E-Paper
Advertisement

Psychological Thriller OTT : జర్నలిస్ట్ కు చుక్కలు చూపించే సీరియల్ కిల్లర్‌… ఊహించని మలుపులతో టాప్ లేపుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

Psychological Thriller OTT : జర్నలిస్ట్ కు చుక్కలు చూపించే సీరియల్ కిల్లర్‌… ఊహించని మలుపులతో టాప్ లేపుతున్న సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller OTT : గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఒక కొరియన్ మూవీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే నటీనటుల పెర్ఫార్మెన్స్ కారణంగా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ కథలో ఒక జర్నలిస్ట్, జైలులో ఉన్న ఒక సీరియల్ కిల్లర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఆ తరువాత కథ ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే 

ఈ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మర్డరర్ రిపోర్ట్’ (Murderer Report). చో యంగ్-జున్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ నటి జో యో-జియాంగ్ రిపోర్టర్‌గా, జంగ్ సుంగ్-ఇల్ కిల్లర్‌గా నటించారు. ఇది 2025 సెప్టెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా JioHotstar, Apple TV లలో అందుబాటులో ఉంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక పేరున్న లేడీ రిపోర్టర్ ఉంటుంది. తన రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఏదైనా సెన్సేషనల్ న్యూస్ కావాలని తెగ వెతుకుతుంటుంది. ఆ టైమ్‌లో జైల్లో ఉన్న ఒక భయంకరమైన సైకో కిల్లర్ ఈమెకు తగులుతాడు. అతను వరుసగా 11 మందిని చంపిన కిరాతకుడు. నేను చేసిన హత్యల గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ నీకు చెప్తాను, వచ్చి నన్ను ఇంటర్వ్యూ చెయ్ అని ఆ కిల్లర్ ఆఫర్ ఇస్తాడు. దాంతో ఆ రిపోర్టర్ పెద్ద స్కూప్ దొరికిందని ఆశపడి వాడి దగ్గరికి వెళ్తుంది. ఇక జైల్లో ఆ కిల్లర్ రిపోర్టర్‌తో అసలు ఆట మొదలుపెడతాడు. వాడు చంపిన విధానం గురించి చెప్తూనే, మెల్లగా ఆ రిపోర్టర్ పర్సనల్ లైఫ్ లోకి దూరి ఆమెను మానసికంగా టార్చర్ పెడతాడు. అతను చెప్పే మాటలు వింటుంటే ఆమెకు మైండ్ బ్లాక్ అయిపోతుంది.

నిజానికి వాడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడా లేక ఆమెతో ఏదైనా డేంజర్ గేమ్ ఆడుతున్నాడా అన్నది అర్థం కాక ఆ రిపోర్టర్ పిచ్చెక్కిపోతుంది. చివరికి ఆ కిల్లర్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు? కావాలనే ఈ రిపోర్టర్‌ను ఎందుకు పిలిపించుకున్నాడు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్. జైలు గదిలో ఇద్దరి మధ్య జరిగే మాటల యుద్ధం, ఆ కిల్లర్ ఇచ్చే షాకింగ్ ట్విస్టులు సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు మాత్రం ఎవరూ ఊహించలేనట్లుగా ఉంటుంది.

Advertisement

Read Also : మాఫియా లీడర్ గా మారే గూఢచారి… వెంట పడే డిటెక్టివ్… కేక పెట్టిస్తున్న కొరియన్ థ్రిల్లర్

Tags

Related News

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×