E-Paper
Advertisement

అంబటితో వేదిక పంచుకున్న బోండా ఉమా.. చంద్రబాబు రియాక్షన్ చూస్తే మైండ్ బ్లాకే!

అంబటితో వేదిక పంచుకున్న బోండా ఉమా.. చంద్రబాబు రియాక్షన్ చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇటీవల ఒకే వేదికపై కనిపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యర్థి పార్టీ నేతతో వేదిక పంచుకోవడంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

గొడ్డలి పార్టీతో జాగ్రత్త.. అధినేత హెచ్చరిక

Advertisement

టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ నైజాన్ని ఎండగట్టారు. ‘అదొక గొడ్డలి పార్టీ, సమాజానికి విషవృక్షం లాంటిది’ అని ఘాటుగా అభివర్ణించారు. నిత్యం కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడమే ఆ పార్టీ ముఖ్య అజెండా అని ఆరోపించారు. వైసీపీ నేతలు పన్నే రాజకీయ కుట్రల పట్ల, వారు వేసే ట్రాప్‌లలో పడకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలతో వేదికలు వద్దు!

Advertisement

వైసీపీ నాయకులతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు తెగేసి చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రత్యర్థి పార్టీ యత్నిస్తోందని, వారి కార్యక్రమాలకు లేదా వారి సమక్షానికి దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యలకూ తావివ్వకూడదని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే ఎలాంటి పరిణామాల్లోనూ భాగస్వాములు కాకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

దృష్టి మొత్తం అభివృద్ధి, సంక్షేమంపైనే

రాజకీయ వివాదాల్లో చిక్కుకోకుండా పార్టీ శ్రేణుల దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపైనే ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దీనికోసం ప్రతి నాయకుడు ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. అనవసర రాజకీయ వేదికలపై సమయం వృధా చేయకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేయడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. మాజీ సీఎం సంచలన ప్రకటన!

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×