Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కు సర్జరీ జరగబోతోంది అని తెలిసి.. మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనకు ఏం జరిగింది? ఎందుకు సర్జరీ చేయించుకోబోతున్నారు? ఎక్కడ సర్జరీ చేయించుకోబోతున్నారు ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సర్జరీ చేయించుకొని ఆరోగ్యంగా ముంబై నుండి తన ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సంతోషకరమైన వార్త నుండి అభిమానులు ఊపిరి పీల్చుకునే లోపే.. మరో షాకింగ్ న్యూస్ వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది (Peddi Movie) సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మరొకవైపు సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో చేయబోయే RC 17కి సిద్ధమవుతున్న సమయంలో సర్జరీ ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఇప్పుడు ఆయన సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ మేరకు వారు కోయంబత్తూర్ కి బయలుదేరిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!
అయితే రామ్ చరణ్ రేపు కోయంబత్తూర్ లోని గంగా ప్రైవేట్ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకోబోతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana ), ఆయన తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సురేఖ(Surekha konidela)కూడా ఆయనతో పాటు కోయంబత్తూర్ కి వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సర్జరీ పూర్తయి ..కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాతే.. సుకుమార్ తో చేయబోయే సినిమా షూటింగు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇకపోతే రామ్ చరణ్ కి సర్జరీ అని తెలియగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. సర్జరీ సక్సెస్ అవ్వాలని, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్. ఈ సినిమా సమయంలో కేవలం మెగాస్టార్ చిరంజీవి వల్లే ఆయన సినిమా సక్సెస్ అయ్యింది అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. అంతేకాదు రామ్ చరణ్ గెటప్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత పట్టుదలతో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తన రెండవ చిత్రం మగధీర సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. తర్వాత ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ నేడు గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రెడ్ కార్పెట్ పై కూడా సందడి చేశారు. ఇప్పుడు పెద్ది సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమా చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.