E-Paper
Advertisement

Ram Charan – Upasana: మెగా న్యూస్.. రామ్ చరణ్, ఉపాసనలకు కవల పిల్లలు.. ఫ్యాన్స్ సంబరాలు

Ram Charan – Upasana: మెగా న్యూస్.. రామ్ చరణ్, ఉపాసనలకు కవల పిల్లలు.. ఫ్యాన్స్ సంబరాలు
Advertisement

మెగా ఫ్యామిలీ ఇంట్లో మరో ఇద్దరు వారసులు అడుగుపెట్టారు. తన కోడలు ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి శనివారం అర్ధరాత్రి సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్ వెల్లడించారు. కవలల్లో ఒకరు మగ, మరొకరు ఆడ బిడ్డ అని తెలిపారు. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమాచారం తెలియగానే మెగా ఫ్యామిలీతోపాటు వారి అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. చెర్రి, ఉపాసనలకు అభినందనలు తెలుపుతున్నారు.

మంచు రికార్డు బ్రేక్..

రామ్ చరణ్ ఉపాసనలు 2023, జూన్ 20న క్లింకారాకు జన్మనిచ్చారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీలోనే కవలలు పుట్టారు. మంచు విష్ణు, ఆయన భార్య విరానికా 2011, డిసెంబర్ 2న అమెరికాలోని న్యూయార్క్‌లో కవల బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మెగా ఫ్యామిలీలో కవల పిల్లలు పుట్టారు.

ఏయే సెలబ్రిటీలకు ట్విన్స్ పుట్టారంటే..

Advertisement

సౌత్ ఇండస్ట్రీలో మంచు విష్ణు తర్వాత నటి నమితకు మాత్రమే ట్విన్స్ పుట్టారు. బాలీవుడ్‌లో కూడా ట్విన్స్‌కు జన్మనిచ్చిన సెలబ్రిటీల సంఖ్య తక్కువే. సంజయ్ దత్, మాన్యతా దంపతులకు 2010, అక్టోబరు 21న కవల పిల్లలు జన్మించారు.

కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకున్నా 2017లో మరో మహిళ సాయంతో సరోగసి ప్రక్రియ ద్వారా ట్విన్స్‌కు తండ్రి అయ్యాడు. మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్, డానియల్ జంట కూడా 2018లో సరోగసి విధానంలో ట్విన్స్‌కు పేరెంట్స్ అయ్యారు.

Advertisement

నటి ప్రీతి జింటా, ఆమె భర్త జీన్ గుడ్ ఎనౌకు 2021లో సరోగసి విధానంలో ట్విన్స్ పుట్టారు. అయితే, నటి సెలినా జైట్లీ ఏకంగా రెండు సార్లు కవల పిల్లలకు జన్మనిచ్చింది. 2012లో ఆమెకు విన్ స్టన్, విరాజ్‌లు పుట్టారు. 2017లో మరోసారి కవలలు జన్మించారు. నటి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా, ఆయన భార్య పూనం సిన్హాలకు కూడా కవల పిల్లలు పుట్టారు.

మొత్తానికి వారసుడు కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి కల కూడా నెరవేరింది. ఓ సందర్భంలో చరణ్‌కు మగ పిల్లాడు పుట్టాలని, తన ఇంటికి వారసుడు కావాలని చిరంజీవి బహిరంగంగానే వెల్లడించారు. ఆయన మాటలు అప్పట్లో వివాదాస్పదం కూడా అయ్యాయి. ఏది ఏమైనా ఈ ఏడాది మెగా‌స్టార్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి. సంక్రాంతికి విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్‌‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. తాజాగా మెగా స్టార్ కొడుకు రామ్ చరణ్‌కు కవల పిల్లలు పుట్టారనే వార్త‌తో చిరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: నీ బాడీ చూడాలంటూ వేధింపులు.. ఫోటోగ్రాఫర్ పై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్!

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×