E-Paper
Advertisement

OTT Movie : హైకింగ్ కోసం వెళ్లి అమ్మాయిలు మిస్సింగ్… క్షణక్షణం ఉత్కంఠ… అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : హైకింగ్ కోసం వెళ్లి అమ్మాయిలు మిస్సింగ్… క్షణక్షణం ఉత్కంఠ… అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఈ మధ్య ఆడియన్స్ థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మేకర్స్ కూడా సరికొత్త స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ పీక్స్ లో ఉంటాయి. అడవిలో హికింగ్ కి వెళ్ళిన అమ్మాయిల మిస్సింగ్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.  మతి పోగొట్టే ట్విస్ట్లు ఇందులో ఒక్కోటి వస్తూనే ఉంటాయి. క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ఫోర్స్ ఆఫ్ నేచర్: ది డ్రై 2’ 2024లో విడుదలైన ఆస్ట్రేలియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. దీనిని రాబర్ట్ కొన్నోలీ రచించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2020లో వచ్చిన ‘ది డ్రై’ కి సీక్వెల్ గా, జేన్ హార్పర్ 2017 రాసిన నవల ‘ఫోర్స్ ఆఫ్ నేచర్’ ఆధారంగా రూపొందింది. 112 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.9/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 8న థియేటర్స్‌లో విడుదలై, ప్రస్తుతం ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆస్ట్రేలియాలోని పర్వతాల అడవుల్లో ఒక పెద్ద కంపెనీ 5 మంది మహిళల్ని “టీమ్ బిల్డింగ్” పేరుతో హైకింగ్‌కి పంపుతుంది. ఆ అయిదుగురు: బాస్ బ్రీ, లారెన్, బెత్, జిల్, అలిస్. వాళ్లంతా కలిసి అడవిలోకి వెళ్లి మూడు రోజులు గడపాలి. కానీ మొదటి రోజే భారీ వర్షం కురిసి, ఫోన్ సిగ్నల్ పోయి, మ్యాప్ కూడా పోతుంది. మళ్లీ నాలుగు రోజుల తర్వాత నలుగురు మాత్రమే తిరిగి వస్తారు. వీరిలో అలిస్ మిస్సింగ్ అవుతుంది. ఆ నలుగురూ ఏడుస్తూ, గాయాలతో, భయంతో వచ్చి పోలీస్ స్టేషన్‌లో కూర్చుంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఒక్కో కథ చెబుతారు. ఇక్కడే ఎంట్రీ ఇస్తాడు ఫెడరల్ ఏజెంట్ ఆరోన్ ఫాల్క్. నిజానికి అలిస్ అతని సీక్రెట్ ఇన్ఫర్మర్. ఆ కంపెనీలో జరుగుతున్న కోట్ల రూపాయల మనీ లాండరింగ్ గురించి అలిస్ ఫాల్క్‌కి ఇన్ఫో ఇచ్చేది. ఇప్పుడు అలిస్ గల్లంతు అయిందంటే… ఆమెను ఎవరో డైరెక్ట్‌గా టార్గెట్ చేశారని ఫాల్క్ అనుమానం.

Read Also : అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఈ కేటుగాడు… కంటిపై రెప్ప వేయడం మర్చిపోయేలా చేసే క్రైమ్ థ్రిల్లర్

అతను తన పార్ట్‌నర్ కార్మెన్‌తో కలిసి ఆ నలుగురు మహిళల్ని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కరి వెర్షన్ విన్నాక ఫాల్క్‌కి ఒకటే అర్థమవుతుంది. ఆ అయిదుగురి మధ్య ఎక్కడో పెద్ద సీక్రెట్ ఉంది. బహుశా అలిస్ హత్య కూడా జరిగి ఉండొచ్చు అనుకుంటాడు. ఇక ఫాల్క్‌ కి అడవిలో మంచు కురిసే రోడ్లు, కారు టైర్ మార్కులు, బ్లడ్ స్టెయిన్స్… ఒక్కో క్లూ దొరుకుతుంటే టెన్షన్ పెరుగుతుంది. చివరి వరకు “అలిస్ బతికే ఉందా? చచ్చిపోయిందా? ఎవరు చంపారు? లేక ఇదంతా యాక్సిడెంటా? అని అతని మెదడుతో పాటు ఆడియన్స్ బుర్ర కూడా గిర్రున తిరుగుతుంది. చివరి 20 నిమిషాల్లో ఒక్కసారిగా ఊహించని ట్విస్టుతో అలిస్ ఏమైందనేది తెలుస్తుంది.
Advertisement

 

 

Related News

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

Big Stories

Advertisement
×