Ram Gopal Varma : తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఐ బొమ్మ రవి అరెస్ట్ పై ఇప్పటికే పలువురు నిర్మాతలు, దర్శకులు స్పందించారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లు ఇలాంటి పైరసీల వల్ల చాలా నష్టపోతున్నారు అంటూ పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసు పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ పైరసీ లపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఐబొమ్మ రవి అరెస్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పైరసీ ఆగాలంటే ఏం చెయ్యాలో అన్నది లాజిక్ తో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఐబొమ్మ రవి అరెస్ట్ పై సంచలను విషయాలను పంచుకున్నారు.. ఆయన మాట్లాడుతూ.. పైరసీ ఆగకపోవడానికి అసలు కారణం ప్రజల డిమాండ్‌నే అని వర్మ స్పష్టం చేశారు. టెక్నాలజీ, పోలీసుల నిఘా బలహీనత వల్ల కాదు, పైరసీ సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నంతవరకూ రవి లాంటి పైరసీ వాళ్లు వస్తూనే ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.. పైరసీకి మద్దతు ఇచ్చేవారు చూపే లాజిక్‌ను వర్మ వ్యంగ్యంగా ఎండగట్టారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చేసే కొన్ని పొరపాట్లు వల్ల పైరసీ గాళ్లు పుట్టుకొస్తున్నారు అని వర్మ అన్నారు. లాజిక్ తో పైరసీ గురించి వర్మ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు పైరసీని నిజంగా అరికట్టాలంటే, సరఫరా చేసేవారినే కాకుండా.. ఎవరైతే పైరేటెడ్ కంటెంట్‌ను చూసే ప్రేక్షకులను కూడా నేరస్తులుగా పరిగణించాలి అని వర్మ సూచించారు. నేను కూడా పైరేటెడ్ కంటెంట్ చూస్తాను.. అలాంటి వారిని గుర్తించి బయటపెట్టండి. అప్పుడే ఎవరు చూడరు అని సలహాలు ఇచ్చారు వర్మ. వర్మ మాటలకు మూవీ లవర్స్ ఫిదా.. ఆయన లాజిక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
Also Read:ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే వెరీ స్పెషల్..
ఇక ఇదే ఇంటర్వ్యూలో.. రాజమౌళి ప్రస్తావన వచ్చింది. రాజమౌళి పై సనాతన ధర్మ సభ్యులు మండిపడుతున్నారు. ఆయన మాట్లాడింది ముమ్మటికే తప్పు అని ఖండిస్తున్నారు అంటూ యాంకర్ రాంగోపాల్ వర్మ అని అడిగారు. ఆయన మాట్లాడుతూ రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కసు మాత్రమే. కేవలం జలసి తోనే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు తప్ప రాజమౌళి అక్కడ ఏమి తప్పుగా మాట్లాడలేదు. ఆయన టెన్షన్లు ఆయనకు ఉంటాయి ఈరోజు తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడంటే దేవుడు సపోర్టు ఆయనకు లేకుండానే అంత దూరం వెళ్ళాడా అని రాజమౌళి ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. ఒకరిని చూసి ఎప్పుడు కుళ్ళుకోకూడదు.. ఇక్కడ ఎవరికీ ఎవరు నష్టం చేయలేదు ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది అని ఇండైరెక్టుగా రాజమౌళి పై కామెంట్లు చేస్తున్న వాళ్ళందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వర్మ.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో బయట రావడంతో.. చాలామంది నెటిజన్లు వర్మ మాట్లాడింది 100% కరెక్ట్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తానికి వర్మ లాజిక్ లపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.