E-Paper
Advertisement

Andhra King Taluka: ఇది నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్, ఇంటర్వ్యూ కోసం ఏకంగా ఆ పని చేస్తున్నారు

Andhra King Taluka: ఇది నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్, ఇంటర్వ్యూ కోసం ఏకంగా ఆ పని చేస్తున్నారు
Advertisement

Andhra King Taluka: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. ఎనర్జిటిక్ హీరోగా రామ్ కి మంచి పేరు ఉంది. షార్ట్ ఫిలింతో కెరీర్ మొదలు పెట్టిన రామ్ దేవదాసు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రవి చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాస్ సినిమా మంచి హిట్ అయింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత మంచి పాజిటివ్ టాక్ సాధించుకుంది.

ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేయడం మొదలుపెట్టాడు రామ్. రామ్ కెరియర్ లో కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా ఆ సినిమా కోసం రామ్ పడిన కష్టం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో రామ్ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత రామ్ కు, పూరి జగన్నాథ్ కు ఇద్దరికీ హిట్ పడలేదు. వీరిద్దరూ కలిసి చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా వర్కౌట్ కాలేదు.

నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్

Advertisement

ప్రస్తుతం రామ్ పోతినేని మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలుక అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక థియేటర్ ను రెంటుకు తీసుకొని దానిలో ఇంటర్వ్యూ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక సరికొత్త ఆలోచన అని చెప్పాలి. తీసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.

ఈ సినిమా స్టోరీ లైన్ ఒక అభిమానికి సంబంధించింది. అందుకే టైటిల్ ట్యాగ్ లైన్ కూడా ఫ్యాన్ బయోపిక్ అని పెట్టారు. విపరీతంగా ఒక హీరోని ఇష్టపడే అభిమానికి మరియు ఆ హీరోకి మధ్య బాండింగ్ గురించి ఈ సినిమా ఉండబోతుంది అని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా టీజర్ లో కూడా థియేటర్లో ఒక సీన్ ఉంటుంది. నువ్వు ఉన్నావని మీ హీరోకి కూడా తెలియదు అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్ థియేటర్లోనే ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూ కూడా అలా ప్లాన్ చేశారేమో.

Advertisement

Also Read: Varanasi: రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.. 2027 ని బాగానే టార్గెట్ చేశాడు

గుడ్ ఎక్స్పెక్టేషన్స్

ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలానే మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన మిశ్శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఉండటం సహజం.

మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాలుగు పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఈరోజుల్లో పాటలు మంచి సక్సెస్ సాధిస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా కోసం తన టాలెంట్ అంతా బయటకు తీశాడు రామ్. పాటలు రాయడం, పాడటం కూడా చేసేసాడు. ఇక ఈ సినిమా రామ్ కి ఎంత మేరకు సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×