E-Paper
Advertisement

Eggs Rate Today: ఆకాశాన్ని అంటుతున్న గుడ్ల రేట్లు, మరీ ఇంతనా?

Eggs Rate Today:  ఆకాశాన్ని అంటుతున్న గుడ్ల రేట్లు, మరీ ఇంతనా?
Advertisement

Eggs Prices In Tealnagan & AP:  గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషియనిస్టులు చెప్తుంటారు. రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటారు. చిన్నా పెద్దా అంతా రోజూ ఒక గుడ్డు తినాలంటారు. ఇక ఎగ్ నాన్ వెజ్ కాదు, శాకాహారులు కూడా తినవచ్చు అంటుంది నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ. ఇందులోని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కార్తీకమాసం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇంట్లో గుడ్లను వినియోగించడం మానేశారు. వాస్తవానికి ఈ సమయంలో ధరలు భారీగా తగ్గుతాయి. కానీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఈసారి గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. జనాలు బాబోయ్ ఇంతరేటా అని షాకవుతున్నారు.

 ఆల్ టైమ్ రికార్డు పలుకుతున్న గుడ్ల ధరలు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల రేట్లు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా రూ. 8 నుంచి 9 పలుకుంది. హోల్ సేల్ సెంటర్లలో ఒక ట్రే(30) గుడ్లకు రూ. 200 నుంచి రూ. 210 తీసుకుంటున్నారు. ఇవాళ్టితో కార్తీక మాసం ముగియడంతో పెద్ద ఎత్తున పెరిగిన ఎగ్స్ ధరలు చూసిన జనాలు షాక్ అవుతున్నారు. హోల్‌ సేల్ మార్కెట్లలో 100 గుడ్ల క్రేట్ దాదాపు రూ.670 నుంచి రూ. 700 పలుకుతుంది.  హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీనగర్ తో పాటు విశాఖపట్నం, చిత్తూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో హోల్‌ సేల్ ధరలు ఒక్కో క్రేట్‌కు సుమారు రూ. 700 పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్ లో ఒక్కో గుడ్డు రూ. 7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. మొత్తంగా గుడ్ల ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి.

Advertisement

Read Also: 2026లో భూమి అంతం? దీనిపై AI ఏం చెప్పిందో తెలుసా? ఇది చదివితే ఆశ్చర్యపోతారు!

గుడ్ల రేట్లు పెరగడానికి కారణాలు ఏంటంటే?  

కార్తీకమాసం పూర్తికాక ముందే గుడ్ల రేట్లకు రెక్కలు రావడానికి పలు కారణాలు ఉన్నాయంటేన్నా ఫౌల్ట్రీ యజమానులు.  ఉత్తారాది రాష్ట్రాల్లో చలితీవ్రత పెరగడంతో అక్కడ గుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియాకు ఎగుమతులు పెరిగాయి.  అటు రీసెంట్ గా వచ్చిన మొంథా తుఫాన్ ప్రభావం పౌల్ట్రీ రంగం మీద భారీగా పడింది. చాలా చోట్ల కోళ్లు చనిపోవడంతో గుడ్ల సరఫరాపై ప్రభావం చూపింది.  అదే సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఈ మొత్త కారణాలతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగింది. ఫలితంగా గుడ్ల ధరలు భారీగా పెరిగాయంటున్నారు నిపుణులు. చికెన్ ధరలు తక్కువగా ఉండటం, గుడ్ల ధరలు పెరడం పట్ల వినియోగదారులు, గుడ్ల కంటే చికెన్ తీసుకెళ్లడమే బెస్ట్ అని భావిస్తున్నారు. అయితే, మరికొద్ది రోజుల్లోనే పౌల్ట్రీ రంగం సెట్ రైట్ అవుతుందని, గుడ్ల ధరలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Read Also: ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్!

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×