E-Paper
Advertisement

Dhurandhar 2: ‘ధురంధర్ 2’పై ఆర్జీవీ రివ్యూ చూస్తే మతిపోతుంది.. మరో రికార్డు ఖాయమేనా?

Dhurandhar 2: ‘ధురంధర్ 2’పై ఆర్జీవీ రివ్యూ చూస్తే మతిపోతుంది.. మరో రికార్డు ఖాయమేనా?
Advertisement

Dhurandhar 2: భారతీయ సినీ పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. నిశితమైన విశ్లేషణ, ఎవరూ ఊహించని పోలికలతో సోషల్ మీడియాను షేక్ చేయడం ఆయన నైజం. తాజాగా ఆయన ‘ధురంధర్ 2’ సినిమాను వీక్షించిన అనంతరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఈ సినిమా కలిగించిన ఇంపాక్ట్ గురించి ఆయన చెబుతూ, ఇది కేవలం ఒక సినిమా కాదు, భారతీయ సినిమా చరిత్రను ‘ఖతం’ చేసి సరికొత్త సామ్రాజ్యాన్ని స్థాపించే ఒక ‘సినిమాటిక్ ఆర్డర్’ అని అభివర్ణించారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. గ్రాండ్ గా ఫంక్షన్.. మనోజ్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్..

షోలే కంటే 100 రెట్లు పవర్ ఫుల్!

Advertisement

ఆర్జీవీ విశ్లేషణ ప్రకారం.. మనం ఇప్పటివరకు ‘షోలే’ (Sholay) చిత్రాన్ని ఒక బెంచ్ మార్క్ లా చూశాం. కానీ ‘ధురంధర్ 2’ కలిగించే ఆడియో విజువల్ ఇంపాక్ట్, సైకలాజికల్ ఎఫెక్ట్ షోలే కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. వసూళ్ల పరంగానే కాకుండా, ప్రేక్షకులు పొందే పారవశ్యం, సామాజికంగా ఈ సినిమా చూపే ప్రభావం అసాధారణమని వర్మ పేర్కొన్నారు. సినిమా వ్యాకరణాన్ని ముక్కలు ముక్కలు చేసి, సరికొత్త పద్ధతిలో కథను చెప్పడంలో ఈ చిత్రం సఫలమైందని ఆయన కొనియాడారు.

క్లాసిక్ సినిమాలు ఇక టీవీ సీరియల్స్!

వర్మ తనదైన శైలిలో విమర్శిస్తూ.. “ముఘల్-ఎ-అజం (Mughal-e-Azam) వంటి గొప్ప చిత్రాల నుండి నిన్నటి వరకు వచ్చిన క్లాసిక్ సినిమాలన్నీ ‘ధురంధర్ 2’ ముందు కేవలం టీవీ సీరియల్స్ లా కనిపిస్తాయి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత ప్రపంచపు సినిమా పద్ధతులను ఈ చిత్రం పూర్తిగా ఖననం చేసిందని, ఇది ఒక కొత్త సినిమా శకానికి ‘బర్త్’ (Birth) అని ఆయన స్పష్టం చేశారు. సినిమా మేకింగ్ లో గతంలో ఉన్న ప్రమాణాలన్నీ ఈ చిత్రం ముందు చిన్నబోతాయని వర్మ అభిప్రాయపడ్డారు.

Advertisement

Read also-Brahmamudi Serial Today march 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, స్వాతిలను కొట్టిన ఐశ్వర్య

స్పీల్‌బర్గ్, నోలన్ కూడా చూడాల్సిందే!

దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరుపై వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఇకపై ‘DIRECTOR’ అనే పదానికి స్పెల్లింగ్ ఆదిత్య ధర్ పేరుతోనే మొదలవుతుందని, ఆయన విజన్ అంతర్జాతీయ స్థాయిని దాటిపోయిందని అన్నారు. ఎంతలా అంటే, హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ లు కూడా తాము చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి, ‘ధురంధర్ 2’ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని, అది వారికి అత్యంత అవసరమని ఆర్జీవీ సూచించారు. మొత్తానికి, వర్మ చేసిన ఈ కామెంట్స్ ‘ధురంధర్ 2’ పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. పాత తరం సినిమాల పని అయిపోయిందని, ఇకపై అంతా నూతన ప్రపంచపు సినిమా రాజ్యమేనని వర్మ తన విశ్లేషణతో తేల్చేశారు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×