Andhra King Taluka Collections: ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా‘. ఏ ఫ్యాన్ బయోపిక్గా మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ చితరం నవంబర్ 27న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం తొలిరోజు మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లు చేస్తుందనుకుంటే అది పెద్ద వర్కౌట్ కావడం లేదనిపిస్తోంది. ఈ మూవీ వసూళ్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.
విడుదలై మూడు రోజు లైన ఆంధ్ర కింగ్ తాలుకా కలెక్షన్స్ రూ. 10 కోట్లు కూడా దాటలేదు. ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత చేసిందంటే. కాగా గత కొన్ని రోజులుగా రామ్ పోతినేని కలిసి రావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కెరీర్ చెప్పుకోదగ్గ హిట్ లేదు. మరోవైపు భాగ్యశ్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసింది. అవి కూడా బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్. కింగ్డమ్ ఓకే ఓకే అనిపించింది. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలుకా పరిస్థితి కూడా అంతే అంతే అన్నట్టు ఉంది. ఈ సినిమాపై రామ్ పోతినేని, భాగ్యశ్రీలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ మూవీ హిట్ వారికి చాలా ముఖ్యం. కానీ, థియేటర్లలో ఈ చిత్రానికి పెద్దగా బజ్ కనిపించడం. ఫస్ట్ టాక్ కూడా ఆశించినట్టు లేదు. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనిపిస్తుంది. ఈ మధ్య చిన్న సినిమాలు కూడా భారీ విజయం సాధిస్తున్నాయి. కానీ, హై రేంజ్ హీరో అయిన రామ్ పోతినేని చిత్రం తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫస్ట్ డే ఇండియా వైడ్ గా ఈ సినిమా రూ. 4.15 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ. 3.1 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తం ఓవర్సిస్తో కలిసి ఆంధ్ర కింగ్ తాలుకా రెండు రోజుల్లో రూ. 8 కోట్ల పైగా గ్రాస్ చేసింది.
ఇలా రెండు రోజులకు కూడా ఈ సినిమా కనీసం రూ. 10 కోట్లు కూడా క్రాస్ చేయకపోవడం గమనార్హం. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అభమాను కోసం తీసిన సినిమా.. అభిమానులు కూడా చూడకపోవడం విచారమంటున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు శనివారం, పైగా ఇప్పుడు థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి.. ఈ చిత్రం వసూళ్లు మరికాస్తా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. తొలి వీకెండ్లో అయిన మూవీ వసూళ్లు పెరుగుతాయో లేదో చూడాలి.
Also Read: Randeep Hooda: 50ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న బాలీవుడ్ విలన్
కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన సంగతి తెలిసిందే. ఉపేంద్ర, రామ్ పోతినేని స్టార్స్ నటించడంతో ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధాన పాత్రలు, ఇతర నటీనటుల పారితోషికంతో పాటు నిర్మాణ వ్యయం అంత కలిపి ఆంధ్రకింగ్ తాలుకాను తెరకెక్కించేందుకు మొత్తం రూ. 70 లక్షల ఖర్చు అయినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లో పడాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల షేర్, రూ. 60 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితుల అంచన.