E-Paper
Advertisement

CM Chandrababu: బాబు సరికొత్త విజనరీ.. ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు..

CM Chandrababu: బాబు సరికొత్త విజనరీ.. ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు..
Advertisement

CM Chandrababu: ఎప్పుడైనా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి, అయ్యో ఆకాశంలో ఎగిరిపోతే ఎంత బాగుండు? అని అనుకున్నారా? ఇక కలలు కనడం ఆపేయండి. ఇండియాలో అది నిజం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎస్.. ఏపీ సీఎం చంద్రబాబు లేటెస్ట్ విజన్ ఎయిర్‌ ట్యాక్సీ. సీఎం ఆలోచన ప్రకారం రెండేళ్లలో ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు ఎగరాలి. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది! డ్రోన్ ట్యాక్సీల విషయంలో ఇండియాలో చాలా అడ్డంకులు ఉన్నాయి. బెంగళూరు వంటి మెట్రో సిటీలే వాటిని అందుబాటులోకి తేవడానికి 2028 వరకు టైమ్‌లైన్ పెట్టుకుంటే.. ఏపీలో మాత్రం జస్ట్ టూ ఇయర్స్‌లో ఇది సాధ్యమేనా? మరి అసలు ఈ డ్రోన్ ట్యాక్సీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?

జస్ట్‌ టూ ఇయర్స్‌లో డ్రోన్‌ ట్యాక్సీని తీసుకువస్తామని చంద్రబాబు. అంతేకాదు ఫ్లైట్స్‌ కోసం ATC ఉన్నట్టే.. డ్రోన్స్‌ కోసం DTCని కూడా సిద్ధం చేస్తామని తెలిపారు. అంటే డ్రోన్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అన్నమాట. ఇదంతా ఏపీలో సాధ్యమైనా? ఎందుకంటే ఇండియాలో డ్రోన్‌ ట్యాక్సీ టెస్టింగ్ దశలో ఉన్నది కేవలం బెంగళూరు సిటీలో మాత్రమే. అక్కడే 2028 వరకు ఆ సేవలను అందుబాటులోకి తెస్తామని సదరు కంపెనీ చెబుతోంది. అలాంటిది ఏపీలో రెండేళ్లలోనే డ్రోన్‌ ట్యాక్సీలు పాజిబులేనా?

Advertisement

300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం..
విశాఖ వేదికగా జరుగుతున్న CII సమ్మిట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు తన భవిష్యత్‌ ప్లాన్స్‌ను బయటపెట్టారు. అప్పుడు టెక్నాలజీకి నాంది పలికాను.. ఇప్పుడు దాన్ని నెక్స్ట్‌ స్టేజ్‌కు తీసుకెళ్తానంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రకటనే కాదు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు పెట్టుబడుల సదస్సు వేదికగా శంకుస్థాపన కూడా చేశారు. కర్నూలు జిల్లా వార్వకల్లులో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. మొత్తం 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో టెస్టింగ్ సర్టిఫికేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 25 వేల మందికి శిక్షణ ఇచ్చేలా సౌకర్యం కల్పిస్తారు. మరోవైపు తిరుపతి, శ్రీ సత్య సాయి జిల్లాలో స్పేస్ సిటీ ఏర్పాటు కానుంది. పది సంవత్సరాల్లో 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. 35 వేల మందికి ఉపాధి కూడా లభించనుంది.

కమర్షియల్ సేవలు సవాల్‌తో కూడిన పని
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల టైమ్‌లైన్‌లో డ్రోన్ ట్యాక్సీలను తీసుకురావాలనే సీఎం చంద్రబాబు లక్ష్యం సాధ్యమైనప్పటికీ, అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్రీఫ్ గా చెప్పాలంటే ప్యాసింజర్లను తరలించే పూర్తి స్థాయి వాణిజ్య సేవలు ప్రారంభించడం సవాలుతో కూడుకున్నది, కానీ పైలట్ సేవలు తీసుకురావడం మాత్రం సాధ్యమయ్యే పని అని చెప్పవచ్చు. డ్రోన్ ట్యాక్సీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతి కావాలి. సర్టిఫికేషన్ కూడా అవసరం పడుతుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనానికి ఇంకా పూర్తిస్థాయి అనుమతి అయితే లభించలేదు. ఏపీ సర్కార్ కేంద్రంతో కలిసి ఈ ప్రాసెస్ ను స్పీడప్ చేయించాల్సి ఉంటుంది. ఏవియేషన్ పార్ట్ నర్స్ తో కలిసి త్వరగా అనుమతులు పొందగలిగితే, రెండేళ్లలో ట్రయల్ రన్ అయితే చేయవచ్చని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

Advertisement

ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ లాండింగ్ వెహికల్
డ్రోన్ ట్యాక్సీలు నడవాలంటే, వాటికి ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు అవసరం ఉంటుంది. ఈ వాహనాలను టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి వర్టిపోర్ట్ లు అవసరం పడుతాయి. అంతేకాదు వేగవంతమైన ఎలక్ట్రికల్ చార్జింగ్ పాయింట్లు కూడా ఉండాలి. ఏపీ డ్రోన్ హబ్‌గా మారడానికి, స్థానిక తయారీని ప్రారంభించడానికి ఈ టైంబాండ్ సాధ్యమే. తయారీ కేంద్రం ఏర్పాటు అయితే, అక్కడి నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభించడం సులభమవుతుంది.

డ్రోన్ టాక్సీతో ప్రయాణికులను, సరుకుల రవాణా
చంద్రబాబు నోటి నుంచి డ్రోన్ టాక్సీ అనే మాట రావడంతో ఇప్పుడు దానిపైనే చర్చ మొదలయింది. డ్రోన్ టాక్సీ అనేది ఓ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్. అది రిమోట్ గా లేదా స్వయంగా పనిచేస్తుంది. డ్రోన్ టాక్సీ సాయంతో ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటారు. డ్రోన్ టాక్సీని ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ లాండింగ్ వెహికల్ అని పిలుస్తుంటారు. ఎయిర్‌ ట్యాక్సీల్లో సాధారణంగా 4 నుండి 18 వరకు చిన్న రోటర్లు లేదంటే ప్రొపెల్లర్లు ఉంటాయి. ఈ రోటర్లు పైకి లేవడానికి, ముందుకు నడవడానికి, స్టెబిలిటీగా ఉండటానికి యూజ్‌ అవుతాయి. ముందుగా ఫిక్స్‌ చేసిన ఎయిర్‌ రూట్‌లోనే ఇవి ట్రావెల్‌ చేస్తాయి. ఒకవేళ ఒకట్రెండు రోటర్లు ఫెయిల్‌ అయినా సేఫ్‌ ల్యాండింగ్‌ అవుతాయి. కొన్నింటల్లో అత్యవసర పరిస్థితుల కోసం పారాచూట్ వ్యవస్థ కూడా ఉంటుంది.

డ్రోన్ ట్యాక్సీల విషయంలో ఇండియా ప్రపంచంతో పోటీ పడుతోంది. డ్రోన్ విప్లవానికి వేదికవుతోంది. ఇది రాబోయే రోజుల్లో ఏకంగా మన రోజు వారీ ట్రాన్స్ పోర్ట్ సిస్టంను మార్చేసే దిశగా దూసుకుపోనుంది. కేంద్రం తీసుకొచ్చిన డ్రోన్ పాలసీతో ఇప్పటికే వ్యవసాయం నుండి లాజిస్టిక్స్ వరకు ప్రతి రంగంలో డ్రోన్ల వినియోగం ఊపందుకుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీకి టైమ్ వచ్చింది. ఇంతకీ ఎయిర్ ట్యాక్సీల భవిష్యత్తు ఏంటి? వాటిని గాల్లో పెట్టడానికి ఉన్న ఇబ్బందులేంటి?

ఇండియాలో పెరుగుతున్న డ్రోన్ల వినియోగం..
ఇండియాలో డ్రోన్ల వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది. ఇది కేవలం సెక్యూరిటీ పర్పసో లేక ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికో పరిమితం కాలేదు. డ్రోన్లవినియోగం అనేక కీలక రంగాలలో సమూల మార్పులు తీసుకొస్తోంది. 2021 కేంద్రం డ్రోన్‌ పాలసీ రూల్స్‌ ను మరింత సులభతరం చేసింది. ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ పథకాన్ని ప్రకటించింది. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి గతంలో ఉన్న అనుమతుల ప్రక్రియను సులభతరం చేశారు. ప్రస్తుతం భారత్‌లో డ్రోన్ల విస్తృత వినియోగం పలు రంగాల్లో ఉంది. వ్యవసాయ రంగం, డిఫెన్స్‌, మ్యాపింగ్‌-సర్వే, లాజిస్టిక్స్‌ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇక త్వరలో డ్రోన్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా ఇప్పటికే అనేక కంపెనీలు వర్కవుట్‌ చేస్తున్నాయి.

2028 నాటికి సర్లా ఏవియేషన్ ప్లాన్..
బెంగళూరుకు చెందిన స్టార్టప్ అయిన సర్లా ఏవియేషన్, 2028 నాటికి బెంగళూరులో వాణిజ్య సేవను ప్రారంభించాలనే లక్ష్యంతో ‘షున్యా’ అనే ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని అభివృద్ధి చేస్తోంది. ఈ కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఇది ట్రావెల్‌ టైమ్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఎయిర్ టాక్సీ ఆరుగురు ప్రయాణీకులను తీసుకెళ్లేలా రూపొందించబడింది. ఈ ఎయిర్ టాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎలక్ట్రానిక్ సిటీ వంటి ముఖ్య ప్రాంతాలకు ఈ డ్రోన్‌ ట్యాక్సీలతో ప్రయాణీకులను తరలించడానికి ఈ సంస్థలు ప్లాన్లు చేస్తున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే, పీక్ అవర్స్‌లో రోడ్డు మార్గంలో 3 గంటల వరకు పట్టే ప్రయాణ సమయం 19 నిమిషాలకు తగ్గుతుందని అంచనా వేశారు. ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రెండు నుండి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, జాబీ ఏవియేషన్
భారతదేశంలో అర్బన్ ఎయిర్ మొబిలిటీ సేవలను తీసుకురావడానికి ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ Joby Aviation తో కలిసి పనిచేస్తోంది. బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించాలని చూస్తున్నారు. స్కై ఎయిర్‌ అనే సంస్థలు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఎగ్జాంపుల్‌కు కోణనకుంట, కనకపుర రోడ్డు ఏరియాల్లో డ్రోన్లతో మందులు, ఐటెమ్స్‌ డెలివరీ చేస్తున్నాయి. ట్రాఫిక్‌ను తప్పించుకొని, కేవలం 7 నిమిషాల్లో డెలివరీ అందించడమే లక్ష్యంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి డ్రోన్ ట్యాక్సీలు నిర్మాణంలో ఉన్న దశలో ఉన్నాయి. ఇప్పటికే అనేక భారతీయ, అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి. ప్రయాణీకులను తరలించే సేవలు ఇంకా మొదలు కాలేదు. ఈ డ్రోన్ ట్యాక్సీలను నడపడానికి అవసరమైన రెగ్యులేషన్స్, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.

Also Read: ఓ వైపు దూసుకోస్తున్నా అల్పపీడనం.. మరో వైపు వణికిస్తున్న చలి..

డ్రోన్ ట్యాక్సీలను డెవలప్ చేస్తున్న హిహంగ్ వంటి సంస్థలు
ప్రస్తుతం, కొన్ని దేశాలలో డ్రోన్ ట్యాక్సీలు వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులో లేనప్పటికీ, కొన్ని దేశాలలో టెస్టులు చేస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధిలో చైనా ముందుంది. హిహంగ్‌ వంటి సంస్థలు డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేశాయి. వీటికి చైనాలో సర్టిఫికెట్ కూడా లభించింది. కొన్ని ప్రాంతాలలో పరిమిత సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ వంటి నగరాలు అర్బన్ ఎయిర్ మొబిలిటీ కోసం ప్లాన్డ్‌గా పనిచేస్తున్నాయి. త్వరలో డ్రోన్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో కూడా పలు కంపెనీలు డ్రోన్‌ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తున్నాయి. డ్రోన్ ట్యాక్సీలు ఇండియాలో అమల్లోకి వచ్చిన వాటి బడ్జెట్ మాత్రం భారీగానే ఉండే ఛాన్స్ లేకపోలేదు. కానీ కాలం గడిచినకొద్దీ అది కూడా అందరికీ అందుబాటులోకి రావడం మాత్రం ఖాయమని చెప్పాలి. సో చంద్రబాబు ఆలోచన ప్రకారం ఏపీలో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు ఎగురుతాయా లేదా అన్నది చూద్దాం.

Story By Venkatesh, Bigtv

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×