E-Paper
Advertisement

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!
Advertisement

Maa inti Bangaram:ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ సినిమా తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని మళ్లీ ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ 100 కోట్లతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా లీడ్ రోల్ పోషిస్తూ గుల్షన్ దేవయ్య, శ్రీముఖి(SREemuki) తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా.. అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు రాబట్టడం అంటే నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు సమంత పై, యాక్షన్ పర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఓటీటీలో కూడా దూసుకుపోతున్న మా ఇంటి బంగారం..

గత నెల అనగా జూన్ 19న థియేటర్లలోకి అడుగుపెట్టి మంచి విజయం అందుకున్న ఈ సినిమా.. నెల తిరగకుండానే జూలై 17వ తేదీ నుంచి ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్ లో నిలిచి అగ్రస్థానానికి చేరుకొని.. అటు థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీలలో కూడా సత్తా చాటింది ఈ సినిమా. 2 గంటల 32 నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ లో సమంత(Samantha) ఒక్కరే ఈ కథను తన భుజాలపై మోసారని ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తున్నారు.. మొత్తానికి అయితే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ట్రెండింగ్లో నిలిచింది. ఇప్పటికే థియేటర్లలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో మంచి స్పందన దక్కించుకోగా.. ఇటు డిజిటల్ వేదికగా కూడా అదే ఊపు కొనసాగిస్తోంది.

Advertisement

ALSO READ:పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!

మా ఇంటి బంగారం సినిమా స్టోరీ..

మా ఇంటి బంగారం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. స్వర్ణ అనే అనాథ యువతి చుట్టూ తిరుగుతుంది. బయటకు ఎంతో అమాయకంగా కనిపించినా.. ఆమె జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలను ఎదుర్కొని ఉంటుంది. పెళ్లయిన తర్వాత డాక్టర్ అయిన తన భర్త కుటుంబంలో కలిసిపోవాలని ఎంత ప్రయత్నించినా పరిస్థితులు మాత్రం ఆమెకు అనుకూలించవు. అదే సమయంలో గతంలో తనకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు మళ్లీ ఆమె జీవితంలోకి అడుగు పెడతారు. దీంతో తనను మాత్రమే కాకుండా తన భర్త కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి స్వర్ణకు ఏర్పడుతుంది. ఆ తర్వాత స్వర్ణ పూర్తిగా మారిపోయి ఆమె చేతులు మళ్లీ ఆయుధం పట్టేలా చేస్తాయి. తనను వెంబడించిన శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రతీకారం తీర్చుకునే మహిళగా ఆమె ప్రయాణం సాగుతుంది. ఈ సినిమాలో సమంత చూపించిన యాక్షన్, ఎమోషనల్ పర్ఫామెన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా తెలుగుతోపాటు కొన్ని భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండగా.. హిందీ వర్షన్ ఇంకా ఓటిటి ప్లాట్ఫారంలో విడుదల కాలేదు. త్వరలోనే ఈ సినిమా హిందీ ఓటీటీ వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సమంత భర్త ప్రముఖ దర్శకనిర్మాత రాజ్ కథను అందించగా.. సమంత సొంత నిర్మాణ సంస్థ అయినా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related News

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

Big Stories

Advertisement
×