Ram Gopal Varma : ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియాలోనే సంచలమైన దర్శకుడిగా పేరు సాధించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వర్మ ఆ తర్వాత కాలంలో మంచి కాన్సెప్ట్ సినిమాలు తీశాడు. ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు గురించి ఎంత ప్రస్తావించకపోతే అంత మంచిది.
ఇప్పుడు రాము చేస్తున్న సినిమాల ప్రస్తావన వస్తే ఏది ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి. రాంగోపాల్ వర్మ సినిమాలను చాలామంది పూర్తిస్థాయిలో పట్టించుకోవడం మానేశారు. రీసెంట్ గా తాను దర్శకుడుగా పరిచయమైన శివ మళ్ళీ రీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు కొంతమేరకు బాగానే సపోర్ట్ లభించింది. అయితే మళ్లీ మంచి సినిమా తీస్తాను అని కొన్ని సంవత్సరాల నుంచి రాంగోపాల్ వర్మ చెబుతూనే ఉన్నాడు. అది జరుగుతుందని నమ్మకం చాలా మందికి లేదు.
శివ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి శివ సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. అయితే ఆ వీడియో ట్వీట్ చూసిన వెంటనే రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, చిరంజీవికి క్షమాపణలు చెప్పాడు.
ఇక తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ ఒక మోస్ట్ స్టైలిష్ పొలిటిషన్ అంటూ కితాబిచ్చారు. గతంలో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ కి క్లారిటీ లేదు. ఏం చేస్తున్నారు తెలియదు అనే విధంగా నెగిటివ్ కామెంట్స్ చేసేవాడు. ఇప్పుడు మాత్రం సడన్ గా స్టైలిష్ పొలిటిషన్ అంటూ పొగడడం మొదలుపెట్టాడు.
వర్మ చేస్తున్న కొన్ని పనులు చూస్తుంటే టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ పోసాని కృష్ణ మురళి చెప్పినట్లు మీరు మారిపోయారు సార్ అనాలి అనిపిస్తుంది కొంతమందికి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా రాంగోపాల్ వర్మ ఒక మంచి సినిమా చేస్తాను అని ప్రామిస్ చేశాడు.
అయితే రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా ఇలాంటి ప్రామిస్ లు చాలా చేశాడు. కానీ అవి జరుగుతాయని నమ్మకం పెద్దగా ఎవరికి లేకుండా పోయింది. రాంగోపాల్ వర్మ సినిమాల కంటే కూడా అతను వేసే ట్వీట్స్, అలానే ఇచ్చే కొన్ని ఇంటర్వ్యూ లు బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి.
Also Read: Telusu Kada : దొంగలించిన కథకు 50 కోట్లు పెట్టుబడి, రచయిత జీవితం నాశనం, తెలుసు కదా వెనుక అసలు కథ