Podarillu Today Episode December 19th: గాయత్రి రాత్రి ఇంటికి వస్తుంది. ఏంటి నువ్వు ఇంటికి వచ్చేసావు మీ అమ్మ చూస్తే ఏమంటుంది అని చక్రి అడుగుతాడు. మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో నాకేం తెలుసు అని గాయత్రి అంటుంది. నువ్వు మీ అమ్మతో చెప్పి పెళ్లికి ఒప్పించొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది. మా అమ్మ సంగతి తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావా అని గాయత్రి అంటుంది. ఇంకేం చేయాలి మరి ? మీ అన్న ఇప్పట్లో పెళ్లి చేసుకునేలాగా కనిపించట్లేదు అని గాయత్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఇక పెళ్లి వాళ్లకి సంబంధం ఓకే అయింది ఎలాగైనా సరే ఒప్పించేస్తే బాగుంటుంది అని అనుకుంటారు.. భూషణ్ ఇండియాలో డ్రైవర్ల గురించి దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు నేను చూశారు కదా వాడు ఎలా మాట్లాడాడో అని అంటూ ఉంటాడు. మీకు డ్రైవర్ కావాలని చెప్పారట ఏజెన్సీ వాళ్ళు నన్ను పంపించారు అని అంటాడు చక్రి.. తనకి ఏదో ఒకటి చెప్పేసి చక్రి ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు. మాధవ్ ఇంటికి పెళ్లి సంబంధానికి అని పెళ్లి వాళ్ళు వస్తారు. అక్కడ జరిగింది చూసి గాయత్రి బాధపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచితే బాగుంటుంది అని అనుకుంటారు.. కేశవ వెళ్లి కుర్చీలను పట్టుకుని వస్తాడు.. అంత సిద్ధం చేయగానే పెళ్లి వాళ్ళు ఇంట్లోకి వస్తారు.. ఇంటిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత నారాయణ చెప్పింది విని కాస్త కన్విన్స్ అవుతారు. మాధవ్ మాత్రం అంత నిజమే చెప్పాలి అని అనుకుంటారు. పెళ్లి వాళ్ళని చూసినా గాయత్రి పెళ్లి ఓకే అయిపోతుంది ఏమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కన్నా గాయత్రి తో మాట్లాడతాడు.. సెలెక్ట్ చేసుకోవడానికి గాయత్రి బాధపడి అతనికి వెళ్ళిపోతుంది.. అయితే కన్నా మాత్రం ఏంటి ఇది ఇలా వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు..
గదిలోకి వెళ్లి పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది.. ఆ జుట్టు పోలిగాడు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడో వింటున్నావా అని హారికపై మహా సీరియస్ అవుతూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.. మహా కొంచెం కూలవు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావ్ అని హారిక ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం తిడుతూనే ఉంటుంది.. నువ్వు ఇలా చేస్తే ఏమవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు అని హారిక నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళాలి అక్కడ అతను ఎలా ఉంటాడో చూద్దాంలే కానీ నువ్వు కానీ అనేసి అంటుంది.. అప్పుడే అక్కడికి ఆది వస్తాడు..
నిన్ను ఇప్పుడు చంపేస్తాను అని మహా అంటుంది.. వాడు నన్ను ఎన్ని మాటలు అంటున్నారో చూసావా.. ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళనీయరు. డ్రైవింగ్ నేర్చుకుంటానంటే అది వద్దంటారు. ఆఖరికి నేను పాస్పోర్ట్ కి అప్లై చేస్తాను అన్న కూడా వద్దని అన్నారు ఇవన్నీ మీ వల్లే కదా వాడిప్పుడు నన్ను అంటున్నాడు అంటే ఇప్పుడు నేనే కదా పడాల్సింది అని మహా తెగ ఫీల్ అయిపోతుంది.. అంతే కాదు.. మహా మీరు ఎందుకురా నన్ను ఇంత గారాబంగా పెంచారు వాడిలా నన్ను అంటుంటే తట్టుకోలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. వాడు ఏమంటున్న సరే నువ్వు మౌనంగా ఉన్నావు అని హారిక కూడా అనడంతో నువ్వెందుకు మహాకే సపోర్ట్ చేస్తున్నావు అని అంటాడు.
ఎందుకంటే ఒక ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకే తెలుస్తుంది.. నువ్వు ఇలా చేయడం ఏమీ బాగోలేదు అని మహా అంటుంది.. పెళ్లి నాకు అస్సలు వద్దురా అని ఎంత చెప్తున్నా సరే ఆది మాత్రం నేను దీని గురించి నాన్నతో ఒకసారి మాట్లాడతాను. ఆ అబ్బాయి కూడా నేను చెప్తాను ఇలా మాట్లాడొద్దని అంటాడు. షాపింగ్ కి టైం అవుతుందని వాళ్ళు అంటున్నారు నువ్వు వెంటనే మొహం తీసుకుని కిందకు రా అనేసి అంటాడు. హారిక ఇప్పుడు షాపింగ్ కి వెళ్తున్నాం కదా అక్కడ భూషణ్ ప్రవర్తన ఎలా ఉంటుందో చూసి అప్పుడు మాట్లాడదామని అంటుంది.. మాధవ్ ఇదంతా మా స్థలం అని అంటాడు… అయితే ఆ పెళ్లి వాళ్ళు ఇండ్లు స్థలాల గురించి ఏముందిలే నువ్వు మంచి వాడివి కాదా అని మాట్లాడుతున్నాము అని అంటారు.
ఇంతమంది ఉన్న ఇంట్లోకి ఒక అమ్మాయిని పంపించాలంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా.. నేను కూడా ఆలోచిస్తున్నాను అని అంటారు. మీరు మంచివాళ్ళు కాబట్టి మీ తమ్ముళ్ళందరికీ మా అమ్మ ఒక్కటే చేసి పెట్టాలని నేను అనుకోవడం లేదు. వెంటనే మీరు వేరే కాపురం పెట్టి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నామని పిల్ల తండ్రి అంటాడు. అ మాట వినగానే మాధవ్ మా ఇంట్లో మా అమ్మ లేదు ఇప్పుడు కూడా నేను లేకపోతే మా తమ్ముళ్లు ఏమైపోతారు అని బాధపడతాడు. మా తమ్ముడు కన్నా ని చూడకుండా నేను అస్సలు ఉండలేను. మీ అమ్మాయి మంచిగా ఉండాలని మీరు కోరుకోవడంలో తప్పులేదు.. నేను ఇంతకుమించి ఏమి చెప్పలేను మీరు ఈ సంబంధాన్ని వదిలేసుకొని వేరే సంబంధం చేసుకోండి అని అంటారు.
Also Read :నర్మదను ఇరికించిన శ్రీవల్లి..పెళ్లి చేసుకోబోతున్న విశ్వ.. ప్రేమ కాపురంలో చిచ్చు…
ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి తల్లి ఆ ఊరిలో విచారిస్తూ ఉంటారు. మాధవ్ ఎలాంటి వాడు అని అడుగుతారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా చెప్పిన సరే వాళ్ళ పెద్దనాన్న మాత్రం మాధవ గురించి లేనిపోనివి చెప్పి ఆ పెళ్లి సంబంధం చెడిపోయేలా చేస్తాడు. అది విన్న కేశవ మాధవ్ మీరు మీ అమ్మాయికి వేరే సంబంధం చేసుకోండి అంతేకానీ మా గురించి మాత్రం ఆలోచించకండి అని అంటారు. మహా చీరల షాప్ కి వెళ్ళిన తర్వాత అయిష్టంగానే ఉంటుంది.. ఎలాగైనా సరే వీళ్ళతో పట్టి నేను షాప్ లోకి వెళ్లి పోవాలని చక్రి కూడా అనుకుంటాడు. మహా ఏ చీర తీసుకున్న అది బాగోలేదని చెప్తూ ఉంటాడు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది నువ్వే చూడు వదినా అని మహా పక్కకు వెళ్ళిపోతుంది.. చక్రి వీళ్లు నన్ను ఏమనకుండా ఇక్కడే ఉండాలంటే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉండాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…