Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ప్రస్తుతం సినిమాలపై రివ్యూ లిస్తూ వస్తున్నాడు.. టాలీవుడ్ సినిమాల పై మాత్రమే కాదు.. బాలీవుడ్ సినిమాలపై కూడా ఆర్జీవి కామెంట్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు.. తాజాగా ఆయన రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. వర్మ బాలీవుడ్ సినిమాలపై ఆ పోస్టులో ఏం రాశాడో ఒకసారి తెలుసుకుందాం..
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం దురంధర్.. తాజాగా ఈ సినిమాని చూసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు తనదైన స్టైల్ లో రివ్యూ ఇస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పోస్టులో ఏం రాసాడంటే..
ధూరందర్ చిత్రం నుండి కొందరు నిర్మాతలు నేర్చుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి…
1. ఇతర పాన్-ఇండియా పెద్ద సినిమాల మాదిరిగా కాకుండా, ఈ చిత్రం హీరోను ఉన్నతంగా చూపించడానికి లేదా స్లో మోషన్ లేదా చెవులు చిల్లులు పడే మ్యూజిక్ ను పెట్టి ప్రేక్షకులను బలవంతంగా అతన్ని ఆరాధించేలా చేయడానికి ప్రయత్నించదు. ప్రేక్షకులు బలవంతంగా చూసే సినిమా కాదు ఇది..
2.ఎదో చెయ్యాలని కాకుండా ఏది చూపించాలో అది చక్కగా చూపించారు. సినిమాపై రణవీర్‌కు ఉన్న అవగాహనకు నిదర్శనం.
చాలా సినిమాలు వివరించే విధానానికి భిన్నంగా, ధురంధర్ సినిమాను చూపించారు..
3. ఇది హింసను కేవలం ఒక దృశ్యంగా కాకుండా.. ఒక మానసిక స్థితిగా చూపిస్తుంది. యాక్షన్ సీన్లను డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించాడు. అతను చప్పట్లు కొట్టించే సన్నివేశాల గురించి పట్టించుకోకుండా, ప్రతి హింసాత్మక సన్నివేశంలో పాత్రలను, అలాగే వారి ప్రస్తుత మనఃస్థితిని మిళితం చేశాడు. ఈ సినిమాలో గులాబ్ చేసిన యాక్షన్ అత్యుత్తమమైనది. హాలీవుడ్ సినిమాకి మించిన యాక్షన్ ఇందులో ఉంది అని రాశారు. ఇకపోతే దక్షిణాది పాన్-ఇండియా యాక్షన్ డైరెక్టర్లు ఐజాజ్ గులాబ్ నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. డైరెక్టర్లకు ఈ సినిమా ఖచ్చితంగా మార్గదర్శకం అవుతుంది.
5. ఇది ప్రేక్షకుల తెలివితేటలను నిస్సందేహంగా విశ్వసిస్తుంది.. భావోద్వేగ సన్నివేశాలు ఇందులో లేవు.. ఈ సినిమా ప్రతి ఒక్క సీన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..
6. ఈ సినిమా అంతా చాలా స్లోగా అలా వెళ్ళిపోతుంది.. బ్యాక్ గ్రౌండ్ నాయిస్ కానీ ఇంకా ఎటువంటి డిస్టబెన్స్ కానీ ఇందులో లేవు. ఇదొక సైకలాజికల్ సినిమా..
7. ఇది రాజకీయ థ్రిల్లర్, పాత్ర అధ్యయనం, విసెరల్ యాక్షన్ చిత్రం. నైతిక విషాదం యొక్క మిశ్రమాన్ని మిళితం చేస్తుంది. ఇది శైలి విధేయతను నిరాకరిస్తుంది.
8.ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భయపడేలా ఉండదు. సౌండ్ ట్రాక్ ఎక్కడ మిస్ అవ్వకుండా బాగుంది. మ్యూజిక్ సినిమాకు హైలెట్..
9. ధురంధర్ సినిమాను ఒక ఫైట్ గా మాత్రమే చూస్తారు.. మిమ్మల్ని మూడున్నర గంటలు ఉంచాలని చూడలేదు.. ఒకదానికి మరొకటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..
హే ఆదిత్య భారతీయ సినిమాను చివరకు రెస్పాన్స్ ను అందుకొనేలా చేశావు.. మనందరికీ గత, వర్తమాన, అలాగే భవిష్యత్తు చిత్రనిర్మాతలు మరోసారి మీ మార్గంలో నడిచేలా ఈ సినిమాతో చేశావు. ధురందర్ విజయం మరొక బ్లాక్‌బస్టర్ కాదు, ఇది చిత్ర పరిశ్రమ ఎదగడానికి ఒక హెచ్చరిక… అంటూ ఆ ట్వీట్ లో రాసుకోవచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.
Also Read :తమ్ముళ్ల కోసం పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న మాధవ్.. కన్నీళ్లు పెట్టుకున్న మహా.. చక్రి లైన్ క్లియర్..
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం సైలెంట్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఈమధ్య బాలీవుడ్ లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి.. ఇప్పుడు బాలీవుడ్ దూరందరు మూవీ పై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ట్వీట్ ని చూసిన నెటిజన్లు బాలీవుడ్ లో మళ్లీ సినిమాలు తీసి బిజీ అవ్వాలని వర్మ ట్రై చేస్తున్నట్లు ఉన్నాడు. కచ్చితంగా బాలీవుడ్ నిర్మాతలు వర్మకి ఛాన్స్ ఇస్తారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి…
Here are some unique lessons that all the so called film makers can learn from Dhurandhar
1.Unlike the other so called pan india big films , the film doesn’t even try to elevate the hero and give him the so called elevation moments to make the audience forcefully worship him…
— Ram Gopal Varma (@RGVzoomin) December 19, 2025