Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో ఈయన ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. అనతి కాలంలోనే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన నటించిన త్రిబుల్ ఆర్ మూవీ ఆస్కార్ లెవెల్ కు వెళ్లడంతో రామ్ చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆరెంజ్ లోనే పెరిగింది.. ప్రస్తుతం ప్లాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.. తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. రామ్ చరణ్ కి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందట.. మరి ఆ హ్యాబిట్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.. అందులో ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.. అందులో భాగంగా ఆయన తనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ గురించి బయట పెట్టాడు. అదేంటంటే.. ఆయనకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అన్న విషయాన్ని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నాడు.. దాన్ని ఎంతగా మార్చుకోవాలని ప్రయత్నించిన సరే అది మాత్రం అతన్ని వదిలిపోలేదు అని ఫన్నీగా సమాధానం చెప్పాడు.. చిన్న చిన్న విషయాల్లో మతిమరుపు ఉంటుందట. గుర్తుపెట్టుకోవాలని ఎంతగా ప్రయత్నాలు చేసిన సరే దాన్ని మర్చిపోతూనే ఉన్నాడట.. స్కూల్లో పెన్నులు, పెన్సిల్లు మర్చిపోయేవాడట. అలాగే ఇప్పుడు సినిమా షూటింగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పేర్లు చెప్పినా కూడా వాటిని మర్చిపోతూ ఉంటాను అని రామ్ చరణ్ అంటున్నాడు. చిన్నప్పటినుంచి ఈ హ్యాబిట్ ని ఎంతగా మార్చుకోవాలని ప్రయత్నించినా కూడా కుదరడం లేదు ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తున్నాను అని రామ్ చరణ్ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..
Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్క సీరియల్ కు శుభం కార్డు..?
త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఆయనకు విదేశాల్లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమధ్య చెర్రీ పాన్ ఇండియా చిత్రాలను మాత్రమే చేస్తూ వస్తున్నాడు. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు.. ఇప్పుడు కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని పెద్ది మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్నాయి మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి మే 7 న రాబోతుంది.. నిజానికి ఏప్రిల్ 30న ఈ మూవీ థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే ఇంకా షూటింగు పెండింగ్ ఉండడంతో పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడడంతో మెగా అభిమానులు డైరెక్టర్ బుచ్చిబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..