E-Paper
Advertisement

HILT GO Leak Controversy: రేవంత్ ప్రభుత్వంపై లీకువీరుల కుట్ర.. రిలీజ్‌కు ముందే కేటీఆర్‌కు హిల్ట్ జీవో కాపీ..!

HILT GO Leak Controversy: రేవంత్ ప్రభుత్వంపై లీకువీరుల కుట్ర.. రిలీజ్‌కు ముందే కేటీఆర్‌కు హిల్ట్ జీవో కాపీ..!
Advertisement

HILT GO Leak Controversy: తెలంగాణ సచివాలయంలో లీకుల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. హిల్ట్‌‌కు సంబంధించిన అత్యంత కీలక జీవో విడుదలకాకముందే.. ప్రతిపక్ష నేత కేటీఆర్ మొబైల్‌కు ఎలా చేరిందన్న ప్రశ్న.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లీక్ వెనుక వ్యవస్థాబద్ధమైన కుట్ర ఉందన్న అనుమానాలతో ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వ ప్రతిష్టను బద్నాం చేయాలన్న ఆలోచనతోనే ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ లీక్ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయని వర్గాలు చెబుతున్నాయి.

హిల్ట్‌కు సంబంధించిన జీవో తయారీ ప్రక్రియ అంతా కూడా.. అత్యంత గోప్యంగా జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ జీవో తయారీ సమయంలో సెక్రటేరియట్‌లో కేవలం అతికొద్ది మంది అధికారులకే యాక్సెస్ ఉంటుందని తెలుస్తోంది. అలాంటిది జీవో విడుదలకు ముందే అది ప్రతిపక్ష నేత మొబైల్‌కు చేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జీవో డ్రాఫ్ట్ పూర్తయ్యే దశలోనే అది కేటీఆర్ మొబైల్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

ఈ వ్యవహారంలో పరిశ్రమల శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపైనే ప్రధానంగా అనుమానాలు కేంద్రీకృతమయ్యాయి. ఎందుకంటే హిల్ట్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఫైల్స్ అన్నీ పరిశ్రమల శాఖ పరిధిలోనే నిర్వహించబడతాయి. ఈ శాఖలో కీలకమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఇంతకు ముందు కూడా అధికారిక సమాచారాన్ని బయటకు చేరవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జీవో విడుదల కాకముందే కేటీఆర్ మొబైల్‌కు అది ఎలా చేరిందన్నది ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. జీవో తయారయ్యే దశలో ఉన్న డిజిటల్ ఫైళ్లను ఎవరు డౌన్‌లోడ్ చేశారు? ఎవరి లాగిన్ ఐడీ ద్వారా ఆ ఫైలు బయటకు వెళ్లింది? ఫైల్ బయటికి పంపినప్పుడు ఏయే ఐపీ అడ్రెసులు ఉపయోగించబడ్డాయి? వంటి కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది. జీవో తయారీ సమయంలో సెక్రటేరియట్‌లో ఉన్న సిబ్బంది కదలికలను నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా జీవో తయారైన సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి ఫోన్‌ల నుంచి డేటా ట్రాన్స్‌ఫర్ జరిగింది, ఎవరు ఎవరితో మాట్లాడారు అన్న ప్రతీ అంశాన్ని డిజిటల్ ఆధారాలతో కూడి విశ్లేషిస్తున్నారు.

విజిలెన్స్ అధికారులు సెక్రటేరియట్‌లోని కీలక కంప్యూటర్లను, సర్వర్లను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ లీక్ ఒక వ్యక్తి పని కాకుండా, వ్యవస్థలోని కొందరి సమన్వయంతో జరిగిన సంఘటనగా అధికారులు భావిస్తున్నారు. అందుకే ఒకరి కంటే ఎక్కువ మంది అధికారులను అనుమానితుల జాబితాలో చేర్చినట్లు సమాచారం.

Also Read: సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మిస్సింగ్.. ఆ జిల్లాలో సంచలనం

ఇక కేటీఆర్‌తో లీకువీరులకు ఉన్న సంబంధాలపై కూడా విస్తృతంగా ఆరా తీస్తున్నారు. గతంలో కేటీఆర్‌తో సన్నిహితంగా పనిచేసిన కొందరు అధికారులపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించబడింది. వారు ప్రస్తుతం ఎటువంటి పోస్టింగ్‌లో ఉన్నారు, హిల్ట్ జీవో తయారీకి సంబంధించిన ప్రక్రియలో వారికి ఏమైనా పాత్ర ఉందా అన్న కోణంలో విచారణ వేగవంతమైంది.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×