E-Paper
Advertisement

Missterious Movie Review : ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ

Missterious Movie Review : ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ
Advertisement

Missterious Movie Review : ఇటీవల కాలంలో పాజిటివ్ వైబ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘మిస్టీరియస్’. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం రావడంతో సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ

కొండపూర్ ఎస్ఐ రాంఖీ / రామ్ కుమార్ (అబిద్ భూషణ్) సడన్ గా అదృశ్యం అవుతాడు. ఆ మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ACP ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) ఎంట్రీ ఇస్తాడు. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని), ఆయన భార్య శిల్ప (మేఘన రాజ్‌పుత్)ను విచారిస్తారు. రాంఖీ ఎలా మిస్ అయ్యాడు? ఆ కేసుకు విరాట్ – శిల్పలకు లింకు ఏంటి? విరాట్ కొన్న విల్లాలో రాంఖీ ఏం చేస్తున్నాడు ? విరాట్ భార్యకు ఈ కేసుతో ఏంటి సంబంధం? అనేది తెలియాలంటే మూవీని థియేటర్లలో చూడాల్సిందే.

విశ్లేషణ

Advertisement

‘మిస్టీరియస్’ కథ కొత్తదేం కాదు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ వంటి కథకు కొన్ని ట్విస్ట్‌లు యాడ్ చేసి సస్పెస్స్, థ్రిల్లర్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ మూవీని తెరకెక్కించారు. మూవీ స్టార్ట్ కాగానే డైరెక్టర్ మెయిన్ ప్లాట్‌కి తీసుకెళ్ళాడు. అలా పాత్రల పరిచయం అయ్యిందో లేదో రేసీ స్టోరీ రన్ తో ట్విస్టులు కూడా వచ్చేస్తాయి. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరు ? అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేసి, ఆడియన్స్ ను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్, సెకండాఫ్‌లో హర్రర్ ఎలిమెంట్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్ సినిమాకు హైలెట్. కానీ సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అన్పిస్తుంది. అలాగే అక్కడక్కడా కొన్ని సీన్స్ ను ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

అయితే నటీనటులు పెద్దగా పరిచయం ఉన్న ముఖాలు కాకపోవడం సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. ML రాజా ఇచ్చిన మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫర్‌ గా పరవస్తు దేవేంద్ర సూరి వర్క్ బాగుంది. కానీ ఎడిటర్ గా సూరి తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగున్నాయి.

Advertisement

మెయిన్ లీడ్‌ గా కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ నటన పరంగా బాగా చేశారు. సీనియర్ పోలీస్‌ గా బలరాజ్ వాడి రోల్ బాగుంది. జబర్దస్త్ ఫేం రాజమౌళి, గడ్డం నవీన్‌ వంటివారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ 

డిఫరెంట్ స్టోరీ
కొన్ని ట్విస్ట్‌లు
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ 

స్లోగా సాగడం
స్టార్ కాస్ట్ లేకపోవడం

మొత్తంగా…

‘మిస్టీరియస్’ మూవీ మిస్ చేయకుండా ఓ సారి చూడాల్సిన మూవీ.

Missterious Movie Rating – 2.5 / 5

Related News

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

Big Stories

Advertisement
×