Andhra King Taluka : రామ్ పోతినేని కథానాయకుడిగా ‘రారా కృష్ణయ్య’ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా రూపొందింది. గతవారం నవంబర్ 27న ఈ సినిమాని రిలీజ్ చేశారు. సినిమా చూసిన వారంతా పాజిటివ్ టాక్ చెప్పారు. రామ్ బాగా నటించాడని, హీరోయిన్ భాగ్య శ్రీ అందంగా కనిపిస్తూనే పల్లెటూరి అమ్మాయిలా కరెక్ట్ గా సూట్ అయ్యిందని, పాటలు, క్లైమాక్స్ వంటివి అన్నీ బాగున్నాయని.. సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
సాధారణంగా ఇలాంటి టాక్ వస్తే.. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలాడిపోతాయి. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విషయంలో రివర్స్ అయ్యింది. ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం లేదు. మొదటి రోజే కనీసం 30 శాతం ఆక్యుపెన్సీలు నమోదు కాలేదు. 2వ రోజు నుండి పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది. కనీసం శని, ఆదివారాలు కూడా ఈ సినిమా వాడుకోకపోవడం బాధాకరం.
హీరో, హీరోయిన్లను అమెరికాలో ప్రమోషన్స్ చేయడానికి పంపించారు. పోనీ అక్కడైనా ఈ సినిమా అద్భుతాలు చేసిందా అంటే అదీ లేదు. కనీసం హాఫ్ మిలియన్ కూడా ఓపెనింగ్ వీకెండ్లో కలెక్ట్ చేయలేదు. ఓవరాల్ గా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వీకెండ్ కి 50 శాతం కూడా రికవరీ సాధించలేదు. వీక్ డేస్ లో అయితే చాలా ఏరియాల్లో డెఫిసిట్లు పడ్డాయి. ఈ వారం ‘అఖండ 2’ వస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలకి టర్మినేషన్ నోటీసులు ఇచ్చేశారు. వచ్చిన నష్టాల్లో 25 శాతం కాంపెన్సేషన్ చేయాలనేది అగ్రిమెంట్.
దీంతో నిర్మాతలు అలర్ట్ అయ్యి హడావిడిగా రామ్ ను విదేశాల నుండి రప్పించి ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాని పుష్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిర్మాత ఇలాంటి మంచి సినిమాలను ఆదరించకపోతే.. రెగ్యులర్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలే తీస్తామన్నట్టు ఇండైరెక్ట్ ఆడియన్స్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇక హీరో రామ్ అయితే ఈ సినిమా ఫలితాన్ని అప్పుడే డిసైడ్ చేయొద్దని విన్నవించుకున్నాడు.
కచ్చితంగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి లాంగ్ రన్ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ‘అఖండ 2’ ఉండగా అది జరగని పని. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం థియేటర్లు హోల్డ్ చేసుకున్నామని.. సో ఆ సినిమా వచ్చినా ఇబ్బంది లేదు అని నిర్మాత చెబుతున్నాడు.
వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నా.. ‘ఆంధ్ర కింగ్’ కి నష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమా థియేట్రికల్ గా రూ.25 కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పటివరకు రూ.11 కోట్లు షేర్ మాత్రమే నమోదైంది. అంటే ఇంకా రూ.14 కోట్లు కలెక్ట్ చేయాలి. మొదటి వీకెండ్ సోలో రిలీజ్ తో సాధ్యం కానిది.. ‘అఖండ 2’ సినిమా పోటీతో సాధ్యమవుతుందా?