E-Paper
Advertisement

Ram Gopal Varma: ఇప్పటి నుంచి రూటు మార్చిన ఆర్జీవీ.. తన కొత్త గురువు ఎవరో తెలుసా?

Ram Gopal Varma: ఇప్పటి నుంచి రూటు మార్చిన ఆర్జీవీ.. తన కొత్త గురువు ఎవరో తెలుసా?
Advertisement

Ram Gopal Varma: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక వివాదంతోనో, వినూత్న ప్రకటనతోనో వార్తల్లో ఉండే వర్మ, తాజాగా తన తదుపరి చిత్రం ‘సిండికేట్’ (SYNDICATE) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్ ది రివేంజ్’ సినిమా చూసిన తర్వాత, ఆయన తన ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతం మాదిరిగా కాకుండా తన కొత్త గురువు అయిన ఆదిత్యధర్ ను ప్రేరణగా తీసుకుని తన కొత్త సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.

Read also-Ram Charan : గ్లోబల్ స్టార్ కు ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా..?

కొత్త భవిష్యత్తు వైపు

Advertisement

వర్మ తన కెరీర్ ఆరంభం నుండి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలాను తన ఆదర్శంగా భావించేవారు. కొప్పోలా సృష్టించిన ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాల ప్రభావం వర్మ తీసిన ‘సత్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’ వంటి క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు వర్మ తన పాత గురువును పక్కన పెట్టి, సరికొత్త గురువును ఎంచుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “గతాన్ని వదిలేసి, సరికొత్త భవిష్యత్తును సృష్టించుకునే క్రమంలో.. నా తదుపరి చిత్రం ‘సిండికేట్’, నా కొత్త గురువు ఆదిత్య ధర్‌కు నా అంకితం,” అని వర్మ పేర్కొన్నారు.

‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య ధర్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్’ (Dhurandhar). ఈ సినిమా మేకింగ్, అందులోని టెక్నికల్ స్టాండర్డ్స్ వర్మను ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తన మేకింగ్ స్టైల్‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన వర్మ, ఇప్పుడు ఆదిత్య ధర్ పనితీరును చూసి ఆయన్నే తన ‘గురువు’గా సంబోధించడం విశేషం.

Advertisement

Read also-Psychological Thriller OTT : జర్నలిస్ట్ కు చుక్కలు చూపించే సీరియల్ కిల్లర్‌… ఊహించని మలుపులతో టాప్ లేపుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

‘సిండికేట్’ పై అంచనాలు

‘సిండికేట్’ సినిమా ద్వారా వర్మ మళ్ళీ తన పాత వైభవాన్ని అందుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొప్పోలా మార్కు క్రైమ్ డ్రామాల నుండి బయటకు వచ్చి, ఆదిత్య ధర్ లాంటి ఆధునిక దర్శకుల మేకింగ్ స్టైల్‌ను వర్మ అనుకరించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆదిత్య ధర్ సినిమాల్లో ఉండే హై-ఎండ్ యాక్షన్ సౌండ్ డిజైనింగ్ ‘సిండికేట్’లో కనిపిస్తుందా కూడా ఉంటుందన్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి సీనియర్ దర్శకుడు, తనకంటే జూనియర్ అయిన దర్శకుడిని గురువుగా స్వీకరించడం ఆయనలోని ‘నేర్చుకునే తత్వాన్ని సూచిస్తుంది. ‘సిండికేట్’ చిత్రంతో వర్మ టాలీవుడ్ బాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో వేచి చూడాలి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×