E-Paper
Advertisement

Ind vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాపై కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

Ind vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాపై కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
Advertisement

Ind vs SA 2nd ODI: రాయ్ పూర్ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండవ వన్డేలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ కి దిగింది. ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన యశస్వి జైష్వాల్ – రోహిత్ శర్మ ముందు నుంచే అటాకింగ్ ప్రారంభించారు. యశస్వి జైష్వాల్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్ గా మలిచాడు.

Also Read: Harshit Rana: గంభీర్‌ కొడుకు హ‌ర్షిత్ రాణా దూల తీర్చిన ఐసీసీ.. ఈ వెధ‌వ ప‌నులు త‌గ్గించుకో అంటూ

Advertisement

కానీ 40 పరుగుల వద్ద.. 4.5 ఓవర్ లో బర్గర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ క్వింటెన్ డికాక్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు రోహిత్ శర్మ. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తరువాత భారత జట్టు 52 పరుగుల వద్ద రెండవ వికెట్ ని కోల్పోయింది. యాన్సన్ బౌలింగ్ లో 9.4 ఓవర్ వద్ద బాష్ కి క్యాచ్ కి వెనుదిరిగాడు యశస్వి జైస్వాల్. రెండవ వన్డే లో కూడా తీవ్ర నిరాశపరిచి కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత రుతురాజ్ గైక్వాడ్ – విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతున్నారు.

 

రుతురాజ్ – కోహ్లీ సెంచరీలు:

Advertisement

ఈ క్రమంలో ఋతురాజ్ గైక్వాడ్ తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 77 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్స్ లతో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా రుతురాజ్ సెంచరీ చేసిన సమయంలో 91 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. 35.4 ఓవర్ల వద్ద మార్కో యాన్సన్ బౌలింగ్ లో.. రుతురాజ్ గైక్వాడ్ {105} భారీ షాట్ కి ప్రయత్నించి.. డీ జోర్జి కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో మూడవ వికెట్ కి విరాట్ కోహ్లీ – రుతురాజు గైక్వాడ్ 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కెప్టెన్ కే.ఎల్ రాహుల్ క్రీజ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా వన్డెల్ల్లో తన 53వ సెంచరీని నమోదు చేశాడు. 90 బంతులలో 100 పరుగులు పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ. ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టు 38 ఓవర్ల వద్ద మూడు వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.

Also Read: Mike Hussey: CSK డ్రెస్సింగ్ రూంలో హుక్కా కొడతారు.. ధోని బండారం బయటపెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్

 

సౌత్ ఆఫ్రికా పై 7వ సెంచరీ:

ఈ సెంచరీ తో సౌత్ ఆఫ్రికా పై విరాట్ కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య ఏడుకు చేరింది. తొలి వన్డేలో కూడా సెంచరీ తో చెలరేగిన కోహ్లీ.. రెండవ వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఓపెనర్లను కోల్పోయి తడబడ్డ టీమ్ ఇండియాని గాడిలో పెట్టి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక గైక్వాడ్ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్ 1, మార్కో యాన్సెన్ 2 వికెట్లు పడగొట్టారు.

Related News

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×