నారు పండితులు.

కాకికి ప్రత్యామ్నాయం ఉందా?: పిండ ప్రధానం చేసినప్పుడు కాకి వచ్చి తినకపోతే.. అప్పుడు మంత్రాలతో పూజ చేసి బ్రాహ్మణులకు దానం చేస్తే కూడా  పితృ దేవతలకు చేరుతుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు పిండం పెట్టడమే కాదు .. వారిని స్మరించుకవడం కూడా చేయాలట. ఇంకా పితృ దేవతల పేరు మీద పేదలకు దానాలు చేయాలట. (అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం లాంటివి) అలాగే ధర్మంగా బతకాలట. న్యాయంగా జీవించాలట. ఇలా చేయడం వల్ల కూడా పితృ దేవతలు సంతోషిస్తారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఉగాది పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×