RGV Supports SS Rajamouli: దేవుడిపై రాజమౌళి చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. వారణాసి మూవీ ఈవెంట్‌లో జక్కన్న మాట్లాడుతూ హనుమంతుడిపై అసహనం చూపించాడు. దీనిపై హిందు సంఘాలు మండిపడుతున్నాయి రాజమౌళి మా మనోభవాలు దెబ్బతీశాడంటూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జక్కన్నపై పోలీసు కేసు నమోదైంది. ఈ వివాదంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ మేరకు ఎక్స్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. రాజమౌళికి వత్తాసు పలుకుతూ హిందు సంఘాలు, భక్తులకు చురకలు అంటించారు.
ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. “నాస్తికుడైన రాజమౌళిపై భక్తులమని చెప్పుకుంటున్నవాళ్ల విషం చిమ్ముతున్నారు. అలాంటి వారందరు ఒకటి తెలుసుకోవాలి. భారత్‌లో నాస్తికుడిగా ఉడటం తప్పుకాదు. అలాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో ఏం చెప్తుందంటే నమ్మకుండా ఉండే హక్కు కూడా మనకు ఉంది. కాబట్టి ఆ విషం కక్కేవాళ్లకి నమ్మకం ఉందని చెప్పే హక్కు ఎంత ఉందో.. ఆయనకు (రాజమౌళికి) నమ్మకం లేదని చెప్పే హక్కు కూడా అంతే ఉంది. కాబట్టి విషం కక్కేవారు తాము నమ్ముతామని చెప్పే హక్కు ఉన్నంతగా తాను నమ్మనని చెప్పే హక్కు ఆయనకు ఉంది.
అయితే దేవుడిని నమ్మనని చెప్పే అతను దేవుడు సినిమాలు ఎందుకు తీస్తున్నారనే పనికిమాలిన వాదనకు వస్తే.. “దేవుడిని నమ్మకపోతే, తన సినిమాల్లో దేవుడిని ఎందుకు ప్రాధాన్యత గా తీసుకుంటున్నాడు?” అని ప్రశ్నిస్తున్నారు కదా. ఈ లెక్కన చూస్తే ఒక దర్శకుడు గ్యంగ్‌స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్ స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయాలంటే అతడు దెయ్యం అవ్వాలా?’ అని చురకలు వేశారు. అలాగే “మీ అందరికి తెలియని షాకింగ్ నిజమేంటంటే రాజమౌళి దేవుడిని నమ్మకపోయిన.. తన సినిమా ద్వారా ఎంతోమందిలో భక్తి నింపుతున్నారు. అంతేకాదు ఆయనను నమ్మిన భక్తులు కూడా జన్మలో కూడా చూడనంత విజయాన్ని, డబ్బును, అభిమానానాన్ని ఆయనకు ఎందుకు చూపిస్తాడు?” అని అంటున్నారు. ఆ లెక్కన చూస్తే ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా?
మరో షాకింగ్ నిజం ఏంటంటే? రాజమౌళి దేవుడ్ని నమ్మకపోయినా చాలామంది భక్తులు జన్మల్లో కూడా చూడనంత విజయాన్ని, డబ్బును, అభిమానం దేవుడే ఈయనకు వంద రెట్లు ఎక్కువ ఇచ్చాడు” అంటూ రాసుకొచ్చారు. కాబట్టి మీరంత గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. దేవుడికి కి భక్తులకంటే నాస్తికులే ఇష్టం. లేదంటే ఆయన ఇవన్ని పట్టించుకోరేమో. పైన కూర్చుని ఎవరూ నమ్ముతున్నారు.. ఎవరూ నమ్మడం లేదో నోట్ చేసుకోవడం లేదేమో. మరి దేవుడికే ఆయనతో సమస్య లేనప్పుడు. ఈ స్వయం ప్రకటిత దేవుడి దళారులకు బీపీ, అల్సర్లు ఎందుకొస్తున్నట్టు?. నిజానికి ఇక్కడ అసలు సమస్య ఆయన నాస్తికకుడి అని కాదు. అతను దేవుడిని నమ్మకుండానే విజయం సాధించాడు. కానీ, భక్తులమంటూ దేవుడిని పిచ్చిన ఆరాధిస్తున్న వారిలో ఇలాంటి విజయం లేదు. వారంత విఫలం అవుతున్నారనే భయం వారిని పట్టుకుంది. కాబట్టి విశ్వాసులు దేవుడిని సమర్థించడం మానేయండి.
Also Read: Akhanda 2 : అఖండ 2 ఇంట్రడక్షన్ సీన్ ఇదే.. నెక్ట్స్ లెవల్.. గూస్ బంప్స్ గ్యారంటీ!
ఎందుకంటే ఇలాంటి వాదనల వల్ల దేవుడిని అవమానించినట్లే అవుతుంది. వాళ్ల రక్షణ అవసరమయ్యేంత బలహీనుడుగా దేవుడిని చూపిస్తున్నట్లే. మరో నిజం ఏంటంటే.. రాజమౌళి నాస్తికుడు అయినంత మాత్రాన దేవుడు తగ్గిపోడు. నిజం ఏమిటంటే రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడు తగ్గడు. ఎవరైనా నమ్మడం మానేసిన క్షణంలో విశ్వాసం కూలిపోతుందని భావించే వారిలో అభద్రత పెరుగుతుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోండి. రాజమౌళి బాగానే ఉన్నాడు. ఆ దేవుడు బాగానే ఉన్నాడు. బాధపడేది ఎవరంటే వీరిద్దరిని అర్థం చేసుకోలేని జనం మాత్రమే. అందుకే వారణాసి సినిమాతో దేవుడు మరోసారి రాజమౌళిని నిండుగా ఆశీర్వదించబోతున్నాడు. ఓ సూపర్ బ్లాక్ బస్టర్, భారీ కలెక్షన్స్‌తో ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ని మరింత పెంచబోతున్నాడు. ఇది చూసి ఓడిన వాళ్లంత అసూయతో ఏడుస్తూ ఉండొచ్చు. చివరిగా చెప్పేదేంటంటే.. ఇది దేవుడిపై నమ్మకంలా నటించే పిచ్చి అసూయా మాత్రమే. ప్రతి ఒక్కరు గ్రహించి శాంతించండి. జై శ్రీరామ్” అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సంచలనం రేపుతుంది. వర్మ కామెంట్స్ హిందు సంఘాలను మరింత రెచ్చగొట్టేలా ఉండటంతో ఇది ఎలాంటి వివాదానికి దారితీస్తుందోననే ఆసక్తి నెలకొంది.
In the context of all the venom being spewed by the so called believers on @ssrajamouli they should know that being an atheist in India is not a crime . Article 25 of the Constitution protects the right to not believe
So he has every right to say he doesn’t believe as much as the…— Ram Gopal Varma (@RGVzoomin) November 21, 2025