E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును అవమానించిన రేఖ  

Brahmamudi Serial Today march 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును అవమానించిన రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode: ఆ ముసలోడిని కాస్త ఇబ్బంది పెట్టేసరికి మనవరాలిలో కలిసి ఆవిడగారు మన మీద పగ తీర్చుకుంటున్నారు అని ఇందూపై లేనిపోనివి చెబుతుంది భ్రమరాంబ. పగ తీర్చుకునేంత ధైర్యం ఉందంటావా వదిన అంటూ రేఖ అనగానే.. భూషన్‌ మాత్రం ఒకవేళ ఉన్నా దానిని మనసులోనే చంపేయడానికి వాళ్ల ముందు నువ్వు ఉన్నావుగా అంటాడు.. ఇంతలో రేఖ కనీసం సాంబారు అయినా కరెక్టుగా చేశావా..? అని కోపంగా అడగ్గానే.. చేశాను ఆంటీ అంటూ ఇందు చెప్పగానే.. అయితే వడ్డించు అని రేఖ చెప్పగానే.. సాంబారు తీసుకుని రేఖకు వడ్డించబోతుంటే భ్రమరాంబ కాలు అడ్డం పెడుతుంది. దీంతో ఇందు వెళ్లి రేఖ మీద పడుతుంది. సాంబారు రేఖ మీద పోతుంది. భ్రమరాంబ కోపంగా తిడుతుంది.

దీంతో ఇందు భ్రమరాంబను చూస్తుంటే.. ఏంటి అలా చూస్తున్నావు.. వెళ్లి క్లాత్‌ తీసుకొచ్చి క్లీన్ చేయ్‌ అని చెప్తుంది ఇందు క్లాత్‌ తీసుకురావడానికి వెళ్తుంటే.. అపర్ణ నేను చేస్తాను ఉండు ఇందు అనగానే.. రేఖ కోపంగా ఏయ్‌ ఏవరికి చెప్పిన పనులు వాళ్లే చేయాలి. అంటూ కోపంగా చూడగానే.. ఇందు వెళ్లి క్లాత్‌ తీసుకొచ్చి క్లీన్‌ చేస్తుంటే.. రేఖ తన కాలును ఇందుకు తగిలేలా చేస్తుంది. అది చూసిన అపర్ణ కోపంతో రగిలిపోతుంది. క్లీన్‌ చేసేది అయిపోయాక అపర్ణ, ఇందు వెళ్లిపోతారు. దీంతో భ్రమరాంబ ఏమో అనుకున్నాను కానీ నువ్వు పెట్టిన భయం బాగానే పని చేస్తుంది అంటుంది. పని చేయాలి వదిన లేకపోతే ప్రాణం పోతుంది కదా అంటుంది రేఖ.

Advertisement

మరోవైపు వెంకట్‌ కోపంగా నందు షాపు దగ్గరకు వెళ్లి నీ వల్లే నా గర్ల ఫ్రెండ్‌ నాకు దూరం అయింది అంటూ తిడుతుంటే.. నందు కోపంగా మిస్టర్‌ మజ్ను ముందు నీ వల్లే నీ వల్లే అనడం ఆపి అసలు నీ గర్ల్‌ ప్రెండ్‌ పబ్బుకు వచ్చిందా చెప్పు అనగానే.. వచ్చిందండి అంటాడు వెంకట్‌.. దీంతో నందు వచ్చిందని నీకు ఎవరు చెప్పారు.. అని అడగ్గానే.. వెంకట్‌ మా అన్నయ్య ఫ్రెండ్‌ చెప్పాడు అనగానే.. ఏం చెప్పాడు అనగనే.. వెంకట్‌ తనకు లక్కీ ఫోన్‌ చేసి విషయాలు మొత్తం చెప్తాడు.  అంతా విన్న నందు ఇందులో వాళ్ల వాడకం తప్పా నీ లవ్వు నీ గర్ల్‌ఫ్రెండ్‌ ఏక్కడ ఉంది..? అనగానే.. వచ్చిందని మా అన్నయ్య ఫ్రెండ్‌ చెప్పాడు కదా అనగానే.. నువ్వు మిస్టర్‌ మజ్ను కాదు మిస్టర్‌ వెంగలప్పవి అంటుంది నందు. దీంతో అదేంటండి అలా అనేశారు అంటాడు వెంకట్‌ దీంతో నందు కోపంగా లేకపోతే ఏంటి.? మీ అన్నయ్య నిన్ను అమాయకుడిని చేసి పబ్బుకు పిలిచి అమాయకుడిని చేశాడు. అది నీ లవ్  స్టోరీ కాదు మీ అన్నయ్యలు ఇద్దరు కలిసి నిన్ను కమెడియన్‌ ను చేసిన స్టోరీ.. అనగానే.. వెంకట్‌ కోపంగా నందును తిడుతూ రాజు, లక్కీలను వెనకేసుకొస్తాడు. దీంతో నందు కూడా వెంకట్‌ ను తిడుతుంది.

మరోవైపు స్వాతి ఇందు దగ్గరకు వెళ్లి నిన్ను అలా అవమానిస్తుంటే నేనే తట్టుకోలేకపోయాను అక్క కానీ నువ్వు మాత్రం అసలు ఏమీ జరగనట్టు అలా ఎలా ఉండగలిగావు అని అడగ్గానే.. ఇందు కూల్‌గా ఈరోజు కొత్తగా ఏం జరిగింది స్వాతి నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నదే కదా ఇది అని చెప్పగానే.. స్వాతి నిజం చెప్పు అక్కా రేఖ ఆంటీ అంతలా అవమానిస్తుంటే నీకు బాధ కలగలేదా..? కోపం రాలేదా..? అని అడగ్గానే.. ఇందు నాకు ఊహ తెలిసి తెలియని వయసులో బాగా కోపం వచ్చేది. కానీ పరిస్థితులు అర్థం చేసుకున్నాక బాధపడినా కోప్పడినా లాభం లేదనుకుని మౌనగా ఉండిపోతున్నాను అని చెప్పగానే.. స్వాతి కోపంగా కానీ ఇందంతా చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నాను అక్కా ఆ రేఖ ఆంటీని ఏదో ఒకటి చేయాలని ఉంది అంటుంది.. దీంతో నాకు సాయం చేస్తున్నావు కదా స్వాతి ఇంకేం చేయకు నీకు ప్రమాదం అని ఇందు చెప్తుండగానే.. తనకు ఏదో కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని మెసేజ్‌ వస్తుంది. ఇందు హ్యాపీగా ఆ విషయం స్వాతికి చెప్తుంది.

Advertisement

మరోవైపు రాజు తెల్లారినా కూడా పడుకుని కలలు కంటుంటే.. వాళ్ల నాన్న వచ్చి తిట్టి నిద్రలేపుతాడు. అప్పుడే లక్ష్మీ వచ్చి రాజును సమర్థించి వాళ్ల ఆయనను తిడుతుంది. ఇంకోవైపు ఇంటర్వ్యూకు వెళ్తున్న  ఇందును హాల్లోనే కూర్చున్న రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ చూస్తుంటారు. ఇందు వెళ్లిపోయకా భ్రమరాంబ అనుమానంగా రేఖ ఆ ఇందును చూస్తుంటే నీకు ఏమీ అనిపించడం లేదా…? అని అడుగుతుంది. నీకేం అడుగుతుందో చెప్పు వదిన అంటుంది రేఖ. దీంతో షాపింగ్‌కు వెళ్లిన వాళ్లు ఉత్సాహంగా  వెళ్లడం చూశాను కానీ ఇది వంట పని చేయడానికి వెళ్లుంది కానీ ఇంత ఉత్సాహంగా వెళ్తుందేంటి..? అని అడగ్గానే.. తాను రోజు శివరాం గారికి ఫోన్‌ చేసి కనుక్కుంటున్నానని రేఖ చెప్పి వెళ్లిపోతుంది. ఇంకోవైపు రాకేష్‌ ఫోన్‌ చేసి ఐశ్వర్యను డబ్బులు అడుగుతాడు. ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే తానే ఇంటికి వస్తానని బెదిరిస్తాడు. దీంతో ఐశ్వర్య బాధపడతుంది. రేఖ చేయించిన నెక్లెస్‌ అమ్మేయాలనుకుంటుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Big Stories

Advertisement
×