E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, స్వాతిలను కొట్టిన ఐశ్వర్య

Brahmamudi Serial Today march 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, స్వాతిలను కొట్టిన ఐశ్వర్య
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు, స్వాతి రూంలోకి వెళ్లి నవ్వుకుంటారు.. ఇందు అయితే పుల్లుగా నవ్వుకుంటూ.. వామ్మో ఏమైనా ఫర్మామెన్సా స్వాతి నీది దొరికిపోయాము అనే సిచ్యువేషన్‌ నుంచి  పూర్తగా మార్చేశావుగా అని చెప్పగానే.. ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు అక్కా అందుకే అలా కొంచెం ఓవర్‌ యాక్టింగ్‌ చేశాను.. కానీ లోపల మాత్రం ఎక్కడ దొరికిపోతామో అని భయంగా ఉన్నది అక్కా అని చెప్పగానే.. ఇందు ఆశ్చర్యంగా కానీ నీ ఫర్మామెన్స్‌ చూసి మీ అమ్మ కన్నీళ్లు కూడా పెట్టుకుంది అంత బాగా నమ్మించావు.. అని చెప్తుండగానే..

ఇందు అక్కా అది సరే కానీ ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైంది అది చెప్పలేదు ఏంటి…? అని అడగ్గానే.. ఆల్‌మోస్ట్‌ సెలెక్ట్‌ అయ్యేదాన్ని స్వాతి కానీ చివరలో ఆ వెధవ వచ్చి మొత్తం చెడగొట్టేశాడు అని చెప్పగానే.. ఇందు ఎవరతను అని అడుగుతుంది. దీంతో పబ్బులో జరిగిన గొడవ గురించి మొత్తం చెప్తుంది. దీంతో నీకున్న ఒక్క అవకాశం కూడా పోయింది అక్కా… ఇప్పుడెలా అని అడగ్గానే.. నీ లాప్‌టాప్‌ ఇస్తే అందులో జాబ్స్‌ సర్చ్‌ చేద్దాం.. అందులో చేద్దాం అని చెప్పగానే.. స్వాతి లాప్ టాప్‌ తీసుకొచ్చి జాబ్‌ సర్చ్‌ చేస్తారు.

Advertisement

మరోవైపు రాజు నిద్రపోతుంటే.. వాళ్ల నాన్న వచ్చి అరేయ్‌ బైక్‌ ఎక్కడ ఉందిరా అని నిద్రలేపుతాడు. కాసేపు పడుకోనివ్వు నాన్న అంటూ రాజు నిద్రలేస్తుంటాడు.. ఇంతలో లక్కీ వస్తాడు. అరేయ్‌ బైక్‌ ఏం చేశావు అని వాళ్ల నాన్న అడగ్గానే.. ఆ మాటలు విన్న లక్కీ అమ్మ బాబోయ్‌ రాంగ్‌ టైంలో వచ్చాను అనుకుంటా…? ఇప్పుడు కనక నా వల్లే బైక్‌ పోలీస్‌ స్టేసన్‌లో ఉందని తెలిస్తే గుమ్మడి కాయను గుమ్మానికి వేలాడదీసినట్టు నన్ను కూడా వేలాడదీస్తాడు ఇక్కడే ఉండటం బెటర్‌ అనుకుంటాడు.. వాళ్ల నాన్న మాత్రం కోపంగా నిన్నే అడిగేది బైక్‌ ఏం చేశావు.. తాకట్టు పెట్టేశావా..? లేక అమ్మేశావా..? ఏయ్‌ నిన్నేరా అడిగేది అంటూ కోప్పడుతుంటాడు..

దీంతో రాజు ఆ విషయం నన్ను కాదు అడిగేది నీ చిన్న కొడుకును అని చెప్పగానే.. బైక్‌ నీ దగ్గర ఉంటే వాడికి ఎలా తెలుసురా..? అని వాళ్ల నాన్న అడగ్గానే.. రాత్రి వాడే వాళ్ల ఫ్రెండ్ కు బైక్‌ అవసరం ఉంటే ఇప్పించాడు.. అని చెప్పగానే.. వాళ్ల నాన్న ఏరా వెంకీ వీడు చెప్పేది నిజమేనా..? బైక్‌ మీ ఫ్రెండ్‌కు ఇప్పించావా..? అని అడగ్గానే.. వెంకీ తడబడుతుంటే రాజు నాన్న అడుగున్నాడు కదరా చెప్పు.. రాత్రి నీ ఫ్రెండ్‌కు పనుందని బయటకు వెళ్లాలంటే పాపం అన్నయ్య నా ఫ్రెండ్‌కు బైక్‌ అవసరం అని చెప్పి బతిమిలాడి మరీ ఇప్పించావు కదా.. అని చెప్తుంటే దూరం నుంచి చూస్తున్న లక్కీ రాత్రి సెల్పీ తీసుకున్నాడు కదా ఇప్పుడు ఇరికించాడు అనుకుంటాడు..

Advertisement

మరోవైపు ఇందుకు ఒక కంపెనీ నుంచి ఫోన్‌ చేసి ఇంటర్వ్యూకు రమ్మని చెప్తారు దీంతో ఇందు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. వెనక నుంచి వచ్చి భుజం మీద అపర్ణ చేయి వేయగానే.. ఇందు బయపడతుంది. భయంగా తిరిగి చూస్తే అపర్ణ కనిపిస్తుంది. దీంతో ఇందు అమ్మ అపర్ణాదేవి పిలుస్తూ రాలేవా..? అంటుంది. దీంతో అపర్ణ ఏమైంది ఇందు అని అడగ్గానే.. ఇందు నవ్వుతూ నిన్న ఒక కంపెనీకి జాబ్‌ కోసం అప్లయ్ చేశాను ఇవాళ ఇంటర్వ్యూకు రమ్మని ఫోన్‌ చేశారు.. అని చెప్పగానే.. అపర్ణ భయంగా మళ్లీ ఇంటర్వ్యూనా..? అంటుంది.

దీంతో ఇందు కంగారు పడకు ఈసారి పబ్బులో కాదు ఆఫీసులో అని చెప్పగానే.. అపర్ణ బాధగా ఏమిటోనే.. నీ జీవితం నిమిషానికో గండం క్షణానికో నరకం అన్నట్టు తయారయ్యింది అంటుంది. దీంతో ఇందు అబ్బా అపర్ణాదేవి శుభమాని ఇంటర్వ్వూకు వెళ్తుంటే నీ సెంటిమెంట్‌ డైలాగ్స్ ఏంటి..? సెలెక్ట్‌ అవ్వాలని హ్యాపీగా ఆశీర్వదించు.. అనగానే.. అపర్ణ అది నువ్వు అడగాల్సిన పని లేదే..? నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది అని చెప్పగానే.. సరే తాతయ్యకు టాబ్‌లెట్‌ ఇచ్చావా..? అని ఇందు అడగ్గానే.. ఇవ్వలేదు అని అపర్ణ చెప్పగానే.. ఇందు చిరుకోపంగా అబ్బా టైంకు టాబ్లెట్‌ ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి.. అన్ని నేనే చూసుకోవాలి.. ఇంట్లో పెద్దవాళ్లు మీరో నేనో అర్థం కావడం లేదు అంటూ వెళ్లిపోతుంది.

తర్వాత ఐశ్వర్య ఎరితోనో పార్టీ గురించి మాట్లాడుతుంటే.. స్వాతి వచ్చి అక్కా రాత్రి చేసింది సరిపోలేదా..? అంటూ నిలదీస్తే.. ఐశ్వర్య కోపంగా స్వాతిని కొట్టబోతుంది. ఇందు అడ్డుపడుతుంది. దీంతో ముగురి మధ్య గొడవ జరుగుతుంది. గొడవ అంతా పై నుంచి రేఖ చూస్తుంది. ఐశ్వర్య ఇందు, స్వాతిలను తిట్టడం చూసి హ్యాపీగా ఫీలవుతుంది. అప్పుడే అపర్ణ వచ్చి ఐశ్వర్యను తిడుతుంటే.. భ్రమరాంబ, రేఖ వచ్చి అపర్ణను తిట్టి ఇందును టిఫిన్‌ చేయమని పంపిస్తారు. అపర్ణకు వార్నింగ్‌ ఇస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ అంటే మరీ అంత చులకనేంటీ శ్రీముఖి… యాంకరమ్మ పై భారీ ట్రోల్స్!

ఇండస్ట్రీలో గ్రూపులు.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

ఎట్టకేలకు నరేష్ ఏజ్ బయటపెట్టిన రామ్ ప్రసాద్ !

వివాదంలో బిగ్ బాస్ షో.. విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై క్లారిటీ!

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Big Stories

Advertisement
×